BigTV English

National Film Awards 2025: నేషనల్ అవార్డ్స్ వచ్చేశాయి… బాలయ్య మూవీతో పాటు వీళ్లకు పురస్కారం

National Film Awards 2025: నేషనల్ అవార్డ్స్ వచ్చేశాయి… బాలయ్య మూవీతో పాటు వీళ్లకు పురస్కారం

National Film Awards 2025: సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సెలబ్రిటీలను ప్రోత్సహిస్తూ  ఎన్నో పురస్కారాలను అందజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం జాతీయ చలనచిత్ర అవార్డులను(National Film Awards) కూడా ప్రదానం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ ఏడాది 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నేడు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈరోజు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ వేడుక జరిగింది. 2023లో విడుదలైన సినిమాలకు గాను, వారి కృషికిగాను విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందజేశారు. ఈ క్రమంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా ఈ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.


నేషనల్ అవార్డు అందుకున్న సెలబ్రిటీలు వీళ్లే..

*తెలుగు చిత్రపరిశ్రమలో 2023వ సంవత్సరంలో విడుదలైన పలు సినిమాలకు నేషనల్ అవార్డు లభించింది. ఇందులో భాగంగా ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి (Bhagavanth Kesari)సినిమాకు గాను నేషనల్ అవార్డు అందుకున్నారు.

* హనుమాన్ సినిమాకు సంబంధించి బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, స్టంట్ కొరియోగ్రఫీ అవార్డును సొంతం చేసుకున్నారు.


*బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు పాటకు సంబంధించి బెస్ట్ లిరిక్స్ రైటర్ గా కాసర్ల శ్యామ్ ఈ అవార్డును సొంతం చేసుకున్నారు.

*బేబీ సినిమాకు సంబంధించి బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో సాయి రాజేష్ నీలం ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. అదేవిధంగా ఈ సినిమాలో ప్రేమిస్తున్న అనే పాటకు గాను బెస్ట్ మేల్ సింగర్ గా రోహిత్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

* బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ విభాగంలో భాగంగా ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ కుమార్ కుమార్తె సుకృతి వేణి గాంధీ తాత చెట్టు సినిమాలోని తన నటనకు గాను నేషనల్ అవార్డు అందుకున్నారు.

*ఉత్తమ చిత్రం యానిమేషన్, విజువల్స్, గేమింగ్ అండ్ కామిక్ విభాగంలో భాగంగా హనుమాన్ సినిమా నేషనల్ అవార్డుకు ఎంపిక అయింది.

పురస్కారం అందుకున్న బాలీవుడ్ నటుడు:

ఈ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో భాగంగా బాలీవుడ్ చిత్రం జవాన్ సినిమాకు గాను షారుక్ ఖాన్(Sharukh Khan) ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు.12th ఫెయిల్ సినిమాలో ఉత్తమ నటుడిగా విక్రాంత్ మాస్సే ఈ పురస్కారాన్ని అందుకున్నారు. మిసెస్ ఛటర్జీ vs నార్వే చిత్రంలో అద్భుతమైన నటనను కనబరిచినందుకు నటి రాణి ముఖర్జీ సైతం ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

మోహన్ లాల్ కు దాదాసాహెబ్ ఫాల్కే..

ఈ జాతీయ చలనచిత్ర అవార్డు ప్రధాన ఉత్సవ కార్యక్రమాలలో భాగంగా ప్రముఖ మలయాల నటుడు మోహన్ లాల్ (Mohan Lal)సైతం దాదాసాహెబ్ ఫాల్కే 2023(Dada saheb Phalke 2023) పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన సినిమా ఇండస్ట్రీకి అందించిన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం తనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డును జాతీయ చలన చిత్ర ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. ఇలా జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా జరగడంతో ఈ అవార్డుల అందుకున్న వారందరికీ సెలబ్రిటీలు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also Read: Dharma Mahesh: గౌతమి కోసం సూసైడ్ చేసుకున్న ధర్మ మహేష్.. వెలుగులోకి సంచలన విషయాలు!

Related News

National Awards: 71వ నేషనల్‌ అవార్డ్స్ ప్రదానోత్సవం.. ‘బలగం’, ‘హనుమాన్‌’ చిత్రాలకు జాతీయ అవార్డు..

Star Singer: అంతిమయాత్రలో కూడా రికార్డు సృష్టించిన స్టార్ సింగర్.. ఏకంగా లిమ్కా బుక్ లో స్థానం!

Dharma Mahesh: గౌతమి కోసం సూసైడ్ చేసుకున్న ధర్మ మహేష్.. వెలుగులోకి సంచలన విషయాలు!

Dharma Mahesh: ధర్మ మహేష్ గదిలో రీతూ చౌదరి…ధర్మ ఫాదర్ కాకాణి రియాక్షన్ ఇదే?

OG Movie: రిలీజ్‌కి ముందే ఓజీ రికార్డు.. అప్పుడే రూ. 50 కోట్లు..!

OG vs Pushpa : గ్యాంగ్ స్టార్స్ అయితే పర్లేదా… పవన్‌పై తిరగబడుతున్న బన్నీ ఫ్యాన్స్

Akhanda 2 Release: అఖండ 2 రిలీజ్ డేట్ ప్రకటించిన బాలయ్య… టార్గెట్ మామూలుగా లేదుగా!

Big Stories

×