E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

అయోధ్య విరాళాల చోరీ.. యోగి సర్కార్ సీరియస్.. ‘బుల్డోజర్’ యాక్షన్‌కు రంగం సిద్ధం!

అయోధ్య విరాళాల చోరీ.. యోగి సర్కార్ సీరియస్.. ‘బుల్డోజర్’ యాక్షన్‌కు రంగం సిద్ధం!
Advertisement

Ayodhya Donations Theft: అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ ముమ్మరం చేయడంతో నిందితుల విలాసవంతమైన ఇళ్లు, అక్రమంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ విరాళాల పెట్టెలు (డొనేషన్ బాక్సులు) ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీనికి తోడు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నవారిపై ‘బుల్డోజర్’ యాక్షన్ తీసుకునే దిశగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఏ క్షణమైన నిందితుల అక్రమ ఆస్తుల కట్టడాలు కుప్పకూలొచ్చన్న ప్రచారం యూపీలో జోరుగా సాగుతోంది.

విరాళల చోరి కేసులో నిందితుడిగా ఉన్న లవ్ కుష్ మిశ్రాను బుల్డోజర్లు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. దొంగిలించిన సొమ్ముతో కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్న అతడి ఆస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. నిందితుడి భార్య పేరు మీద నిర్మాణం జరుగుతున్న ఓ భవనానికి సంబంధించి అయోధ్య అభివృద్ధి అథారిటీ (ADA) తాజాగా నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. సంతృప్తికరమైన సమాధానం రాకపోతే.. ఆ నిర్మాణాన్ని కూలుస్తామని ఇప్పటికే అథారిటీ హెచ్చరించింది.

Advertisement

అలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణలకు సంబంధించి అరెస్టు అయిన 8 మంది నిందితుల్లో లవ్ కుష్ మిశ్రా ఒకరు. దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు.. అతడి ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.14.25 లక్షల నగదు బయటపడింది. దర్యాప్తు వర్గాల సమాచారం ప్రకారం.. మిశ్రాకు షాహదత్ గంజ్ ప్రాంతంలో 1000 చ.అ. స్థలంలో విలాసవంతమైన బహుళ అంతస్తు ఇల్లు ఉంది. ఈ ఆస్తి మెుత్తం విలువ రూ.1.5 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. నెలకు రూ.20 వేల జీతం తీసుకునే మిశ్రాకు ఈ స్థాయిలో ఆస్తులు, డబ్బు ఎలా వచ్చిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

పోలీసుల వర్గాల ప్రకారం.. ఈ విశాలమైన ఇంటి కోసం మిశ్రా రూ.80-90 లక్షలు ఖర్చు చేశాడు. దాదాపుగా నిర్మాణం పూర్తైన ఈ 3 అంతస్తు భవనంలో విశాలమైన వంటగది, పడక గదులు, లిఫ్ట్ కోసం ప్రత్యేక స్థలంను ఏర్పాటు చేశారు. ఆలయ విరాళాల నుండి దొంగిలించిన డబ్బుతోనే ఈ ఆస్తికి నిధులు సమకూర్చారా? లేదా? అన్న కోణంలో దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఆ డబ్బుతోనే కట్టిందని తేలితే.. అయోధ్య అభివృద్ధి అథారిటీ (ADA) కఠినమైన చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement

Also Read: నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

ఇదిలా ఉంటే విరాళాల చోరీకి సంబంధించి 8 మంది నిందితుల నుంచి భారీ మెుత్తంలో డబ్బును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ.80.92 నగదుతో పాటు, 1,121 డాలర్లను సీజ్ చేశారు. అంతేకాకుండా విరాళంగా ఇచ్చినట్లు భావిస్తున్న బంగారం, వెండి ఆభరణాలను సైతం అధికారులు వారి వద్ద గుర్తించారు. నిందితులైన మనీశ్ యాదవ్ నుంచి రూ.2 లక్షలు, కరుణేష్ పాండే నుంచి రూ.18.07 లక్షల, లవకుష్ మిశ్రా నుంచి రూ.14.25 లక్షలు, అనుకల్ప్ మిశ్రా నుంచి రూ.16.82 లక్షలు, రమాశంకర్ నుంచి రూ.7.32 లక్షలు, టి. అవినాష్ నుంచి రూ.20.39 లక్షలు, అవినాష్ శుక్లా నుంచి రూ.1 లక్ష చొప్పున స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.

Also Read: పశ్చాత్తాపం లేదు.. పైగా వికృత చేష్టలు.. సియా వీడియో నెట్టింట వైరల్!

Related News

తక్షశిలకు పాక్ తూట్లు.. ‘వారసత్వ హోదా’ ఊడుతుందా? యునెస్కో సీరియస్ వార్నింగ్!

జేఈఈ, నీట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల్లో భారీ మార్పులు.. బోర్డు మార్కులకు 50% వెయిటేజీ?

శివ భక్తి ముందు ఓడిన ప్రకృతి సవాల్.. భారీ వర్షంలోనూ ఆగని అమర్‌నాథ్ తొలి అడుగు!

పశ్చాత్తాపం లేదు.. పైగా వికృత చేష్టలు.. సియా వీడియో నెట్టింట వైరల్!

ట్రాఫిక్ జామ్‌లో హార్ట్ ఎటాక్.. బస్సులోంచి దూకి.. ప్రాణాలు కాపాడిన నర్సులు!

ప్రార్థనా స్థలాలు, పోలీస్ స్టేషన్లే టార్గెట్.. దిల్లీలో రక్తపాతానికి పాక్ భారీ కుట్ర!

బీహార్‌లో పట్టపగలే ఘోరం.. గన్ పాయింట్‌లో బ్యాంక్ CSP దోపిడీ.. షట్టర్ వేసి మరీ!

Big Stories

×