Viral Video: రీల్స్ పిచ్చిలో పడిపోయారు యువతీయువకులు. ఈ పిచ్చిలో పడి ప్రాణాలను సైతం లెక్క చేయడంలేదు. కేవలం రైలు, దాని మార్గాన్ని ప్రధానంగా ఎంచుకుంటున్నారు. తాజాగా ఓ యువతి అలాంటి పని చేసింది. కారుని రైల్వే ట్రాక్‌పై నడిపింది. కారు వదిలేసి పారిపోతున్న యువతిని స్థానికులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో గిరగిరా తిరిగేస్తోంది.
తక్కువ సమయంలో పాపులర్ కావాలని భావిస్తోంది నేటి యువత. అందుకు రీల్స్ సరైన మార్గమని భావిస్తోంది. ఆ ఉచ్చు నుంచి బయటకు రాలేకపోతోంది. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీని బారిన పడి చాలా మంది మృతి చెందిన ఘటన లేకపోలేదు. తాజాగా రీల్స్ మోజులోపడిన ఓ యువతి ఏకంగా రైల్వే ట్రాకులపై కారును వేగంగా నడుపుకుంటూ వచ్చేసింది.
ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. నాగులపల్లి-శంకర్‌పల్లి మధ్య రైలు పట్టాలపైకి ఓ యువతి కారు వేగంగా నడిపింది. పట్టాలపై కారులో యువతి ఉండటాన్ని గమనించి స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి కారు వదిలేసి పారిపోతుండగా ఆ యువతిని పట్టుకున్నారు. అదే రూట్లో బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు రైలు వస్తోంది.
పరిస్థితిని దూరం నుంచి గమనించాడు. పట్టాలపై కారును గమనించిన లోకో పైలట్, వెంటనే రైలును ఆపేశాడు. ఆ యువతి చేసిన పనికి గంటల తరబడి పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రీల్స్ కోసమే యువతి రైల్వే పట్టాలపై కారు నడిపినట్లు తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా పలు రైళ్లు నిలిచిపోయాయి. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ALSO READ: తల మీద కారు.. 14 సెకన్లలో 100 మీటర్లు పరుగు
కారు నెంబర్ ఆధారంగా ఎవరిది అనేది తెలుసుకునే పనిలో పడ్డారు. ఆ యువతి ఎవరు? రీల్స్ కోసం వచ్చిందా? ఆమె బలవన్మరణానికి ప్రయత్నించిందా లేదా తాగిన మత్తులో అలా చేసిందా అనేదానిపై రైల్వే పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. స్థానికులు, లోకో పైలట్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. యువతా.. ఇప్పిటికైనా మేలుకో? విలువైన సమయాన్ని ఈ విధంగా వేస్టు చేసుకోవడం మానుకో? అంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. స్థానికులు ఆమె చేతులు కట్టేసి.. పోలీసులకు అప్పగించారు.
Railway track turned road: Woman’s drive sparks panic near #Shankarpally
Woman drives car on #railwaytrack near #Shankarpally, stuns #railway staff.
Despite efforts to stop her, she speeds away.#Bengaluru–#Hyderabad trains halted as a precaution.
Authorities… pic.twitter.com/k87nVKeF1u
— NewsMeter (@NewsMeter_In) June 26, 2025