71st National Awards: 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మంగళవారం ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ద్రౌపతి ముర్మురు విజేతలకు పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. 2023 ఏడాదిగానూ కేంద్ర ప్రభుత్వం ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటులు, సాంకేతిక విభాగాల్లో ప్రతిభ కనబర్చిన నటీనటులు, సినిమాలను ఎంపిక చేసి.. విజేతలను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నేడు వారందరికి విజ్ఞాన్ భవన్ పరస్కారాలు అందజేశారు.
ఉత్తమ చిత్రం యానిమేషన్ విజువల్స్, గేమింగ్ అండ్ కామిక్ విభాగంలో హనమాన్ చిత్రానికి నేషనల్ అవార్డు వచ్చింది. హనుమాన్ మూవీకి గానూ దర్శకుడు ప్రశాంత్ వర్మ రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.
తెలుగులో ఉత్తమ చిత్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మూవీకి ఉత్తమ చిత్రంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ అవార్డును ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి అందుకున్నారు.
ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్స్ విభాగంలో హనుమాన్ సినిమా అవార్డు గెలుచుకోగా ఇందుకు యానిమేషన్స్, విజువల్ ఎఫెక్ట్స్ చేసిన వెంకట్ కుమార్, దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి అవార్డులు అందుకున్నారు.
ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హను–మాన్ మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ హీరో జానర్లో విజువల్ వండర్‌గా ఈ సినిమా వచ్చింది.
ఈ సినిమాకు గానూ స్టంట్ డైరెక్షన్-స్టంట్ కొరియోగ్రఫీ విభాగంగా అవార్డు వరించింది. ఈ మేరకు రాష్ట్రపతి చేతుల మీదు స్టంట్ కొరియోగ్రాఫర్‌గా యూ పృథ్వీ, కన్నన్ నందురాజ్లు అవార్డు అందుకున్నారు.
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి తొలి జాతీయ అవార్డును అందుకుంది. గాంధీ తాత చెట్టులో సినిమాలో ఆమె కనబర్చిన అద్భుతమైన నటనకు గానూ జాతీయ అవార్డు వరించింది.
బలగం సినిమాకు గానూ ‘ఊరు పల్లెటూరు’ అనే పాటకు ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్ జాతీయ అవార్డు అందుకున్నారు. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని స్వీకరించారు. తెలంగాణ సంస్కృతి, కుటుంబ బంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమాకు వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు.
ఇక జవాన్ మూవీకి గానూ బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఉత్తమ నటుడి జాతీయ అవార్డు తీసుకున్నారు. హీరోయిన్ రాణి ముఖర్జీ, 12th ఫెయిల్ సినిమాకి గానూ విక్రాంత్ మస్సేకు ఈ జాతీయ అవార్డు అందుకున్నారు.
బేబీ సినిమాకు ఉత్తమ్ స్క్రీన్ ప్లే కు గాను దర్శకుడు సాయి రాజేష్, బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ గా ప్రేమిస్తున్నా. సాంగ్ కు PVNS రోహిత్ అవార్డులు అందుకున్నారు.
Also Read: Sundarakanda OTT: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన నారా రోహిత్ ‘సుందరకాండ‘.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!