E-Paper
Advertisement

77 వేల క్యాప్ నుండి రూ.7 కోట్ల క్యారవాన్ వరకు…హీరోల రాయల్ లైఫ్ స్టైల్ చూశారా?

77 వేల క్యాప్ నుండి రూ.7 కోట్ల క్యారవాన్ వరకు…హీరోల రాయల్ లైఫ్ స్టైల్ చూశారా?
Advertisement

Luxury Collection: ”వాడి వాచ్ అమ్మితే మీ బ్యాచ్ సెటిల్ అవ్వుద్ది” అంటుంది అత్తారింటికి దారేది సినిమాలో సమంత. అవును.. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు సెటిల్ అయిపోయేంత డబ్బుతో వాచ్ లు , వ్యాన్ లు,కార్లు,టోపీలు ఇలా…కనిపించిన కాస్ట్లీ ఐటం ప్రతీదీ నాదగ్గర ఉండాల్సిందే అని ఫిక్స్ అయిపోతున్నారు మన టాప్ హీరోలు.

రూ.77,500 విలువైన లూయిస్ విట్టన్ క్యాప్

Advertisement

లేటెస్ట్ గా మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.77,500 విలువైన లూయిస్ విట్టన్ క్యాప్ పెట్టుకొని కెమెరాలకి చిక్కడంతో మరోసారి ఈ కాస్ట్లీ వస్తువుల కహానీ మరోసారి తెరమీదికి వచ్చింది.ఇలాంటి కాస్ట్లీ థింగ్స్ ని మెయింటేన్ చేస్తున్న మన తారలపై లుక్కేస్తే …ముందుగా కనిపించేది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.ఆయనకు లగ్జరీ వాచీలంటే ఎంత పిచ్చో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.

4 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్

Advertisement

ఇక ఈ మధ్యే ఒక ఈవెంట్‌లో చరణ్ తన చేతికి పెట్టుకున్న ‘ఆడెమర్స్ పిగ్యుట్’ (Audemars Piguet) బ్రాండ్‌కు చెందిన రాయల్ ఓక్ పర్పెచువల్ క్యాలెండర్ వాచ్ ధర అక్షరాలా రూ.3.2 కోట్లు అని తెలిసి ముక్కున వేలేసుకున్నారంతా.ఇక కేవలం వాచీలే కాదండోయ్ ..మన పెద్ది దగ్గర ఏకంగా రూ.4 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కార్ కూడా ఉంది మరి.

ఇక చరణ్ సంగతి అలా ఉంచితే తారక్ కూడా ఏం తక్కువ కాదు. ముఖ్యంగా లగ్జరీ కార్ల కలెక్షన్‌కు కేరాఫ్ అడ్రస్‌ ఎవరైనా ఉన్నారంటే అది మన యంగ్ టైగరే. ఇండియాలోనే అత్యంత ఖరీదైన లంబోర్గిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ (Lamborghini Urus) ఎడిషన్ కార్ కొనుగోలు చేసిన మొదటి ఇండియన్ కూడా మన తారక్ అన్న సంగతి మీకు తెలుసా.ఇక దీని ధర సుమారు రూ.5 కోట్లయితే దీని నంబర్ ప్లేట్ (9999) కోసమే ఆయన అప్పట్లో రూ.5 లక్షలు ఖర్చు చేశాడన్న వార్తలు గట్టిగా షికార్ చేశాయి.

‘ఫాల్కన్’ (Falcon) అనే కస్టమైజ్డ్ క్యారవాన్ ధర రూ.7 కోట్లు

మరోవైపు మీకన్నా నేనెక్కడా తక్కువ కాదంటూ పోటీ పడుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .ఆయన సొంతంగా డిజైన్ చేయించుకున్న ‘ఫాల్కన్’ (Falcon) అనే కస్టమైజ్డ్ క్యారవాన్ ధర దాదాపు రూ.7 కోట్లు ఉంటుందంటే నమ్ముతారా.ఒక లగ్జరీ ఇల్లు నడిచొస్తున్నట్లు ఉండే ఈ వ్యాన్‌లో ఇంటీరియర్ అంతా వెండి, గ్లాస్ వర్క్‌తో రాయల్‌గా ఉంటుందట మరి, అందుకే అంత రేటు కాబోలు.. అలాగే బన్నీ వాడే పటేక్ ఫిలిప్ (Patek Philippe) వాచ్ ధర కూడా సుమారు రూ.1.2 కోట్లు పైనే ఉంటుందని ఒక ప్రచారం.

6 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కార్

ఇక మీరేనా నేనూ అంటూ ఏకంగా 6 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కార్ ని తన గ్యారేజ్ లో బందించాడట మన డార్లింగ్ .ఇక ఆయన డైలీ ప్రయాణించే లగ్జరీ క్యారవాన్ ధర కూడా రూ.8 కోట్ల వరకు ఉంటుందని అంచనా.మొత్తానికి కాస్ట్లీకి కేరాఫ్ మేమే అని మరోసారి మన తారలు నిరూపించుకుంటున్నారన్న మాట!

Related News

కోలీవుడ్‌లో బిగ్గెస్ట్ మల్టీస్టారర్…26 ఏళ్ల తర్వాత బాలీవుడ్ లెజెండ్ ఎంట్రీ !

డీప్ ఫేక్ కి బాంబే హైకోర్టు బ్రేక్.. సొట్టబుగ్గల సుందరికి బిగ్ రిలీఫ్!

మెగా 158 కోసం చిరు హైరిస్క్.. నడవలేని స్థితిలో!

ప్రభాస్ 200 కోట్ల కోకాపేట ప్యాలెస్.. ఇల్లు కట్టేది పెళ్లి కోసమేనా?

ఖాకీల మధ్య ‘జాతిరత్నం’ రచ్చ.. నవీన్ పోలిశెట్టికి డీజీపీ అదిరిపోయే కౌంటర్!

మరోసారి అడ్డంగా బుక్ అయిన టాలీవుడ్ కపుల్..

అక్కినేని నాగేశ్వరరావుతో ప్రేమాయణం.. కానీ పెళ్లయ్యాక నరకం !

Big Stories

Advertisement
×