BigTV English

Meerut News: రూటు మార్చిన చెడ్డీ గ్యాంగ్.. ఉత్తరాదిలో ఆగడాలు.. టార్గెట్ మహిళలు-అమ్మాయిలే

Meerut News: రూటు మార్చిన చెడ్డీ గ్యాంగ్.. ఉత్తరాదిలో ఆగడాలు.. టార్గెట్ మహిళలు-అమ్మాయిలే
Advertisement

Meerut News: చెడ్డీ గ్యాంగ్ రూటు మర్చిందా? దక్షిణాది నుంచి ఉత్తరాది వైపు వెళ్లిందా? అక్కడ దిగంబర ముఠాగా అవతారం ఎత్తిందా? ఈ ముఠా టార్గెట్ కేవలం మహిళలు, యువతులేనా? ఇటీవల జరిగిన ఘటనలు ఏం చెబుతున్నాయి? గ్రామాల్లో పోలీసులు ఎంట్రీ ఇచ్చే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


చెడ్డీ గ్యాంగ్ గురించి చెప్పనక్కర్లేదు. దేశంలో కొన్నిప్రాంతాలలో చోరీలు చేసే ఒక దొంగల ముఠా. ముఠా సభ్యులు కేవలం లోదుస్తులు అనగా చెడ్డీలు-బనియన్లు ధరింస్తారు. తమ శరీరంపై నూనె పూసుకుంటారు. ఒకవేళ పట్టుబడితే సులభంగా తప్పించుకోవచ్చు. తమ గుర్తింపును దాచుకోవడానికి ముఖాలకు ముసుగులు ధరిస్తారు లేకుంటే మసి రాసుకుంటారు. దానివల్ల వారిని పోలిక కట్టడం కష్టం.

యూపీలోని మీరట్ జిల్లాలో దిగంబరం ముఠా నానాబీభత్సం చేస్తోంది. కొద్దిరోజులుగా వివిధ గ్రామాల్లో నగ్నంగా తిరుగుతూ కొంతమంది మహిళలు, యువతులపై దాడులకు పాల్పడుతోంది. గ్యాంగ్ సభ్యులు నగ్నంగా ఉంటారు. ఒంటరిగావున్న మహిళల్ని అడ్డుకోవడం, వాళ్లని చుట్టుపక్కల పంట పొలాల్లోకి లాక్కెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. గడిచిన రెండువారాలుగా ఆ తరహా ఘటనలు జరిగాయి.


లేటెస్ట్‌గా భారాలా విలేజ్‌లో ఉద్యోగానికి వెళుతుండగా ఓ మహిళను.. నగ్నంగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెని పొలంలోకి లాక్కెళ్లడానికి ప్రయత్నించారు. అయితే ఆమె కేకలు వేయడంతో సమీపంలోని గ్రామస్తులు చేరుకున్నారు. దీంతో అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు వచ్చేసరికే వారిద్దరు పారిపోయారు. దాడికి పాల్పడినవారు బట్టలు లేకుండా ఉన్నారని చెప్పుకొచ్చింది బాధితురాలు.

ALSO READ: రూటు మార్చిన దొంగలు.. ఎర్రకోటలో భారీ చోరీ

లేటెస్ట్‌గా భారాలా విలేజ్‌లో ఉద్యోగానికి వెళుతుండగా ఓ మహిళను.. నగ్నంగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెని పొలంలోకి లాక్కెళ్లడానికి ప్రయత్నించారు. అయితే ఆమె కేకలు వేయడంతో సమీపంలోని గ్రామస్తులు చేరుకున్నారు. దీంతో అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు వచ్చేసరికే వారిద్దరు పారిపోయారు. దాడికి పాల్పడినవారు బట్టలు లేకుండా ఉన్నారని చెప్పుకొచ్చింది బాధితురాలు. ఒక్క మహిళేకాదు.. రీసెంట్ గా ఇలాంటి ఘటన ఆ జిల్లాలో వేర్వేరు గ్రామాల్లో జరిగాయి.. జరుగుతున్నాయి.

ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ దాడులను సీరియస్ గా తీసుకున్నారు. దుస్తులు లేని గ్యాంగ్ కోసం వేట మొదలుపెట్టారు. టెక్నాలజీ సాయంతో వారిని పట్టుకునేందుకు డ్రోన్లను రంగంలోకి దించారు. సీసీటీవీ కెమెరాలను ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారు. ఈ గ్యాంగ్ కోసం మఫ్టీలో మహిళా పోలీసులను దిగినట్టు మీరట్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విపిన్ తెలిపారు.

ఈ గ్యాంగ్ సభ్యులు ఇప్పటివరకు కనిపించలేదని, వారెవరూ తెలియదని అంటున్నారు స్థానికులు. వాళ్లు నగ్నంగా ఎందుకున్నారో తెలీదు. కేవలం మహిళలను  టార్గెట్ చేస్తున్నారో అర్థంకాలేదన్నది స్థానికుల మాట. బయటకు వచ్చిన బాధితులు కొందరేనని, బయటకు రాని బాధితులు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.

గతంలో రెండుసార్లు ఇలాంటి దాడులు జరిగాయని అంటున్నారు. చెరకు తోటల నుండి అకస్మాత్తుగా వచ్చిన అర్థనగ్నంగా వచ్చిన వ్యక్తి మహిళలపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఆ తరహా ఘటనలు తీవ్రమైన నేపథ్యంలో ప్రతిరోజూ పోలీసులు బృందాలు గంటల తరబడి ఆ గ్యాంగ్ కోసం గాలింపు మొదలుపెట్టారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చెడ్డీ గ్యాంగ్ ఆగడాలు తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. వారే అక్కడికి వెళ్లారా? అన్న అనుమానాలు లేకపోలేదు.

Related News

Teenager Death: పటాసులు కొనలేనంత పేదరికం.. ఇంట్లోనే బాంబు తయారీ, భారీ పేలుడులో టీనేజర్ దుర్మరణం!

UP Shocker: కుక్కపై ప్రేమ.. బాలుడికి కరెంట్ షాకిచ్చి, విషం పెట్టేసి చంపేసిన యజమాని!

Hanamkonda: క్లాస్ రూమ్‌లో అకస్మాత్తుగా ప్రాణాలు విడిచిన 4వ తరగతి విద్యార్థి.. వైద్యులు చెప్పిన కారణం ఇదే

Fake Currency: విశాఖలో దొంగ నోట్ల కలకలం.. మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తి అరెస్ట్

Bengaluru Crime: మహిళపై గ్యాంగ్ రేప్.. ఆ తర్వాత ఇంట్లో దోపిడీ, బెంగుళూరులో షాకింగ్ ఘటన

Tuni Case Update: చెరువులో దూకే ముందు ఏం జరిగిందంటే.. తుని సీఐ చెప్పిన నిజాలు

Tuni case update: తుని ఘటన.. చెరువులోకి దూకి తాత ఆత్మహత్య

Delhi Encounter: ఢిల్లీలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హతం, టార్గెట్ బీహార్ ఎన్నికలు?

Big Stories

×