E-Paper
Advertisement

రమ్యకృష్ణ కెరియర్ లోనే మర్చిపోలేని సినిమా ఏంటో తెలుసా?

రమ్యకృష్ణ కెరియర్ లోనే మర్చిపోలేని సినిమా ఏంటో తెలుసా?
Advertisement

Ramya Krishnan:టాలీవుడ్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి రమ్యకృష్ణ. ‘బాహుబలి’లో శివగామిగా ఆమె నటన ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో, 1995లో వచ్చిన ‘అమ్మోరు’ సినిమాలో అమ్మవారిగా ఆమె రూపం అంతే దైవత్వంతో ఉట్టిపడుతుంది. అయితే ఈ బ్లాక్‌బస్టర్ సినిమా షూటింగ్ తన కెరీర్‌లోనే అత్యంత కష్టమైనదని రమ్యకృష్ణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ షూటింగ్ వెనుక ఉన్న కష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

కారవాన్ లేదు.. కర్రకు కట్టేసి షూటింగ్:

రాఘవేంద్రరావు గారు పట్టుబట్టడంతోనే తాను ‘అమ్మోరు’ సినిమా ఒప్పుకున్నానని రమ్యకృష్ణ చెప్పారు. అప్పట్లో సీజీ టెక్నాలజీ కొత్త కావడంతో లండన్ నుంచి ప్రత్యేకంగా బ్లూ కలర్ మేకప్ తెప్పించారట. ముఖ్యంగా అమ్మవారి 10 చేతుల సీన్ కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమెను ఒక కర్రకు కట్టేసి నిలబెట్టేవారట. ఇక చేతుల్లో నిజమైన బరువైన ఆయుధాలు పట్టుకుని కదలకుండా ఉండటం, అప్పట్లో కారవాన్, టాయిలెట్ లాంటి కనీస వసతులు లేక చాలా ఇబ్బంది పడ్డానని ఆమె గుర్తుచేసుకున్నారు.

మూడేళ్ల పాటు సాగిన నిర్మాణం:

Advertisement

శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా పూర్తి కావడానికి ఏకంగా మూడేళ్లు పట్టింది. మొదట వేరే దర్శకుడితో షూటింగ్ చేసినా అవుట్‌పుట్ నచ్చకపోవడంతో, నిర్మాత కోడి రామకృష్ణను రంగంలోకి దించారు. అప్పట్లో మన దగ్గర గ్రాఫిక్స్ వాడకం చాలా అరుదు. ఇక దీంతో విజువల్ ఎఫెక్ట్స్ గురించి కోడి రామకృష్ణ ప్రత్యేకంగా నేర్చుకుని, బ్రిటిష్ టెక్నీషియన్ క్రిస్టోఫర్ హోమ్స్ సాయంతో అద్భుతమైన గ్రాఫిక్స్‌ను తెరపైకి తెచ్చారు.

బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేసిన ‘అమ్మోరు’:

సౌందర్య భక్తురాలు భవానీగా, రమ్యకృష్ణ అమ్మవారిగా పోటీపడి నటించిన ఈ సినిమా 1995లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. సరస్సు నీళ్లు పెద్ద చేయిగా మారడం, నుదుటి నుంచి శూలం దూసుకెళ్లడం లాంటి సీన్లు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఇక ఈ విజయం రమ్యకృష్ణ, సౌందర్య కెరీర్‌లను మరో స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా, తెలుగు సినిమాలో గ్రాఫిక్స్‌కు ఒక కొత్త ప్రమాణాన్ని నేర్పింది.

Advertisement

ఇక ఎన్ని కష్టాలు పడినా, తెరపై ఆ సినిమా సాధించిన విజయం, ప్రజలు అమ్మవారిగా తనను ఆరాధించిన తీరు చూశాక ఆ బాధంతా మర్చిపోయానని రమ్యకృష్ణ ఎమోషనల్ అయ్యారు. అందుకే ‘అమ్మోరు’ ఆమె కెరీర్‌లోనే ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది..

also read:నాన్న చివరి కోరిక అదే.. ఎలా చనిపోయారో చెబుతూ రఘుబాబు ఎమోషనల్ వీడియో! 

Related News

భార్యాభర్తలమే కానీ వేరుగా ఉంటున్నాం.. రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్!

గిరిబాబు మరణం…అందరికీ క్షమాపణలు చెప్పిన రఘు బాబు..ఏం జరిగిందంటే?

దుల్కర్ వర్సెర్ సౌమిత్ ..ఓకె కథతో రెండు సినిమాలు…టాలీవుడ్ లో కాపీ వివాదం!

పవన్ తేజ్ కొణిదెల హీరోగా ‘జనతా’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్!

గిరిబాబు మరణం.. చివరి చూపుకు నోచుకోలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్న నటుడు!

అంతరిక్షంలోకి వెళ్లాలనే అమ్మాయి కల..ఆసక్తికరంగా డియర్ ఆస్ట్రోనాట్ ట్రైలర్!

నాన్న చివరి కోరిక అదే.. ఎలా చనిపోయారో చెబుతూ రఘుబాబు ఎమోషనల్ వీడియో!

Big Stories

Advertisement
×