Mahesh Babu:సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తన స్టేటస్ కి తగ్గట్టుగా లగ్జరీ మెయింటైన్ చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ (Krishna ) వారసుడిగా చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. బాల్యంలోనే తన నటనతో సత్తా చాటిన ఈయన.. అందమైన రూపం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, అంతకుమించి అద్భుతమైన నటనతో తిరుగులేని హీరోగా పేరు ఘడించారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ భారీగా సంపాదిస్తున్న ఈయన.. లగ్జరీ కార్లతో నిండిన గ్యారేజ్, ప్రైవేట్ జెట్ , హైదరాబాదులో అత్యంత విలాసమైన జూబ్లీహిల్స్ ఈయన సొంతం. వీటికంటే ఇప్పుడు అత్యంత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది మహేష్ బాబు కారవాన్. ఇది చూడడానికే కాదు దీని ఖరీదు, దీని ప్రత్యేకతలు కూడా అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
షారుఖ్ ఖాన్ కంటే ఖరీదైన కారవాన్ సొంతం చేసుకున్న మహేష్ బాబు..
అసలు విషయంలోకి వెళ్తే.. ఇప్పటివరకు బాలీవుడ్ లో షారుక్ ఖాన్ (Shahrukh Khan) వోల్వో 9BR ఎక్కువ ఖరీదైంది అని.. ఇది చాలా లగ్జరీగా ఉంటుందని.. అందరూ అనుకునేవారు. కానీ ఇప్పుడు దానినే మించిపోయింది మహేష్ బాబు కారవాన్. అయితే ఇటీవల ఒక యాడ్ షూటింగ్ సమయంలో మహేష్ బాబు దానిని తీసుకురాగా అక్కడ ఈ కారవాన్ అందరి దృష్టిని ఆకర్షించింది. మహేష్ బాబు తన అభిరుచులకు తగ్గట్టుగా దీనిని చాలా స్టైలిష్ గా.. విలాసవంతంగా కష్టమైజ్ చేయించినట్లు సమాచారం. పూణేకి చెందిన ఆటోమొబైల్ కంపెనీ డిసి ద్వారా దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేయించారట. దీని ధర సుమారుగా రూ.6 కోట్ల అయితే దీనిని హై అండ్ టెక్నాలజీతో రూపొందించిన కారణంగా మరో రూ .2 కోట్లు అదనంగా వెచ్చించారట. అలా మొత్తంగా ఈ కారవాన్ ఖరీదు రూ.8 కోట్లని సమాచారం.
కారవాన్ ప్రత్యేకతలు ఇవే..
ఇక మహేష్ బాబు ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న ఈ కారవాన్ లోపల ఉన్న ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఇక్కడ ఒక లగ్జరీ బెడ్ రూమ్ ఉంది. ఈ బెడ్ రూమ్ ని ఒక్క బటన్ క్లిక్ చేస్తే ఇది కాస్త మీటింగ్ రూమ్ గా మారిపోతుంది. ఇందులో మినీ కిచెన్ కూడా ఉంది. వేడి అలాగే చల్లని నీరు అందుబాటులో ఉంటాయి. వాష్ రూమ్, క్లైనింగ్ సీట్లు, భారీ టీవీ, ఇంపోర్టెడ్ లగ్జరీ లైట్లు, స్పీకర్లతో కూడిన హోమ్ థియేటర్ తో పాటు ఇతర సకల సౌకర్యాలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కారవాన్ ఒక విలాసవంతమైన ఇంటి కంటే తక్కువ ఏమి కాదు అని సమాచారం.
మహేష్ బాబు సినిమాలు..
మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. వేగంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి త్వరగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి జక్కన్న భారీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ALSO READ:Heroine Sangeeta: విడాకుల రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సంగీత.. ఏమన్నారంటే?