Rukmini Vasanth:రుక్మిణి వసంత్ ..సౌత్ ఇండస్ట్రీని తన అందంతో మెస్మరైజ్ చేస్తూ టాప్ లీగ్ లోకి దూసుకెళ్లిన ఈ భామ సోషల్ మీడియాలోనూ తన అప్ డేట్స్ తో రచ్చ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ కన్నడ కస్తూరి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఎప్పుడూ షూటింగ్‌లు, ప్రమోషన్లు అంటూ బిజీబిజీగా గడిపే ఈ బ్యూటీ, గతంలో లండన్‌లో ఎంజాయ్ చేసిన వేసవి రోజులను గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని షేర్ చేసిన ఫోటోలు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి.“A summer in London, as I remember it” అంటూ క్యాప్షన్ తో పెట్టిన ఈ ఫోటోలని చూస్తూ ఫిదా అయిపోయారు ఆడియన్స్.
ఈ ఫొటోల్లో రుక్మిణి చాలా సింపుల్‌గా, ఎలాంటి మేకప్ హడావుడి లేకుండా, ఒక సాధారణ అమ్మాయిలా లండన్ వీధుల్లో తిరుగుతూ తన వెకేషన్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్లు ఈ పిక్స్ చూస్తే అర్థమవుతోంది. ఒక ఫొటోలో రెస్టారెంట్‌లో కూర్చుని పిజ్జా తింటూ క్యూట్‌గా నవ్వుతూ సందడి చేయగా మరో ఫొటోలో లండన్‌లోని ఓ పార్క్‌లో పచ్చని చెట్ల మధ్య సన్‌గ్లాసెస్ పెట్టుకుని, చేతిలో ఐస్‌క్రీమ్ పట్టుకుని కనిపించింది.
మాములుగా సినిమా స్టార్స్ వాళ్ల పర్సనల్ లైఫ్‌లో ఎలా ఉంటారు? ఖాళీ సమయాల్లో ఏం చేస్తారు? అని తెలుసుకోవాలని ఫ్యాన్స్‌కు ఆసక్తి ఉంటుందని చెప్పక్కర్లేదు. ఇక తాజాగా రుక్మిణి వసంత్ షేర్ చేసిన ఈ ఫొటోలు వాటికి ఆన్సర్ ఇచ్చినట్టే కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్, లగ్జరీ లైఫ్ కాకుండా స్నేహితులతో కలిసి సరదాగా గడపడం, నచ్చిన ఫుడ్ తినడం, ప్రకృతి మధ్య గా టైమ్ స్పెండ్ చేయడం ఇక్కడ మెచ్చుకోతగ్గ విషయం.
ఇక రుక్మిణి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరని స్పెషల్ గా చెప్పక్కర్లేదు. కన్నడలో వచ్చిన ‘సప్త సాగరదాచే ఎల్లో’ (సైడ్ ఏ, సైడ్ బీ) సినిమాల్లో ప్రియా పాత్రతో ఎంట్రీ ఇచ్చిన తనదైన అమాయకత్వంతో ఆడియన్స్ కి బాగా దగ్గరైపోయింది.ఇక ఆ సినిమాతో వచ్చిన క్రేజ్‌తో వరుస ఛాన్స్ లు పట్టేసిన ఈ బ్యూటీ ‘బాణదారియల్లి’, ‘బఘీరా’, ‘భైరతి రణగల్’ లాంటి సినిమాలని తన ఖాతాలో వేసుకుని సత్తా చాటింది.
ఇక తెలుగులో నిఖిల్ సరసన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈ ముద్దుగుమ్మ కన్నడ, తెలుగుకే పరిమితం కాకుండా తమిళంలో ‘ఏస్’, ‘మధరాసి’ సినిమాలతో కోలీవుడ్‌లోనూ నటించి తమిళ తంబీలకి దగ్గరైపోయింది
ALSO READ:జానపదానికి డీజే టచ్.. మాధురి రాథోడ్ స్టెప్పులు, ఎక్స్‌ప్రెషన్స్ అదిరిపోయాయ్ గా !
ముఖ్యంగా రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’లో కనకవతి పాత్రలో, అలాగే 2026లో విడుదలైన యష్ పాన్ ఇండియా సినిమా ‘టాక్సిక్’లో మెలిస్సా పాత్రలో నటించి తన రేంజ్ ప్యాన్ ఇండియా అని ప్రూవ్ చేసుకుంది.మరో వైపు తారక్ డ్రాగన్ లోనూ ఈ భామ మెరవబోతుందని చెప్పక్కర్లేదు.మొత్తానికి ఒక వైపు వరుస సినిమాల్ని చేస్తూనే మరో వైపు తనవైన అప్ డేట్స్ తో నెట్టింట రచ్చ చేస్తుందన్న మాట !