Salman Khan:బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్గా ఆయన తాను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం..అలాగే తనకి ఉన్న అనారోగ్య సమస్యల గురించి కూడా బయటపెట్టారు. షూటింగ్స్ లో యాక్షన్ సీన్స్ చేస్తున్న సమయంలో తనకి విపరీతమైన పెయిన్స్ వచ్చాయని,అలాగే తాను బ్రెయిన్ అన్యూరిజం, ట్రైజెమినల్ న్యూరాల్జియ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు కూడా తెలియజేశారు. అలాగే పెళ్లి బంధం అనేది అంత సులభమైన విషయం కాదని,అది భావోద్వేగంతో కూడుకున్నదని, అందుకే పెళ్లి విషయంలో ఆలోచన చేస్తున్నానంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే అలాంటి సల్మాన్ ఖాన్ తాజాగా ఓ ఖరీదైన బుల్లెట్ ప్రూఫ్ కారు (Bullet Proof Car) కొన్నారు. మరి దాని ధర ఎంత..? ప్రత్యేకతలు ఏంటి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
బెదిరింపులకు భయపడి మరో బుల్లెట్ ప్రూఫ్ కారు కొన్న సల్మాన్ ఖాన్..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎన్నో సినిమాలతో వేలకోట్ల ఆస్తులు సంపాదించారు.. అలాగే ఆయన కార్ గ్యారేజీలో ఖరీదైన కార్లు కూడా ఉంటాయి. ఆ మధ్యకాలంలో రూ.2కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్ కారు కొన్న సల్మాన్ ఖాన్.. తాజాగా మరో బుల్లెట్ ప్రూఫ్ కారు కొని వార్తల్లో నిలిచారు.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఇంట్లో నుండి బయటకు వెళ్లాలంటే బుల్లెట్ ప్రూఫ్ కార్ తప్ప వేరే దాంట్లో వెళ్లడం లేదు.. అందుకే ఒక బుల్లెట్ ప్రూఫ్ కారు ఉన్నా కూడా తాజాగా మెర్సిడెస్ మేబాచ్ GLS 600 SUV మోడల్ కారుని కొనుగోలు చేశారు. అయితే వారం క్రితమే ఈ కారుని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ కారు ప్రత్యేకతను బట్టి సుమారు రూ.3.9 కోట్ల వరకు ఖరీదు ఉంటుందని తెలుస్తోంది.
చావు భయం.. ఊపిరి సడలించలేకపోతున్న సల్మాన్ ఖాన్..
అయితే ఈ మధ్యకాలంలో సల్మాన్ ఖాన్ కి తరచూ చావు బెదిరింపులు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. బీష్ణోయ్ గ్యాంగ్ (Bishnoi Gang) సల్మాన్ ఖాన్ ని ఎలాగైనా సరే చంపుతామని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇక చావు భయంతోనే సల్మాన్ ఖాన్ ఇంటి నుండి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఒకవేళ సినిమా షూటింగ్ లకి వెళ్లాలంటే హై సెక్యూరిటీతోనే వెళుతున్నారు. ఇక బయటికి ఎక్కడికైనా వెళ్లాలంటే ఈ బుల్లెట్ ప్రూఫ్ కార్ లేకపోతే అడుగు బయట పెట్టడం లేదు.. ఈ బెదిరింపుల కారణంగానే సల్మాన్ ఖాన్ తనకోసం మరో బుల్లెట్ ప్రూఫ్ కారుని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇకపోతే వేలకోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఒక వర్గం నుండి తనను తాను కాపాడుకోవడానికి అనుక్షణం భయపడుతూ జీవించడం చూసి అభిమానుల సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు
సల్మాన్ ఖాన్ సినిమాలు..
ఇక సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్ గానే ఆయన రష్మిక (Rashmika)తో కలిసి సికిందర్ (Sikinder) మూవీ చేసినప్పటికీ అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.అలాగే 7 డాగ్స్ (7 Dogs) అనే మూవీలో అతిధి పాత్రతో మన ముందుకు రాబోతున్నారు.
also read:Ajay Devagan : పబ్లిక్‌లోనే ముద్దులు… టబుపై ఈ హీరోకు ఇంకా ప్రేమ తగ్గలేదా ?