Scene Vs Ramayana: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈయన నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విషయాన్ని సొంతం చేసుకోవడంతో వరుసగా సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్యకాలంలో సూర్య నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో సూర్య నటించిన సేమ్ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ దూసుకెళ్తుంది. ఇదిలా ఉండగా.. కోలీవుడ్ లోనే ఏ సినిమాకు దిమ్మతిరిగే షాక్ తగిలింది అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అక్కడ రామాయణ ముందంజలో ఉంది. ప్రస్తుతం సీన్ సినిమా కలెక్షన్స్ ఎంత ఉన్నాయి? రామాయణ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
కోలీవుడ్ ఇండస్ట్రీలో దీపావళి సందర్బంగా చాలా సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. అందులో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా స్టార్ హీరో సూర్య నటించిన సీన్ మూవీ ఒకటి. సూర్య, నజ్రియా నాజిమ్, నస్లేన్, ఆనందరాజ్, లాల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీతూ మాధవన్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజ్ అయినయి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తుంది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ చిత్రమైన రామాయణం సినిమా కూడా సినిమాలకు గట్టి పోటీనిస్తూ వస్తుంది.. ప్రతి ఇండస్ట్రీలను ఈ సినిమానే టాప్ లో కొనసాగుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు కూడా ఈ సినిమాకి కలెక్షన్ లో వర్షం కురుస్తుంది. కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకి మంచి టాక్ రావడంతో సీన్ సినిమాకు షాక్ ఎదురైంది. మరి రామాయణ దాటికి ఈ సినిమా ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఏది ఏమైనా కూడా సూర్య సొంత గడ్డ అయిన కోలీవుడ్ లోనే ఆయనకు షాక్ ఎదురవడం అభిమానులు ఫీల్ అయిపోతున్నారు..
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రామాయణ సినిమాకు రోజురోజుకీ క్రేజ్ పెరుగుతూ వస్తుంది.. రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా నటించిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాటుగా అంచనాలను క్రియేట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తుంది.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు కలెక్షన్లు కూడా ఓ రేంజ్ లో వస్తున్నాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇకపోతే తమిళనాడులో ‘రామాయణ’ దాదాపుగా 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇదే వేగం కొనసాగితే, ఆ రాష్ట్రంలోనే ఈ సినిమా రూ. 60 కోట్ల మార్కును దాటే అవకాశాలు కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఈ సినిమా 1500 కోట్ల క్లబ్ లోకి చేరినట్లు తెలుస్తుంది మరి 2000 కోట్లకు పైగా నీ వసూళ్లను అందుకుంటున్నా లేదా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
Also Read :కిర్రాక్ సీత నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుంది..? నిజంగా గ్రేట్ కదా..