OG Makers On Trailer Delay: పవన్ కళ్యాణ్ ఓజీ(OG Movie) ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 25న మూవీ విడుదల అవుతున్న నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ ఈవెంట్ కి భారీ ఏర్పాట్లు జరిగాయి. ఈ వేడుకకు వరణుడు అడ్డుపడిన.. మూవీ టీం మాత్రం ఎక్కడ తగ్గలేదు. వర్షంలోనే ఈవెంట్ ని కొనసాగించాడు. ఈ వేడుకలో పవన్ ఎన్నడు లేని విధంగా ఫుల్ జోష్‌లో కనిపించాడు. ఎప్పుడు స్పీచ్లతో అదరగొట్టే.. పవర్ స్టార్ ఈసారి మూవీలోని డైలాగ్స్, పాట పాడి అలరించారు.
బ్లాక్ అండ్ బ్లాక్‌లో మూవీ టీం అంత ఆకట్టుకుంది. హీరో, విలన్, ఇతర పాత్రల నుంచి డైరెక్టర్ వరకు ప్రతి ఒక్కరు బ్లాక్ డ్రెస్‌లో వచ్చి స్టేజ్పై కనువిందు చేశారు. ప్రీ–రిలీజ్ ఈవెంట్ తర్వాత ఓజీ మూవీపై బజ్ పెరిగింది. ఇక మూవీపై మరింత హైప్ పెంచుతూ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వరుస ట్వీట్స్, పోస్ట్స్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ క్రేజీ పోస్ట్ వదిలింది. “మేం లేటుగా రావచ్చు.. కానీ, ఎల్లప్పుడు మేము బ్లాస్టర్ అందిస్తాం. దీనికి మినహాయింపు లేదు, చింతించాల్సిన అవసరం లేదు.. తగ్గలెట్టేయడమే.. ఆలస్యమైనా క్వారిటీ కంటెంట్ ఇవ్వడమే మా ప్రధాన ప్రాధన్యత” అంటూ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ తన ట్వీట్ రాసుకొచ్చింది.
అయితే దీనిపై నెటిజన్స్, ఫ్యాన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఈ ట్విట్ అంతర్యం చూస్తుంటే మాత్రం ట్రైలర్ లేట్ చేయడంపై మేకర్స్ఇలా స్పందించారని తెలుస్తోంది. ఇది చసిన నెటిజన్స్ నుంచి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ట్రైలర్ లేట్‌గా వదిలిందే కాకుండా.. డైలాగ్స్ చెబుతున్నారా? అంటున్నారు. ట్రైలర్ రిలీజ్ లేట్‌ని మూవీ టీం ఇలా కవర్ చేసుకుంటుందంటూ మేకర్స్పై వ్యంగ్యాస్త్రాలు వదులుతున్నారు నెటిజన్స్. ట్రైలర్ ఆలస్యమైనందుకు సారీ చెప్పలేదు.. కానీ, డైలాగ్స్తో కవర్ చేసుకుంటున్నారా? పవన్ స్టార్ ఫ్యాన్స్ అసహనం చూపిస్తున్నారు. నిజానికి ఓజీ ట్రైలర్ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్ విడుదల చేస్తున్నట్టు చెప్పారు.
Also Read: Venky – Trivikram: వెంకీ మామ టైం వచ్చేసింది… గురూజీ పక్కా ప్లాన్
చెప్పినట్టుగానే ఈ వెంట్‌లో ట్రైలర్ ప్రదర్శించారు.. కానీ, ఆపీషియల్‌గా మాత్రం విడుదల చేయలేదు. దీంతో ట్రైలర్ కోసం ఎదురుచూసిన ఆడియన్స్‌కి నిరాశే ఎదురైంది. దీంతో ట్రైలర్ కోసం ఓజీ ఫ్యాన్స్ అంతా నిన్న మొత్తం ఎదురు చూశారు. ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని నిన్నంత కాయలు కాచేలా ఎదురుచూశారు. కానీ, మూవీ టీం మాత్రం కూల్ ఈ రోజు మధ్యాహ్నం ట్రైలర్ వదిలింది. ట్రైలర్ని వాయిదా వేస్తున్నట్టు ఎలాంటి సమాచారం లేదు. కనీసం మేకర్స్ నుంచి ఒక్క పోస్ట్ కూడా రాలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేశారు. కానీ, ఆలస్యాన్ని కవర్ చేసుకుంటూ డీవీవీ ఎంటర్టైమెంట్ చేసిన పోస్ట్పై మాత్రం అభిమానులు, ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు.
We might arrive late… but we always deliver a blaster.
No exceptions. No regrets. Thagaletteyadame…
Quality and content will always be our top priority.
— DVV Entertainment (@DVVMovies) September 22, 2025