Tollywood: సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు అభిమానులు ఏ రేంజ్ లో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ నటనతో, అందంతో, ప్రతిభతో ఎప్పటికప్పుడు ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ ఉంటారు. అటు సెలెబ్రిటీలు కూడా అభిమానులకు చేరువ అవ్వడానికి అప్పుడప్పుడు అభిమానులతో లైవ్ చాట్ కూడా నిర్వహిస్తూ.. వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరికొంతమంది అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతూ ఉంటారు. ఇక ఇదంతా బాగానే ఉన్నా.. అభిమానులు చేసే పనులు అప్పుడప్పుడు సెలబ్రెటీలకు తీరని నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. మరి కొంతమందికి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక అభిమాని ఏకంగా తనను పెళ్లి చేసుకోమని.. ఒక హీరోయిన్ ను టార్చర్ పెడుతున్నారట. మరి ఆ హీరోయిన్ ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం..
ఆమె ఎవరో కాదు ప్రముఖ బ్యూటీ అవంతిక మోహన్ (Avanthika Mohan).. మలయాళ నటిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. తాజాగా అభిమానికి ఇచ్చిన కౌంటర్ కి అందరూ శభాష్ అంటున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఒక అభిమాని తనను పెళ్లి చేసుకోవాలని పదేపదే మెసేజ్ చేస్తున్నారట. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ అభిమాని వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే కావడం గమనార్హం. ప్రతిరోజు మెసేజ్లు పెడుతూ.. ఫోన్ చేస్తూ విసిగిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆమె కౌంటర్ ఇచ్చింది.
పెళ్లి చేసుకుంటే భార్య అనుకోరు..
ఈ మేరకు అవంతిక మోహన్..” నువ్వు ఇంకా చాలా చిన్న పిల్లవాడివి.. పరీక్షల గురించి ఆలోచించాల్సిన వయసులో ఉన్నావు. అలాంటిది నువ్వు నన్ను పెళ్లి చేసుకుందాం అంటున్నావు. ఒకవేళ మనం పెళ్లి చేసుకుంటే ఎవరు కూడా నన్ను నీ భార్య అనుకోరు. నీ తల్లిగానే అనుకుంటారు” అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది.
హీరోయిన్ కి మద్దతుగా నెటిజన్స్..
మొత్తానికైతే అవంతిక మోహన్ ఇచ్చిన సమాధానానికి నెటిజన్స్ కూడా..”మీరు చెప్పేది నిజమే” అంటూ ఈమెకు మద్దతు పలుకుతున్నారు. మరికొంతమంది ఆ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానం ఉండాలి కానీ పెళ్లి చేసుకోమని విసిగించేంత ప్రేమ ఉండకూడదు. అయినా నీ వయసెంత నువ్వు మాట్లాడే మాటలు ఏంటి అంటూ కూడా కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.
అవంతిక మోహన్ కెరియర్..
అవంతిక మోహన్ కెరియర్ విషయానికి వస్తే.. దుబాయ్ లో పుట్టి పెరిగిన ఈమె.. తల్లిదండ్రులు కాలికట్ కు చెందినవారు. మోడలింగ్ వృత్తిని చేపట్టడానికి కేరళకు వచ్చిన ఈమె.. అలా 2011లో ‘మిస్ మలబార్ 2011’ టైటిల్ తో పాటు ‘మిస్ పర్ఫెక్ట్ 2010’ అనే ఉపశీర్షికను కూడా ఈమె గెలుచుకుంది. ఈమె నృత్యకారిణి కూడా. మోడలింగ్ లో టైటిల్స్ గెలుచుకున్న తర్వాత అవకాశాలు వచ్చి పడ్డాయి.. అలా 2012లో అభిరామ్ సురేష్ ఉన్నితాన్ దర్శకత్వం వహించిన ప్రయోగాత్మక చిత్రం ‘ యక్షి – ఫెయిత్ ఫుల్ యువర్స్’ అనే చిత్రం ద్వారా అరంగేట్రం చేసింది..
సినిమాలే కాదు సీరియల్స్ కూడా..
తమిళ్, మలయాళం చిత్రాలలో నటిస్తున్నప్పుడు తెలుగులో ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అనే చిత్రంలో కూడా నటించింది. 2014లో వచ్చిన ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత ఒరియా, హిందీ చిత్రాలలో కూడా నటించిన ఈమె టెలివిజన్ సీరియల్స్ లో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ముఖ్యంగా తెలుగులో మా టీవీ లో వచ్చిన ‘రాజారాణి’ అనే సీరియల్ లో నటించింది. ఇందులో అమాయకపు పాఠశాల ఉపాధ్యాయురాలిగా నటించింది.