E-Paper
Advertisement

వృషకర్మ కోసం నాగచైతన్య షాకింగ్ రెమ్యూనరేషన్.. ఎంతంటే?

వృషకర్మ కోసం నాగచైతన్య షాకింగ్ రెమ్యూనరేషన్.. ఎంతంటే?
Advertisement

Naga Chaitanya: నాగచైతన్య టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న అక్కినేని ఫ్యామిలీ నుంచి అక్కినేని వారసుడుగా నాగచైతన్య (Naga Chaitanya) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు .ఇలా భారీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ నాగచైతన్య టైర్ 2 హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక నాగచైతన్య ఇప్పటివరకు తన సినీ కెరియర్లు 24 సినిమాలలో నటించారు. ఈ సినిమాలలో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి, డిజాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక త్వరలోనే నాగచైతన్య వృషకర్మ(vrushakarma) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

రెమ్యూనరేషన్ పెంచిన నాగ చైతన్య..

ఇలా నాగచైతన్య సినీ కెరియర్లో సక్సెస్ రేట్ తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈయన రెమ్యూనరేషన్ కూడా చాలా తక్కువగా తీసుకుంటూ వచ్చారు.. ఇదివరకు నాగచైతన్య ఒక్కో సినిమాకు 10 నుంచి 15 కోట్ల రెమ్యూనరేషన్ అందుకునేవారు. అయితే ఇటీవల నాగచైతన్య నటించిన తండేల్ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఈయన కూడా తన రెమ్యూనరేషన్ పెంచారని తెలుస్తోంది. ఇలా నాగచైతన్య రెమ్యూనరేషన్ పెంచడంతో ప్రస్తుతం ఈయన నటిస్తున్న వృషకర్మ సినిమాకు ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్(remuneration) తీసుకున్నారనే విషయంపై ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది.

నాగచైతన్య కెరియర్ లోనే హైయెస్ట్..

Advertisement

నాగచైతన్య వృషకర్మ సినిమా కోసం ఏకంగా 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం. తండేల్ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఈ సినిమాకు ఈయన 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని ఇది నాగచైతన్య సినీ కెరియర్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అని తెలుస్తుంది. ఇప్పటివరకు తక్కువ బడ్జెట్ సినిమాలను చేసిన నాగచైతన్య వృషకర్మ సినిమాకు మాత్రం భారీ బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఏకంగా 100 నుంచి 110 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు సమాచారం. ఇక నాగచైతన్య కూడా ఈ సినిమా కోసం 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోవడం విశేషం.

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి…

ఇక ఈ సినిమా మైథాలజికల్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగచైతన్య ఒక యోధుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా నైజాం రిలీజ్ హక్కులను దిల్ రాజు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా మీనాక్షి చౌదరి దక్ష అనే పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Also Read: హమ్మయ్య.. దేవర సాటిలైట్ రైట్స్ కు లైన్ క్లియర్.. టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధం!

Related News

పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన డింపుల్ హయతి!

హమ్మయ్య.. దేవర సాటిలైట్ రైట్స్ కు లైన్ క్లియర్.. టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధం!

టాలీవుడ్‌ను ఏలుతున్న తెలంగాణ దర్శకులు.. ఎవరి రెమ్యునరేషన్ ఎంతంటే?

బన్నీ సినిమాలు చేయకున్నా ఏడాదికి రూ.40  కోట్ల ఆదాయం .. ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి!

సెన్సార్ పూర్తి చేసుకున్న నాగచైతన్య ‘వృషకర్మ’ .. ఏ సర్టిఫికెట్ వచ్చిందంటే?

రష్మిక మైసా కొత్త రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడంటే?

శర్వా భుజం పై వాలిన డింపుల్.. తెర పైకి కొత్త రూమర్లు?

Big Stories

Advertisement
×