E-Paper
Advertisement

‘అది భారత్ సమ్మిట్ కాదు.. యాంటీ-భారత్ సమ్మిట్’.. రాంచందర్ రావు హౌస్ అరెస్ట్‌పై బీజేపీ ఫైర్!

‘అది భారత్ సమ్మిట్ కాదు.. యాంటీ-భారత్ సమ్మిట్’.. రాంచందర్ రావు హౌస్ అరెస్ట్‌పై బీజేపీ ఫైర్!
Advertisement

Ramchander Rao House Arrest: భారత్ సమ్మిట్ సదస్సులో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ కు వచ్చిన నేపథ్యంలో నగరంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. రాహుల్ రాకతో పాటు ఈ సదస్సుకు వ్యతిరేకంగా బీజేపీ శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును పోలీసులు ముందస్తుగా గృహనిర్బంధం చేశారు. తార్నాకలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించి, బయటకు రాకుండా అడ్డుకున్నారు.

తమ రాష్ట్ర అధ్యక్షుడిని హౌస్ అరెస్టు చేయడంపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నది ‘భారత్ సమ్మిట్’ కాదని అది ముమ్మాటికీ ‘యాంటీ-భారత్ సమ్మిట్’ అని బీజేపీ నేతలు ఆరోపించారు. రాజకీయంగా వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీని మరోసారి రీలాంచ్ చేసేందుకే తెలంగాణ ప్రజల పన్నుల సొమ్మును వృథా చేస్తూ ఈ సదస్సు నిర్వహిస్తున్నారని విమర్శించారు. అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులను పిలిచి దేశ వ్యతిరేక శక్తులకు వేదిక కల్పిస్తున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు సహా ఇతర హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసిందని బీజేపీ విమర్శించింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీ పర్యటనకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి నిత్యం నీతులు చెప్పే కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో మాత్రం ప్రతిపక్ష నాయకులను అక్రమంగా హౌస్ అరెస్టులు చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తోందని విమర్శించింది.

Also Read: తెలంగాణకు థ్యాంక్స్ చెప్పిన ఏపీ.. ఇక్కడి అధికారులపై ప్రశంసలు.. ఎందుకంటే?

Advertisement

శాంతియుత నిరసనలకు భయపడి రాష్ట్ర అధ్యక్షుడిని గృహనిర్బంధం చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగా పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే రాంచందర్ రావుపై విధించిన హౌస్ అరెస్ట్‌ను ఎత్తివేయాలని.. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా నిర్బంధించిన బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.

Also Read: అమెరికాలో తీవ్ర గందరగోళం.. ఎయిర్‌పోర్టులో నిలిచిపోయిన వేలాది విమానాలు.. ప్రయాణికుల నరకయాతన!

Tags

Related News

పాతబస్తీలో ఏనుగు బీభత్సం.. బ్యాండ్ శబ్దానికి బెదిరి పరుగులు!

‘భారత్ సమ్మిట్’ డే 2.. అర్ధరాత్రి హైదరాబాద్‌కు రాహుల్.. నేడు సీఎం రేవంత్‌తో కలిసి గిగ్ వర్కర్ల స్కీమ్‌కు శ్రీకారం!

విదేశీ ప్రతినిధుల వీసాల రద్దుపై రాజకీయ దుమారం.. కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్!

ఇక మీరు మారరా.. తెలంగాణ బీజేపీ నేతలపై భగ్గుమన్న హైకమాండ్!

దేశంలోనే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ.. ప్రతి ఇంటికి రూ.5 లక్షల భరోసా.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు!

ఆ అంశంపై.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు!

రేపు వచ్చేది మా ప్రభుత్వమే.. భూములు కొంటే ఊరుకోం.. హరీశ్ రావు మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×