Abhinav Kashyap: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై డైరెక్టర్ అభినవ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు చేయడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అభినవ్ కశ్యప్.. డైరెక్టర్ కమ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ అన్నయ్య. సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దబాంగ్ సినిమాకు డైరెక్టరే అభినవ్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెల్సిందే. ఈ సినిమానే తెలుగులో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ గా రీమేక్ చేశాడు. ఇక్కడ కూడా ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
దబాంగ్ తరువాత అభినవ్ అడ్రెస్ లేకుండా పోయాడు. అయితే అందుకు కారణం సల్మాన్ కుటుంబమే అని సమాచారం.ఈ విషయాన్నీ అభినవ్ ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. అతని వలనే తన కెరీర్ నాశనం అయ్యిందని, బాలీవుడ్ సిస్టమ్ ని మొత్తం అతనే నియంత్రిస్తాడని మీడియా ముందే బహిరంగంగా చెప్పుకొచ్చాడు.
Sreeleela: విజయ్ – రష్మిక లా మారిన శ్రీలీల- కార్తీక్ ఆర్యన్
ఇక తాజాగా దబాంగ్ 15 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా అభినవ్ కొత్తగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇక్కడ కూడా సల్మాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. “2010 లో దబాంగ్ కు సీక్వెల్ చేయమని సల్మాన్ కుటుంబం నన్ను అడిగింది. దానికి నేను నిరాకరించాను. అప్పటినుంచి వారు నాపై పగ తీర్చుకోవాలని చూస్తున్నారు. సల్మాన్ కి నటనపై ఆసక్తి లేదు. 25 ఏళ్లుగా అతను నటించడం లేదు. ఆసక్తి లేకుండా సెట్ కు వస్తాడు. సెలబ్రిటీగా ఉండడానికే చూస్తాడు. అతనొక గుండా.. పగ ప్రతీకారంతో రగిలిపోయే ఒక అసభ్యకరమైన వ్యక్తి. వారు చెప్పిన మాట కాదు అంటే వెంటాడి మరీ వేధిస్తారు. వారందరూ రాబందులు.
సల్మాన్ మాత్రమే కాదు బోనీ కపూర్ కూడా అలాంటివాడే. నా తమ్ముడు అనురాగ్ తో అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. అందుకే అతని సినిమా నుంచి అనురాగ్ బయటకు వచ్చాడు. ఈ రాబందుల గురించి నా తమ్ముడు ముందే చెప్పాడు” అంటూ ఘాటు ఆరోపణలు చేసాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.