Homemade Facial: సీజన్స్ బట్టి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వర్షాకాలంలో అయితే మరీనూ.. ఈ కాలంలో చెమట అనేది తక్కువగా వస్తుంటుంది. తద్వారా చర్మంపై మలినాలు, దుమ్మూ, ధూళి ఇతర పదార్ధాలు అలానే ముఖంపై పేరుకుపోతాయి. దీంతో ఎక్కువగా మొటిమలు రావడం, స్కిన్ ఆయిల్‌గా అయిపోవడం వంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇందు కోసం వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో బ్యూటీ క్రీములు ఉపయోగిస్తుంటారు. అయినా ఫలితం ఉండదు. కాబట్టి ఒక్కసారి ఇంట్లోనే మన వంటిట్లో దొరికే నాచురల్ పదార్ధాలతో.. ఈ ఫేసియల్స్ తయారు చేసుకోండి. చర్మ సమస్యలన్ని తొలగిపోతాయి. మరి ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టెప్ -1
చిన్న గిన్న తీసుకుని టీస్పూన్ పచ్చిపాలు, టీస్పూన్ రోజ్ వాటర్ కలిపి.. దూది కాటన్‌తో ముఖానికి అప్లై చేయండి. 10 నిమిషాల పాటు మసాజ్ చేసి.. సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ముఖంపై మట్టి, మృత కణాలు, జిడ్డు అన్ని తొలగిపోతాయి.
స్టెప్ -2
చిన్న బౌల్ తీసుకుని టీ స్పూన్ ఓట్స్, టీ స్పూన్ హనీ, టీ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసుకోండి. 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా ముఖంపై జిడ్డు తొలగిపోవడంతో పాటు, స్కిన్ ఆయిల్‌గా లేకుండా చేస్తుంది. అలానే ముఖంపై మొటిమలు, మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా చర్మం మెరుస్తుంది.
స్టెప్-3
వేడి నీళ్లల్లో తులసి ఆకులు వేసి 10-15 నిమిషాల పాటు ఆవిరి పట్టండి. ఇలా చేయడం ద్వారా ముఖంపై చెమట రూపంలో.. మృత కణాలు, మలినాలు అన్ని తొలగిపోతాయి. చర్మం తాజాగా కనిపిస్తుంది.
స్టెప్-4
టీ స్పూన్ ముల్తానీ మిట్టి, టీ స్పూన్ రోజ్ వాటర్, టీ స్పూన్ నిమ్మరసం కలిపి ఫేస్‌కి అప్లై చేయండి. ఇలా చేస్తే చర్మం తాజాగా, యవ్వనంగా కనిపిస్తుంది.
ఈ టిప్స్ కూడా ఫాలో అవ్వండి
ఓట్ మీల్, అవకాడో ఫేస్ ప్యాక్
ఓట్ మీల్ అనేది ఎక్స్ ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. ఇది నూనెలను గ్రహిస్తుంది. చికాకును కూడా తగ్గిస్తుంది. అవకాడో అరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటుంది. ఇవి చర్మాన్ని జిడ్డుగా ఉంచకుండా హైడ్రేట్ చేస్తుంది. ఇందుకోసం అవకాడోను మెత్తగా చేసి, అందులో రెండు టేబుల్ స్పూన్ ఓట్ మీల్ కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. చర్మాన్ని మృదువుగా చేసి సమతుల్యంగా ఉంచుతుంది.
గుడ్డులోని తెల్లసొన, కలబంద ఫేస్ ప్యాక్
గుడ్డులోని తెల్లసొన చర్మాన్ని బిగుతుగా, దృఢంగా చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కలబంద చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచి అదనపు నూనెలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం చిన్న గిన్నెలో గుడ్డులోని తెల్లసొన తీసుకుని, అందులో కలబంద గుజ్జు కలిపి ముఖానికి పెట్టుకోండి. అరగంట తర్వాత ఫేస్ వాష్‌తో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేయడం ద్వారా చర్మం మృదువుగా, జిడ్డు చర్మాన్ని తొలగిస్తుంది
Also Read: అర్థరాత్రి వరకు మేల్కొంటున్నారా.. అయితే కోరి ప్రమాదాన్ని తెచ్చుకున్నట్లే..
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.