Instagram love: ఈ మధ్య కాలంలో యువత సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పొద్దున లేస్తే ఫోన్.. టిఫిన్ చేశాక ఫోన్.. పని చేసుకుంటూ ఫోన్.. ఇలా రోజులో ఎక్కువగా ఫోన్ తోనే గడిపేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అనారోగ్యానికి కూడా గురవుతున్నారు. మరి కొందరు ముక్కు, ముఖం తెలియని వారిని పరిచయం చేసుకోవడం.. ప్రేమ పేరుతో తగాదాలు పెట్టుకోవడం.. చివరకు ప్రాణాలు తీసుకోవడం వరకు తెచ్చుకుంటున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటన చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ స్టాగ్రామ్ లవ్ అమ్మాయి చావుకు దారితీసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
• ఇన్ స్టా పరిచయం కాస్త ప్రేమగా..
యూపీ, కాన్పూర్‌లో ఈ హృదయవిదారక సంఘటన జరిగింది. సూరజ్ కుమార్ ఉత్తమ్ అనే యువకుడు ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్‌లో అకాంక్ష(20) అనే యువతి పరిచయం అయ్యింది. ఇలా ఇన్ స్టాలో రోజు చాటింగ్ చేసుకుంటూ ప్రేమలో పడ్డారు. అకాంక్ష ఓ రెస్టారెంట్ లో పని చేసేది. తన అక్కతో కలిసి కాన్పూర్ లోని బార్రా ప్రాంతంలో నివసించేది. కొన్ని రోజుల తర్వాత అక్కతో గొడవ పెట్టుకుని సూరజ్ కుమార్‌తో కాన్పూర్ లోని ఓ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసించడం మొదలుపెట్టారు.
• యువతి తలను గోడకు బలంగా బాది..
ఇలా కొన్ని రోజుల పాటు సంతోషంగానే ఉన్నారు. ఉన్నట్టుండి ఏమైందో తెలీదు కానీ.. ఇద్దరి మధ్య ఒకరిపై మరొకరికి నమ్మకం తగ్గుతూ వచ్చింది. రెండు నెలల క్రితం అకాంక్ష మరో యువకుడితో మాట్లాడుతున్నట్టు సూరజ్ కు తెలిసింది. దీంతో ఇద్దరికి మధ్య పలుసార్లు వాగ్వాదం, గొడవలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఓపిక కోల్పోయిన సూరజ్ ఆవేశంలో ఆమె తలను బలంగా గోడకు కొట్టాడు. అనంతరం గొంతు పిసికి దారుణంగా హత్య చేశాడు.
• డెడ్ బాడీని బ్యాగులో సర్ది..
హత్య చేసిన అనంతరం భయాందోళనకు గురైనయ సూరజ్.. అతని ఫ్రెండ్ ఆశిష్ కుమార్ ను రూంకి పిలిపించాడు. ఇద్దరు కలిసి అకాంక్ష డెడ్ బాడీని ఓ బ్యాగ్ లో మూటగట్టి.. బైక్ పై 100 కిలోమీటర్ల దూరం వెళ్లి యమునా నదిలో డెడ్ బాడీ పడేసి.. ప్రూఫ్స్ లేకుండా ప్లాన్ వేశారు. అయితే ఆమెను చంపి బ్యాగ్‌లో మూటగట్టిన అనంతరం సూరజ్ బ్యాగ్ తో ఓ సెల్ఫీ తీసుకున్నాడు. పోలీసులకు ఇదే కీలక ఆధారంగా మారింది.
• జైలులో నిందితులు..
ఆగస్టు 8న అకాంక్ష పేరెంట్స్ పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. సూరజే తన కూతురును ఏదైనా చేసి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు మూడు రోజుల క్రితం సూరజ్, ఆశిష్‌లను అరెస్టు చేశారు. నిందితులను గట్టిగా విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. అలాగే సూరజ్ ఫోన్ లో బ్యాగ్ తో తీసుకున్న సెల్ఫీ పోటో బయటపడడంతో తానే హత్య చేసినట్టు అతను ఒప్పుకున్నాడు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ALSO READ: IBPS Recruitment: బిగ్ గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో 13,217 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు
• సోషల్ మీడియా పరిచయాలు వద్దు…
అందుకే సోషల్ మీడియాలో తెలయని వారితో స్నేహం చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. తెలియని వారితో స్నేహం కొనిసాగిస్తే ఇలా అనర్ధాలకే దారి తీస్తుందని చెప్పారు. అలాగే ఈ ఘటన ప్రేమికుల మధ్య నమ్మకం, సహనం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎలా జీవితాలను నాశనం చేస్తాయో ఈ సంఘటన ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు.
ALSO READ: IND VS PAK: మరోసారి టీమిండియా వర్సెస్ పాక్ మ్యాచ్..చచ్చిన పామును మళ్లీ చంపడమే