OTT Movie : ఒక రియలిస్టిక్, ఎమోషనల్, సస్పెన్స్‌ఫుల్ కాప్ డ్రామా రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. ఈ మలయాళం సినిమా పోలీసు జీవితంలోని కష్టాలను, వ్యక్తిగత ట్రాజెడీలను హైలైట్ చేస్తుంది. దిలీష్ పోతన్, రోషన్ మాథ్యూ నటన, మనేష్ మాధవన్ విజువల్స్ ఈ సినిమాను ఆకట్టుకునేలా చేస్తున్నాయి. క్రైమ్ డ్రామా, రియలిస్టిక్ స్టోరీలు ఇష్టపడేవాళ్ళు తప్పక చూడాల్సిన సినిమా. ఈ సినిమా ఒక రాత్రి ఇద్దరు పోలీసుల పెట్రోలింగ్ డ్యూటీ సమయంలో జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాపేరు ? ఏ ఓటీటీలోకి ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్
‘Ronth’ 2025లో విడుదలైన మలయాళ క్రైమ్ డ్రామా మూవీ. దీన్ని షాహి కబీర్ రాసి, డైరెక్ట్ చేశారు. ఇందులో దిలీష్ పోతన్ (యోహనన్‌గా), రోషన్ మాథ్యూ (దిననాథ్‌గా) ప్రధాన పాత్రల్లో నటించారు. లక్ష్మీ మీనన్, కృష కురుప్, అరుణ్ చెరుకవిల్, సుధి కొప్ప వంటి నటీనటులు కూడా ఉన్నారు. ఈ చిత్రం 2025 జూన్ 13న థియేటర్లలో విడుదలై, జులై 22 నుంచి JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మలయాళం సినిమా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ డబ్బింగ్ వెర్షన్స్‌లో కూడా అందుబాటులో ఉంది. 2 గంటల 5 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 7.9/10 రేటింగ్ ఉంది.
స్టోరీ
కథ కేరళలోని ఇడుక్కి జిల్లాలోని ధర్మశాల పోలీస్ స్టేషన్‌లో జరుగుతుంది. యోహనన్ (దిలీష్ పోతన్) ఒక సీనియర్ సబ్-ఇన్‌స్పెక్టర్. అతను సంవత్సరాలుగా పోలీసు సర్వీస్‌లో చాలా చూశాడు. గతంలోని బాధాకరమైన సంఘటనలతో ఇబ్బంది పడుతున్నాడు. దిననాథ్ (రోషన్ మాథ్యూ) ఒక కొత్తగా చేరిన రూకీ కానిస్టేబుల్. పోలీసు ఉద్యోగంలో నీతిని, న్యాయాన్ని నమ్ముతాడు. వీళ్లిద్దరూ ఒక రాత్రి పెట్రోలింగ్ డ్యూటీలో కలిసి వెళ్లాల్సి వస్తుంది. కానీ వారి విభిన్న వైఖరుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. సినిమా ఒకే రాత్రిలో జరిగే కథల రూపంలో ఉంటుంది. వీళ్లు చిన్న చిన్న సమస్యల నుంచి పెద్ద నేరాలు కేసులను హ్యాండిల్ చేస్తారు. ఈ ఘటనలు వారి జీవితాలను మానసికంగా ఇబ్బనిపెడతాయి. యోహనన్ తన గతంలో జరిగిన ఒక ట్రాజెడీ వల్ల, సిస్టమ్‌లోని అవినీతిని, ఒత్తిళ్లను అర్థం చేసుకుని రాజీ పడి విధులు నిర్వహిస్తుంటాడు. ఒక సందర్భంలో అతను ఒక ప్రీస్ట్ నుంచి డబ్బు తీసుకుంటాడు. దాన్ని లంచం కాదని, పోలీస్ జీప్ రిపేర్‌కి అవసరమని దిననాథ్‌కి వివరిస్తాడు. దిననాథ్ మాత్రం ఈ రాజీలను ఒప్పుకోలేడు. ఆటను న్యాయం కోసం పట్టుబడతాడు.
కానీ అతను కూడా పోలీసు ఉద్యోగం కఠిన వాస్తవాలను ఎదుర్కొంటాడు. రాత్రి కథ ముందుకు సాగుతున్నప్పుడు, ఒక ప్రమాదకరమైన సంఘటన (ఒక హత్య కేసుతో సంబంధం ఉన్న చిన్నపిల్లల మిస్సింగ్) వీళ్లిద్దరి జీవితాలను, కెరీర్‌లను ప్రమాదంలో పడేస్తుంది. ఈ కేసు వారి మధ్య ఆత్మ విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. యోహనన్ తన గతం గురించి ఒక ఎమోషనల్ మోనోలాగ్ ఇస్తాడు. ఇది అతని పాత్రను మరింత హ్యూమనైజ్ చేస్తుంది. దిననాథ్ కూడా తన ఆదర్శాలను పాటిస్తూ చిక్కుల్లోపడతాడు. క్లైమాక్స్‌లో ఈ ఇద్దరూ ఒక ట్రాజిక్ సంఘటనలో చిక్కుకుంటారు. ఇది ప్రేక్షకులను షాక్‌లో ముంచెత్తుతుంది. దిననాథ్, యోహనన్ ఎదుర్కునే సంఘటనలు ఏమిటి ? వాటి వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : వింత శక్తులిచ్చే తాళాలు… డెవిల్ తో గేమ్స్… ఫ్యామిలీతో చూడాల్సిన హర్రర్ ఫాంటసీ థ్రిల్లర్