Dhanush: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు ధనుష్(Dhanush) ఒకరు. సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఈయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే కెరియర్ మొదట్లో తాను కూడా ఇబ్బందులు పడ్డానని, అదేవిధంగా నన్ను చూసి ఎంతోమంది హేళన కూడా చేశారు అంటూ పలు సందర్భాలలో ధనుష్ తన ఇండస్ట్రీ తొలి రోజుల్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేశారు. ఇకపోతే ధనుష్ తాజాగా మరో ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ధనుష్ తాజాగా న్యూఢిల్లీలో జరిగిన CNN -News 18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2026 వేడుకలలో భాగంగా ఎంటర్టైన్మెంట్ పాపులర్ ఛాయిస్ అవార్డును అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ధనుష్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. అసలు తనకు ఇండస్ట్రీలోకి రావాలని ఏమాత్రం ఇష్టం లేదని తెలిపారు. తాను అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా స్థిరపడ్డాను కానీ తనకు మాత్రం చెఫ్ (chef)కావాలని చాలా కోరికగా ఉండేదని ఈ సందర్భంగా ధనుష్ తెలిపారు. ప్రస్తుతం తాను నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న అది కేవలం తన తల్లిదండ్రుల ప్రార్థనలు, మీ అభిమానమేనని తెలిపారు. ప్రస్తుతం తాను నటుడిగా ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఆ క్రెడిట్ నాది కాదని, 2027 వ సంవత్సరంతో నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి అవుతాయని ధనుష్ తెలిపారు.
ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో తాను ఇన్ని సంవత్సరాల పాటు ప్రయాణం చేస్తానని ఎప్పుడు ఊహించలేదంటూ ధనుష్ తెలిపారు. ఇలా అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో ఇబ్బందులు పడ్డాను కొన్నిసార్లు ఇండస్ట్రీ నుంచి పారిపోవాలని కూడా భావించానని ధనుష్ తెలిపారు. ఈ విధంగా ధనుష్ తాను నటుడు కావాలనుకోలేదు చెఫ్ అవ్వాలనుకున్నాను అంటూ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ధనుష్ తాజాగా ఓం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
అమరన్ సినిమా డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ధనుష్, శ్రీ లీల జంటగా నటించగా, ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కూడా కీలకపాత్రలో నటించారు. అదేవిధంగా సాయి పల్లవి ఐపీఎస్ పాత్రలో నటించారు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇలా ధనుష్ నటుడిగా తమిళ సినిమాలు మాత్రమే కాకుండా పూర్తిస్థాయి తెలుగు సినిమాలలో కూడా నటిస్తూ ఇక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఈయన తమిళంలో నటించిన సినిమాలకు తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: సీనియర్ నటుడు సుధాకర్ కొడుకును చూశారా.. అచ్చం తండ్రి పోలికలే!