Samsung 32 inch smart TV: ఇంటర్నెట్ యుగంలో నార్మల్ టీవీల కాలం చెల్లిపోయింది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ చూడాలన్నా.. ఫోన్ స్క్రీన్‌ను టీవీకి కనెక్ట్ చేయాలన్నా స్మార్ట్ టీవీ ఉండాల్సిందే. ఒకప్పుడు స్మార్ట్ టీవీల ధరలు ఆకాశంలో ఉండేవి, కానీ ఇప్పుడు బడ్జెట్ ధరలోనే టాప్ బ్రాండ్ సామ్‌సంగ్ మన ముందుకు UA32T4410AKLXL మోడల్‌ను తీసుకొచ్చింది. మరి రూ. 21,991 బడ్జెట్‌లో దొరుకుతున్న ఈ టీవీలో ఉన్న క్రేజీ ఫీచర్స్ ఏంటో, ధరల వివరాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1.డిజైన్ అండ్ డిస్‌ప్లే:
మొదటి చూపులోనే.. ఈ టీవీ లుక్ మిమ్మల్ని పడేస్తుంది. దీని Glossy Black ఫినిషింగ్, స్లిమ్ బెజెల్స్ టీవీకి చాలా ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. మీ లివింగ్ రూమ్ లేదా బెడ్‌రూమ్ గోడకు తగిలిస్తే.. ఇల్లు చాలా ట్రెండీగా కనిపిస్తుంది.
ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఇందులో.. 32 ఇంచుల HD Ready (1366×768) స్క్రీన్‌ను ఇచ్చారు. 60Hz రీఫ్రెష్ రేట్‌తో వచ్చే ఈ డిస్‌ప్లేలో.. కలర్స్ చాలా రిచ్‌గా, రియలిస్టిక్‌గా కనిపిస్తాయి. దీనికి తోడు సామ్‌సంగ్ వారి సొంత PurColor టెక్నాలజీ, HyperReal Engine ఉండటం వల్ల, మనం చూసే ప్రతి సీన్ ఎంతో క్లారిటీగా, బ్రైట్‌గా ఉంటుంది. బడ్జెట్ రేంజ్‌లో.. ఈ స్థాయి కలర్ ప్రొడక్షన్ రావడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి.
2. సౌండ్ క్వాలిటీ:
సినిమా చూసేటప్పుడు.. పిక్చర్ ఎంత ముఖ్యమో, సౌండ్ కూడా అంతే ముఖ్యం కదా!ఈ సామ్‌సంగ్ స్మార్ట్ టీవీలో 20 వాట్స్ (20W) అవుట్‌పుట్ గల పవర్‌ఫుల్ స్పీకర్లను ఇచ్చారు. దీనికి Dolby Digital Plus సపోర్ట్ కూడా ఉంది. దీనివల్ల డైలాగ్స్ చాలా స్పష్టంగా, బేస్ కూడా డీసెంట్‌గా వినిపిస్తుంది. చిన్న రూమ్‌లకైతే.. విడిగా హోమ్ థియేటర్ సిస్టమ్స్ పెట్టాల్సిన అవసరమే లేదు, ఈ సౌండ్ సరిపోతుంది.
3. స్మార్ట్ ఫీచర్స్:
ఇది సామ్‌సంగ్ వారి సొంత Tizen OS ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. దీని ఇంటర్‌ఫేస్ చాలా స్మూత్‌గా, ఈజీగా ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి పాపులర్ ఓటీటీ యాప్స్ అన్నీ ఇందులో ఇన్‌బిల్ట్‌గా వస్తాయి.
పర్సనల్ కంప్యూటర్ మోడ్: ఈ టీవీని మీరు పర్సనల్ కంప్యూటర్‌గా కూడా మార్చుకోవచ్చు. ఆఫీస్ వర్క్ లేదా క్లౌడ్ ద్వారా మీ డాక్యుమెంట్లను పెద్ద స్క్రీన్‌పై యాక్సెస్ చేయవచ్చు.
స్క్రీన్ మిర్రరింగ్ : మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలను కేవలం ఒక్క క్లిక్‌తో టీవీ స్క్రీన్ పైకి షేర్ చేయవచ్చు.
మ్యూజిక్ సిస్టమ్: టీవీని ఒక స్టెలిష్ వర్చువల్ మ్యూజిక్ సిస్టమ్‌గా మార్చి, అద్భుతమైన విజువల్స్‌తో పాటలు వినవచ్చు.
Also Read: వైర్లతో పనిలేదు.. అమెజాన్ నుంచి అదిరిపోయే వైర్‌లెస్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్!
4. కనెక్టివిటీ ఆప్షన్స్:
గ్యాడ్జెట్స్ కనెక్ట్ చేసుకోవడానికి ఇందులో.. వెనక వైపు 2 HDMI పోర్టులు (సెట్-టాప్ బాక్స్, గేమింగ్ కన్సోల్ కోసం), 1 USB పోర్ట్ (పెన్‌డ్రైవ్, హార్డ్ డిస్క్ కోసం) ఇచ్చారు. అలాగే వై-ఫై (Wi-Fi) కనెక్టివిటీ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది, బఫరింగ్ లేకుండా నచ్చిన కంటెంట్ చూడొచ్చు.
మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో బ్రాండెడ్ నమ్మకం, అదిరిపోయే పిక్చర్ క్వాలిటీ, లేటెస్ట్ స్మార్ట్ ఫీచర్స్ ఉన్న టీవీ కోసం చూస్తుంటే.. కళ్ళు మూసుకుని రూ.21,991 ధర గల Samsung 32 Inch (UA32T4410AKLXL)మోడల్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మీ మనీకి వంద శాతం వాల్యూ ఇస్తుంది.
Also Read: బడ్జెట్ ధరలో.. రిమోట్ కంట్రోల్ సీలింగ్ ఫ్యాన్, ఫుల్ కరెంట్ సేవ్ !