Jacqueline Fernandes: సెలబ్రిటీలు ఎప్పుడూ కూడా సినిమాలు.. ఈవెంట్లతోనే కాదు అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తన అందంతో, నటనతో ప్రేక్షకులను మెప్పించిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandes) తాజాగా తన గొప్ప మనసును చాటుకున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. అసలు విషయంలోకి వెళ్తే.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఒక చిన్నారిని ఆదుకోవడానికి ఆమె ముందుకు వచ్చారు. ఆ బాబు ఇంటికి వెళ్లిన ఆమె.. ఆ బాబుతో సరదాగా కబుర్లు చెప్పి, ఆడించి, నవ్వించే ప్రయత్నం కూడా చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే ఈ బాబును చూస్తూ ఉంటే.. తల బెలూన్ లా ఉబ్బిపోయి ఉంది. తలపై నరాలు కూడా స్పష్టంగా మనం చూడవచ్చు. అంతేకాదు బాబు తల వెనుక భాగంలో ప్లాస్టర్ వేసిన దృశ్యాలు కూడా ఆ వీడియోలో చూపించారు.. అయితే ఈ పరిస్థితిని వైద్యశాస్త్రం ప్రకారం “హైడ్రో సెఫాలస్” అని పిలుస్తారు. సాధారణంగా ఈ వ్యాధి వచ్చిన శిశువుల తల.. సాధారణ పిల్లల కంటే చాలా పెద్దగా ఉంటుంది. ఈ వ్యాధితోనే బాధపడుతున్నాడని తెలుసుకున్న జాక్వెలిన్ వెంటనే అతడి కుటుంబాన్ని కలిసి సర్జరీ చేయిస్తానని హామీ కూడా ఇచ్చింది. పిల్లవాడు మళ్లీ మామూలు స్థితికి రావాలి అని ప్రతి ఒక్కరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
స్వచ్ఛంద సంస్థలకు సహాయం చేస్తూ..
జాక్వెలిన్ విషయానికి వస్తే.. పలు చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఈమె ఇప్పటికే ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు సహాయం చేస్తూ గొప్ప మనిషిగా పేరు దక్కించుకుంది. ముఖ్యంగా పిల్లల చదువులకే కాదు.. మూగజీవాల సంరక్షణకు కూడా సహాయం చేస్తూ మరింత పేరు అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
also read:Mega Family: మెగాస్టార్ ఇంటికి వారసుడొచ్చాడు.. తల్లిదండ్రులైన లావణ్య- వరుణ్!
జాక్వెలిన్ ప్రస్తుత సినిమాలు..
జాక్వెలిన్ ప్రస్తుత సినిమాల విషయానికొస్తే.. మహమ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ‘వెల్కమ్ టు ది జంగిల్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కెరియర్..
టీవీ రిపోర్టర్ గా కెరియర్ మొదలు పెట్టిన ఈమె.. సిడ్నీ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసింది. 2009లో వచ్చిన అలాడిన్ అనే ఫాంటసీ చిత్రం కోసం ఇండియాకి వచ్చిన ఈమె.. ఇదే ప్రాజెక్ట్ ద్వారా నటిగా కెరియర్ ను ఆరంభించింది. 2011 లో వచ్చిన మర్డర్ 2 సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తన నటనతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు మెప్పిస్తూ దూసుకుపోతున్న ఈమె విక్రాంత్ రోణా , హౌస్ ఫుల్ 3, భూత్ పోలీస్, బచ్చన్ పాండే ఇలా ఎన్నో చిత్రాలలో నటించింది. ఇక ఇప్పుడు ఇలా తన గొప్ప మనసును చాటుకొని మరొకసారి వార్తల్లో నిలిచింది జాక్వెలిన్.
Jacqueline Fernandez taking care of all the Medical expenses For the Kid 🫶🏻 pic.twitter.com/HLEq6P5Gpd
— The Filmy Reporter (@FilmyReporter_) September 9, 2025