Madhuri Rathod’s Akula Kura Sisala Kallu:మాధురి రాథోడ్ ..ఈ పేరిపుడు ఒక సెన్సేషన్ . ఈశ్వర్ సాయి తో కాంట్రవర్సీ తో ఓవర్ నైట్ వార్తల్లో నిలిచిన ఈ ఫోక్ డాన్సర్ ఇపుడు వరుస సాంగ్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.ముఖ్యంగా వివాదానికి ముందు అడపా దడపా ఫోక్ సాంగ్స్ చేసే మాధురి ఇపుడు నెలకొక సాంగ్ అన్నట్టుగా చేసుకుపోతుండటం విశేషం.ఈ మధ్యే బండి రాజయ్య మనవడ, భామ సుందరాలో, రాజు బిందెల నీళ్ళు, మంజులో మాట్లాడిపోతా వంటి పాటలు చేసిన మాధురి రాథోడ్ తాజాగా మరో సాంగ్ వదిలింది.
ఆకుల కూర సీసల కళ్ళు
పది నెలల కింద వచ్చిన ఆకుల కూర సీసల కళ్ళు అనే పాటకి డిజే వర్షన్ లో వచ్చిన ఈ సాంగ్ కూడా ఆడియన్స్ ని ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది.ముఖ్యంగా చెవులకి ఇంపుగా ఉండే సాహిత్యం, దానికి తగ్గ మాస్ బీట్, వాటికి అదిరిపోయే స్టెప్పులు యాడ్ అయితే ఆ పాటకి వచ్చే క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పక్కర్లేదు.ఇదిగో తాజాగా వచ్చిన ఆకుల కూర సీసల కళ్ళు అనే పాట ఇపుడు ఆ కోవలోనే సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
ఇప్పటికి 26 మిలియన్ల వ్యూస్
పది నెలల కిందట వచ్చిన ఈ పాట ఇప్పటికి 26 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టగా, ఇపుడు అదే పాటని డిజే వెర్షన్ చేసివదిలారు.ఇక ఈ పాట కూడా ఒక రోజులోనే ఏకంగా దాదాపు 6 లక్షల వ్యూస్ ని సొంతం చేసుకోవడం విశేషం. ఇక ఈ పాటకి పంబాల రమేష్ పదాలని అందించగా రాజు మాల్ సంగీత దర్శకత్వంలో ఈ పాటకి ఈ మధ్య కాలంలో వరుస హిట్స్ కి తన గాత్రాన్ని అందిస్తున్న అధిమల్ల గీరమ్మ ఈ పాటని కూడా పాడటం విశేషం.
అయితే ఈ పాట వరిజినల్ ట్యూన్ వేడి ఉండగా దాన్ని మహేందర్ నార్రవుల సేకరించి ఈ పాటని నిర్మించడం మరో విశేషం.ఇక ఈ పాటకి ఎప్పటిలానే శేఖర్ వైరసో ,లీడింగ్ బాయ్స్ కాకుండా AMR కోరియోగ్రఫీ చేయడం విశేషం.ఇక అరుణ్ కొల్గురి అందించిన సినిమాటోగ్రఫీ కూడా పాటకి మరింత బ్యూటీని యాడ్ చేసిందనే చెప్పాలి.
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కౌ బాయ్ లుక్ లో
అయితే మొదటి పాటని సింపుల్ గా అన్ని పాటల్లాగే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తీయగా ఈ డిజే వెర్షన్ ని మాత్రం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కౌ బాయ్ లుక్ లో కొంచెం క్రేజీగా తీయడం విశేషం.ఇక ఈ పాటని చూసిన వారంతా బ్యాక్ డ్రాప్ సరికొత్త గా ఉందని, రొటీన్ గా కాకుండా ఇలా సరికొత్తగా తీయడం మెచ్చుకోతగ్గ విషయమని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.ఇక మరికొంతమంది మాధురి రాథోడ్ స్టెప్పులు వేస్తే ఆ పాట ఫ్లాప్ అయినట్టు చరిత్రలో లేదని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ALSO READ:మాధురి రాథోడ్ మరో సెన్సేషన్.. బండి రాజయ్యతో రచ్చ రచ్చ!
ఈజీగా 100 మిలియన్ల వ్యూస్
మరికొంతమంది అయితే ఈ పాట ఈజీగా 100 మిలియన్ల వ్యూస్ ని ఈజీగా కొట్టేస్తుందని ఇప్పటి నుండే లెక్కలు వేయడం చూస్తుంటే మాధురి రాథోడ్ క్రేజ్ మీద ఫోక్ లవర్స్ కి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అర్థం అవుతుంది. చూడాలి మరి ఆకాశాన్ని తాకుతున్న అభిమానుల అంచనాలని ఈ పాట ఏమేరకి అందుకుంటుందో !