Sitaare Zameen Par Skips OTT Release: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. వృత్తి, వ్యక్తిగత విషయాలతో తరచూ తెరపైకి వస్తున్నారు. మొదటి నుంచి ఆయనతి విభిన్నమైన శైలి. ఆయన ఎంచుకునే కథల్లోనై వైవిధ్యం ఉంటుంది. ఆయన చేసిన పీకూ సినిమానే దీనికి ఉదహరణ. వెండితెరపై వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ఎప్పుడు ఫ్యాన్స్ కి కొత్తదనం రుచి చూపిస్తారు. తన సినీ కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన కథలు, పాత్రలతో మెప్పిస్తూ వస్తున్నారు. ఆరుపదుల వయసులోనూ ఆయన డిఫరెంట్ రోల్స్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఆమిర్ రూటే సపరేట్..
ఆయన ఎంచుకునే కథలు, పాత్రలే కాదు.. తన తీరు కూడా డిఫరెంట్ గా ఉంటుందని మరోసారి ప్రూవ్ చేశారు. అందుకే ఆయన లేటెస్ట్ మూవీ ‘తారే జమీన్ పర్’ విషయంలో అందరు వెళ్లే దారి కాకుండ.. కొత్త దారిలో వెలుతున్నారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో ఆయన కొత్త రూటులో వెళుతున్నారు. ప్రస్తుతం థియేటర్లలో విడుదలైన ఏ సినిమా అయిన ఓటీటీలో విడుదల కావాల్సిందే. ఆ తర్వాత టెలివిజన్ కి వస్తుంది. ఆ తర్వాత ఎంతో కాలానికి యూట్యూబ్ లో అందుబాటులోకి వస్తుంది. ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితులు ఇలా ఉన్నాయి. దర్శక–నిర్మాతలే కాదు.. ప్రేక్షకులు సైతం దీనికి అలవాటు పడ్డారు.
ఓటీటీలో కాదని యూట్యూబ్
చాలామంది థియేటర్లలో కంటే ఓటీటీలోనే సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆమిర్.. ఇది కాదని దర్శక–నిర్మాతలకు, ప్రేక్షకులు కొత్త పద్దతి అలవాటు చేయబోతున్నారు. ఆయన తన సినిమాను ఓటీటీలో, టీవీలో కాకుండా నేరుగా యూట్యూబ్ లో విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన ముందే చెప్పారు. తన సినిమాను ఏ ఓటీటీలోనూ విడుదల చేయడం లేదని గతంలోనే ప్రకటించారు. చెప్పినట్టుగానే సితారే జమీన్ పర్ చిత్రాన్ని యూట్యూబ్ లో విడుదల చేస్తున్నట్టు ప్రటించారు. ఆగష్టు 1వ తేదీ నుంచి ఈ సినిమా యూట్యూబ్ లో స్ట్రీమింగ్ కి రానుంది.
సినిమా చూడాలంటే.. రెంట్ కట్టాల్సిందే
అయితే ఇది కేవలం ఆమిర్ యూట్యూబ్ ఛానళ్లలో మాత్రమే విడుదల కాబోతోంది. అది కూడా రెంటెడ్ పద్దతిలో. ఈ సినిమా చూడాలంటే.. ఆడియన్స్ రూ. 100 చెల్లించాల్సిందే. ఒక్క ఇండియాలోనే కాదు విదేశాల్లో ఇదే పద్దతి అవలంబించనున్నారు. అయితే విదేశాల్లో ప్రాంతాన్ని బట్టి రెంటు మారుతుందట. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఈ అంశం బి–టౌన్ లో హాట్ టాపిక్ మారింది. ఆమిర్ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తుంటే.. మరికొందరు అభ్యంతరం తెలుపుతున్నారు. ఏదేమైన ఈ మిస్టర్ పర్పెక్ట్ రూటే సపరేట్ అని మరోసారి రుజువు చేశారు.