Satyanand : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమ కి నటుడుగా కాకుండా టెక్నీషియన్ గా పరిచయం అవుదామని అనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ చూడడానికి బాగుంటాడు. తన హీరోని చేద్దాం అని చిరంజీవి వైఫ్ సురేఖ గారు చెప్పడం వలన పవన్ కళ్యాణ్ కి నటన వైపు అడుగులు వేసేలా చేశారు మెగాస్టార్ చిరంజీవి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సత్యానంద్ దగ్గర యాక్టింగ్ నేర్చుకొని తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. సత్యానంద్ దగ్గర చాలామంది నటన నేర్చుకున్నారు. నేడు పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సాధించుకున్న ప్రభాస్ కూడా సత్యానంద దగ్గర నటన పాఠాలు నేర్చుకున్నాడు.
మెగాస్టార్ నా చేతిలో పెట్టారు
ప్రస్తుతం వైజాగ్ లో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గురువు సత్యానంద్ కూడా పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1992లో మెగాస్టార్ చిరంజీవి నాకు ఫోన్ చేసి అర్జెంటుగా చెన్నై రమ్మన్నారు. చెన్నై వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ ను నా చేతుల్లో పెట్టి, తనని మంచి నటుడుగా తీర్చిదిద్దామని చెప్పారు అంటూ మాట్లాడారు. ఇక పలు సందర్భాలలో పవన్ కళ్యాణ్ సత్యానంద్ గురించి మాట్లాడారు. తన గురువు పైన కృతజ్ఞత భావం ఎప్పటికీ పవన్ కళ్యాణ్ కి అలానే ఉంటుంది. ఇక సత్యానంద్ కి కూడా స్టేజ్ పైన పవన్ కళ్యాణ్ సన్మానం చేశారు.
నేటి నుండే ప్రేక్షకులు ముందుకు
హరిహర వీరమల్లు సినిమా జులై 24న విడుదలవుతున్నట్టు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమాను నేటి నుంచే ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. హైదరాబాదులో కొన్నిచోట్ల ప్రీమియర్ షోస్ మొదలుకానున్నాయి. అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్నిచోట్ల ప్రీమియర్స్ వేయనున్నారు. ఈ సినిమా మీద పెద్దగా అంచనాలు లేవు అనుకున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చి లెక్కలు మార్చేశారు. ఏ సినిమాకి చేయని విధంగా ఈ సినిమాకి విపరీతమైన ప్రమోషన్ చేశారు పవన్ కళ్యాణ్.
Also Read: Nidhhi Agerwal : నిధి అగర్వాల్ పై అలాంటి స్లోగన్స్… సిగ్గుపడిపోయిన హీరోయిన్