Nidhhi Agerwal : తెలుగు ప్రేక్షకులు ఎవరినైనా ప్రేమించడం మొదలుపెడితే ఏ స్థాయిలో ప్రేమిస్తారో ఇదివరకే చాలాసార్లు రుజువైంది. అందుకే చాలామంది తెలుగు స్టార్ హీరోలు కూడా ఇక్కడ సినిమాలను రిలీజ్ చేస్తూ ఉంటారు. కార్తీ లాంటి హీరోలు కూడా తెలుగు ప్రేక్షకులే నాకు చాలా ఇష్టం అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. చాలా తమిళ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు.
ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలామంది హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చారు. అయితే చాలామంది హీరోయిన్లకి కూడా అభిమానులు ఉన్నారు. సవ్యసాచి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేదు. ఆ తర్వాత చేసిన మిస్టర్ మజ్ను సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది.
నిధి అగర్వాల్ పై అలాంటి స్లొగన్స్
రీసెంట్ టైమ్స్ లో తెలుగు ఆడియన్స్ అందరూ స్లొగన్స్ చెప్పడం మొదలు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అయితే, అక్కడికి వెళ్లిన ఫ్యాన్స్ బాబుల్ కే బాబు కళ్యాణ్ బాబు అని అరుస్తూ ఉంటారు. అలానే మహేష్ బాబు సినిమా రిలీజ్ అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ బాబులకే బాబు మహేష్ బాబు అని అరుస్తూ ఉంటారు . ఇప్పుడు కొత్తగా హీరోయిన్ నిధి అగర్వాల్ కోసం మరో స్లోగన్ రెడీ చేశారు. పాపల కే పాప నిధి పాపా అని అరవడం మొదలుపెట్టారు. హైదరాబాదులో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ఇలానే అరిచారు. ఆ వెంటనే నిధి ట్విస్టర్లో పోస్ట్ పెడుతూ మీ పాప అని ఫినిషింగ్ ఇచ్చింది. ప్రస్తుతం హరిహర వీరమల్లు ఈవెంట్ వైజాగ్ లో జరుగుతుంది. ఇక్కడ మళ్లీ పాపలకే పాప అని అరవడం మొదలుపెట్టారు కొంతమంది ఫ్యాన్స్. దీనితో ఒక్కసారిగా నిధి అగర్వాల్ సిగ్గు పడిపోయింది.
సినిమా ప్రమోషన్స్ లో జోరు
చాలామంది సినిమా చేసిన తర్వాత వాళ్ళ పని అయిపోయింది అని అనుకుంటారు. కానీ ఆ సినిమా జనాల్లోకి వెళ్లడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కొంతమంది డబ్బింగ్ చెప్పడానికి కూడా సరిగ్గా సపోర్ట్ చేయరు. కానీ నిధి అగర్వాల్ మాత్రం హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో కీలక పాత్ర వహించింది. కేవలం ఒక్క రోజులోనే దాదాపు 15 ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈమె కష్టం చూసి ఏకంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఇలా సినిమా కోసం కష్టపడటాన్ని, అలానే పవన్ కళ్యాణ్ ఈమె గురించి చేసిన కీలక వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని నిధిని కూడా చాలామంది అభిమానులు ప్రైస్ చేయడం మొదలుపెట్టారు. కాసేపట్లో హరిహర వీరమల్లు ప్రీమియర్ స్టార్ట్ కానున్నాయి.
Also Read: Hari Hara Veeramallu : వాళ్లతో పోలిస్తే, తెలుగు ఆడియన్స్ మైండ్ సెట్ మారాల్సిన పరిస్థితి వచ్చిందా.?