E-Paper
Advertisement

తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. పథకానికి 50 కోట్లు కేటాయింపు?

తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. పథకానికి 50 కోట్లు కేటాయింపు?
Advertisement

Germany Jobs: తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు జర్మనీలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరతను అధిగమించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. జర్మనీలోని లోయర్ సాక్సనీ రాష్ట్రంతో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, అంతర్జాతీయ కార్మిక ఉపాధిపై బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సోమవారం న్యూఢిల్లీలోని జర్మనీ రాయబార కార్యాలయంలో తెలంగాణ–లోయర్ సాక్సనీ రాష్ట్రాల మధ్య టాలెంట్ మొబిలిటీ అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొని ప్రసంగించారు.

ప్రాక్టికల్ శిక్షణ..

లోయర్ సాక్సనీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒలాఫ్ లీస్, భారతదేశంలోని జర్మనీ రాయబారి డాక్టర్ జాస్పర్ వీక్, డాక్టర్ బాల రమణితో పాటు భారత్, జర్మనీకి చెందిన పలువురు ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువతకు కేవలం సర్టిఫికెట్లు ఇచ్చే శిక్షణ కాకుండా పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన ప్రాక్టికల్ శిక్షణ అందించి, వారికి స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి సుమారు 300 ఐటీఐలు ఉన్నాయని తెలిపారు. టాటా టెక్నాలజీస్ సహకారంతో ఇప్పటికే 65 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, మరో 54 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. తద్వారా యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇచ్చి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందిస్తున్నామని వివరించారు.

Advertisement

Also Read: ఆపరేషన్ కగార్ జరిగినా నేటికీ లొంగని మావోయిస్టులు.. ఎవరో తెలుసా..?

అంతర్జాతీయ ఉపాధి..

జర్మనీలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఉన్న యువ మానవ వనరుల సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. జర్మనీకి అవసరమైన నైపుణ్యం కలిగిన ఉద్యోగులను అందించేందుకు తెలంగాణ యువతకు తగిన శిక్షణ, నైపుణ్యాలు కల్పిస్తే ఇరు ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఇది తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు జర్మనీ పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యంగా మారుతుందని అన్నారు.తెలంగాణలో అంతర్జాతీయ ఉపాధి అవకాశాల కల్పనకు అవసరమైన సంస్థాగత వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.

ప్రత్యేక ప్రాధాన్యత..

Advertisement

ఇందులో భాగంగా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లో లోయర్ సాక్సనీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యాలయం ద్వారా నైపుణ్య శిక్షణ, ఉద్యోగ నియామకాలు, ఇరు ప్రాంతాల సంస్థల మధ్య సమన్వయం మరింత సులభతరం అవుతుందని తెలిపారు.రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ఈ రంగంలోని వివిధ కార్యక్రమాల అమలుకు ముఖ్యమంత్రి ఓవర్సీస్ పథకం కింద రూ.50 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు.

Also Read: అవనీత్ కౌర్ అందానికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. లేటెస్ట్ పోస్ట్ వైరల్!

Tags

Related News

ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణలో కొత్త పద్దతి: గద్వాల్ విజయలక్ష్మి!

బౌరంపేటలో అక్రమ గ్యాస్ సిలిండర్ల దందా కలకలం

కోటి ఓట్లు.. 90 సీట్లే మా లక్ష్యం.. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్!

పల్నాడు వాటర్ గ్రిడ్ వెనుక ఉన్న అసలు దొంగలు వీల్లే: చిట్టా విప్పిన సీఎం రేవంత్!

ఆపరేషన్ కగార్ జరిగినా నేటికీ లొంగని మావోయిస్టులు.. ఎవరో తెలుసా..?

నిమ్స్‌లో అవినీతి దందా.. రోగి చనిపోయిన 3 నెలల తర్వాత కూడా బిల్లుల ప్రాసెసింగ్!

ఇది నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్దం.. సీఎం రేవంత్‌కు కౌశిక్ రెడ్డి సవాల్!

Big Stories

Advertisement
×