BigTV English

Junior Teaser: జూనియర్ సినిమా టీజర్ రిలీజ్… అదరగొట్టిన గాలి జనార్దన్ రెడ్డి కొడుకు!

Junior Teaser: జూనియర్ సినిమా టీజర్ రిలీజ్… అదరగొట్టిన గాలి జనార్దన్ రెడ్డి కొడుకు!

Junior Teaser: ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి (Gali Janardhan Reddy)కుమారుడి కిరీటి రెడ్డి (Kireeti Reddy)సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈయన హీరోగా “జూనియర్”(Junior) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 18వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. రాధాకృష్ణ దర్శకత్వంలో, వారాహి చలనచిత్ర బ్యానర్ పై రజిని కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కిరీటి రెడ్డికి జోడిగా నటి శ్రీ లీల (Sreeleela)నటించబోతున్నారు. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి జెనీలియా(Genelia) కూడా సౌత్ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.


దేవిశ్రీ మ్యూజిక్..

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు ఈ టీజర్ మాత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పాలి. ఒకేసారి కన్నడ, తెలుగు భాషలలో ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే సినిమా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో, మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లాగా ఉండబోతుందని స్పష్టమవుతుంది. కాలేజీలో ఉండే ఫ్రెండ్షిప్, గొడవలు గురించి, కెరియర్ గురించి అలాగే లవ్ ఇలా అన్ని సన్నివేశాలను కూడా టీజర్ లో ఎంతో స్పష్టంగా చూపించారు. ఇక ఈ టీజర్ లో దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. ఇక శ్రీ లీల కూడా ఎంతో క్యూట్ గా కాలేజీ స్టూడెంట్ పాత్రలో అదరగొట్టారు.


యూత్ ఫుల్ ఎంటర్టైనర్..

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సినిమా పట్ల కూడా మంచి అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. ఇక కిరీట్ రెడ్డి విషయానికి వస్తే ఆయన నటన కానీ, డాన్స్ విషయంలో, యాక్షన్ సన్నివేశాలలో ఎక్కడా కూడా మొదటిసారి కెమెరా ముందుకు వస్తున్న వ్యక్తి లాగా కనిపించలేదు ఎంతో అనుభవం ఉన్న హీరో నటించిన భావన కలుగుతుంది. మొత్తానికి ఒక అద్భుతమైన యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో కిరీట్ రెడ్డి మొదటి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి హీరోగా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవాలనే తన కోరికను “జూనియర్” సినిమా ద్వారా తీరుతుందా ? లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఈ సినిమాలో శ్రీ లీల నటించడం అలాగే జెనీలియా కూడా రీఎంట్రీ ఇవ్వడంతో సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. ఇక జెనీలియా పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఈమె బాలీవుడ్ సినిమాలలో నటిస్తున్న, సౌత్ ఇండస్ట్రీలోకి మాత్రం రీ ఎంట్రీ ఇవ్వలేదు. జూనియర్ సినిమా ద్వారా ఈమె త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా రాబోతున్నారు. ఇక కిరీటి రెడ్డి కుటుంబానికి ఎంతో రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ ఈయన మాత్రం సినిమాలపై ఆసక్తి ఫ్యాషన్ తో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మరి ఈయన మొదటి సినిమా తనకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: Agent Movie: అఖిల్ ఏజెంట్ అందుకే ఫ్లాప్ అయింది.. కావాలనే చేశారా?

Related News

Star Hero: ఆ స్టార్ హీరో మూవీ సెట్ లో 120 మందికి అస్వస్థత!

Bollywood: 3 ఇడియట్స్ నటుడు కన్నుమూత.. కారణం ఏంటంటే?

Anasuya Bharadwaj : అనసూయ మళ్లీ దొరికిందిరోయ్..వీడియో హల్ చల్..

Honey Rose : హనీ రోజ్ నువ్వెక్కడ..? సినిమాలకు గుడ్ బై చెప్పేసిందా..?

OG Movie : పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ హిందీలో శాటిలైట్ రైట్స్‌కు క్రేజీ ఆఫర్.. హిట్ పక్కా..!

War 2 – Ntr: ఎన్టీఆర్ కి ఘోర అవమానం, ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు

Big Stories

×