E-Paper
Advertisement

పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన డింపుల్ హయతి!

పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన డింపుల్ హయతి!
Advertisement

Dimple hayathi: సోషల్ మీడియాలో సెలబ్రిటీలు కలసి జంటగా కనిపిస్తే చాలు వారి మధ్య లేనిపోని రూమర్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇక పబ్లిసిటీ స్టంట్ కోసమో లేక అనుకోకుండా జరిగిన సందర్భమో తెలియదు కానీ ఇలాంటివి ఏవైనా కెమెరా కంటికి చిక్కాయి అంటే ఇక వారి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ అనే రూమర్లు వినిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ బ్యూటిఫుల్ హీరోయిన్ డింపుల్ హయతి జంటగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా భోగి.

శర్వానంద్ – డింపుల్ మధ్య అత్యంత చనువు..

సంపత్ నంది దర్శకత్వంలో నవంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఆదివారం ఈ మూవీ ట్రైలర్ లాంచ్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ వేడుకలో శర్వానంద్ డింపుల్ హయతి ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. శర్వానంద్ ను చూడగానే డింపుల్ చనువుగా హత్తుకొని మాట్లాడడమే కాకుండా ఆయన భుజంపై తల వాల్చి మరీ నవ్వుతూ మాట్లాడిన వీడియో నెట్టింట అంతే వైరల్ అవుతోంది.

నెటిజన్ ప్రశ్నకు డింపుల్ క్లారిటీ..

Advertisement

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక నెటిజన్ అత్యుత్సాహంతో అడిగిన ప్రశ్నకు డింపుల్ హయతి అంతే రీతిలో సమాధానమిచ్చింది. ఇకపోతే శర్వానంద్ పై తల వాల్చి వేడుకను వీక్షిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అది చూసిన ఒక్క నెటిజన్ డింపుల్ కి కూడా పెళ్లయిందా? అంటూ కామెంట్ చేశారు. దీనికి ఆమె నాకు పెళ్లి కాలేదు? అంటూ గట్టిగా నవ్వుతున్న లాల్ ఎమోజిలను షేర్ చేసింది. మొత్తానికైతే ఈ క్రేజీ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

మరో అనుమానానికి తెరలేపిన డింపుల్ హయతి..

ఇకపోతే డింపుల్ హయతి నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిందే తప్ప సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆడియన్స్ లో మరో సరికొత్త అనుమానాలు రేకెత్తాయి. డింపుల్ తనకు పెళ్లి కాలేదని చెప్పింది అంటే మరి శర్వానంద్ తో రిలేషన్ లో ఉందా? అటు శర్వానంద్ కూడా తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.. మరి దీనికి సమాధానం ఏంటి ? అసలు ఇద్దరి మధ్య నిజంగానే సంథింగ్ సంథింగ్ నడుస్తోందా? అంటూ అనుమానాలు గుప్పిస్తున్నారు.

అసలేం జరిగిందంటే?

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే సాధారణంగా సినిమా ప్రమోషన్లలో హీరో హీరోయిన్లు మాట్లాడుకోవడం సహజమే. అయితే శర్వానంద్ వ్యక్తిగత జీవితంపై గత కొంతకాలంగా వినిపిస్తున్న ప్రచారం కారణంగానే ఈ వీడియో పై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. 2023 జూన్ 3న జైపూర్ లోని ది లీలా ప్యాలెస్ లో శర్వానంద్, రక్షితా రెడ్డిని వివాహం చేసుకున్నారు. 2024లో ఒక కూతురు కూడా జన్మించింది. అయితే గత ఏడాది సెప్టెంబర్ నుండి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని , విడిగా ఉంటున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఈ ఏడాది ఏప్రిల్ లో శర్వానంద్ కూడా తన ఇంస్టాగ్రామ్ ఖాతా నుండి పెళ్లి ఫోటోలను తొలగించడంతో విడాకుల రూమర్స్ మరింత బలపడ్డాయి . ఇప్పుడు వీరిద్దరూ క్లోజ్ గా కనిపించడంతో కొందరు నెటిజన్లు వీరి మధ్య ఏదో ఉందంటూ కొత్త పుకార్లకు తెర లేపారు.

also read: వర్షిణి ముఖంపై కాఫీ కొట్టిన సుధీర్.. బుద్ధిలేదన్న శివ!

స్పందించిన సినీవర్గాలు..

అయితే దీనిపై స్పందించిన సినీవర్గాలు ఇందులో ఎలాంటి నిజం లేదు అని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే భోగి చిత్రంలో డింపుల్ హయతి మందారం అనే కీలకపాత్ర పోషిస్తుంది. షూటింగ్స్ సమయంలో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది . అందులో భాగంగానే నటీనటుల మధ్య ఆప్యాయత, స్నేహపూర్వక చనువుతోనే అలా పలకరించుకున్నారు తప్ప వారి మధ్య ఏమీ లేదని తేల్చేశారు.

Related News

వృషకర్మ కోసం నాగచైతన్య షాకింగ్ రెమ్యూనరేషన్.. ఎంతంటే?

హమ్మయ్య.. దేవర సాటిలైట్ రైట్స్ కు లైన్ క్లియర్.. టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధం!

టాలీవుడ్‌ను ఏలుతున్న తెలంగాణ దర్శకులు.. ఎవరి రెమ్యునరేషన్ ఎంతంటే?

బన్నీ సినిమాలు చేయకున్నా ఏడాదికి రూ.40  కోట్ల ఆదాయం .. ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి!

సెన్సార్ పూర్తి చేసుకున్న నాగచైతన్య ‘వృషకర్మ’ .. ఏ సర్టిఫికెట్ వచ్చిందంటే?

రష్మిక మైసా కొత్త రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడంటే?

శర్వా భుజం పై వాలిన డింపుల్.. తెర పైకి కొత్త రూమర్లు?

Big Stories

Advertisement
×