Trolls On ICC Jay Shah: పాకిస్తాన్, భారత్ మధ్య పచ్చ గడ్డి వేసే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. రెండు దేశాల మధ్య నిత్యం యుద్ధ వాతావరణ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ తరుణంలోనే పాకిస్తాన్, ఇండియా (Pakistan vs India) మధ్య ఎప్పుడు, ఎక్కడ మ్యాచ్ లు అంటే జనాలు ఎగబడి చూస్తారు. ఈ విభేదాల నేపథ్యంలో ప్రతి మ్యాచ్ లో గెలవాలని దాయాది జట్లు ప్రతి మ్యాచ్ కసిగా ఆడుతాయి. అయితే అలాంటి శత్రు దేశానికి అనుకూలంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జై షా వ్యవహరించాడని సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి.
ఐసీసీ అధ్యక్షుడి హోదాలో అతడు తీసుకున్న ఓ నిర్ణయం కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు 200 కోట్ల లాభం రాబోతుందని విమర్శలు వస్తున్నాయి. 2033 సంవత్సరంలో జరిగే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి పాకిస్తాన్ మరోసారి ఆతిథ్యం ఇవ్వనుందని తెలుస్తోంది. ఈ మేరకు జై షా నిర్ణయం తీసుకున్నాడట. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ…ఇప్పటికే జై షాపై ట్రోలింగ్ మాత్రం షురూ అయింది. పాకిస్తాన్ దేశానికి అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నాడని అతనిపై దేశద్రోహి ముద్ర కూడా వేసేస్తున్నారు.
2032 నుంచి 2035 వరకు జరిగే టోర్నమెంట్ల షెడ్యూల్ ను ప్రిపేర్ చేసే పనిలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బిజీగా ఉంది. ఇందులో భాగంగానే 2035 వరకు జరగనున్న ఆరు గ్లోబల్ టోర్నమెంట్స్ క్యాలెండర్ విండోలను ఐసీసీ ఫైనల్ చేసింది. 8 జట్లు పాల్గొనే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 2033 అక్టోబర్ నెలలో ఫైనల్ చేశారు. అంతేకాదు ఈ టోర్నమెంట్ ను పాకిస్తాన్ లో నిర్వహించేందుకు జై షా మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. ఐసీసీ బాస్ జై షా గ్రీన్ సిగ్నల్ ఇస్తే, పాకిస్తాన్ కు 2033 ఛాంపియన్స్ ట్రోఫీ ఆదిత్య హక్కులు వెళతాయి.
ఇదే జరిగితే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు దాదాపు రూ.200 కోట్ల లాభం రానుంది. పాకిస్తాన్ కు ఇండియా వెళ్లకపోయినా యూఏఈ వేదికగా మ్యాచ్ లు ఆడాలే ఐసీసీ ప్లాన్ చేయనుంది. 2025లోనూ ఇలాగే టీమిండియా ఆడగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు రూ.100 కోట్ల లాభం వచ్చింది. 2033 వరకు చాలా గ్యాప్ ఉంది కాబట్టి ఆదాయం డబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అదే 2033 వరకు బీసీసీఐ మనసు మార్చుకుని, పాకిస్తాన్ కు టీమిండియాకు పంపిస్తే పెను సంచలనమే అవుతుంది. పీసీబీకి కూడా ఆదాయం పెరుగనుంది.