E-Paper
Advertisement

Pawan Kalyan: రామ్ చరణ్, ఎన్టీఆర్ నాటు నాటు పాటపై పవన్ కామెంట్స్.. ఏమన్నారంటే?

Pawan Kalyan: రామ్ చరణ్, ఎన్టీఆర్ నాటు నాటు పాటపై పవన్ కామెంట్స్.. ఏమన్నారంటే?
Advertisement

Pawan Kalyan: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా ప్రమోషన్లను వేగవంతం చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక వైజాగ్ లో ఎంతో ఘనంగా జరుగుతోంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చారు. తన సినీ జర్నీ గురించి అలాగే రాజకీయాల గురించి అలాగే హరిహర వీరమల్లు చిత్ర బృందం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక ఈ సినిమా వేడుక వైజాగ్ లో జరుగుతున్న నేపథ్యంలో తన గురువు అయిన సత్యానంద్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఆయనకు సాలువ కప్పి పవన్ కళ్యాణ్ సత్కరించి, తన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ఆస్కార్ అవార్డు గ్రహీత…

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (M.M.Keeravani) గారి గురించి కూడా మాట్లాడారు. ఈ సినిమాకు కీరవాణి సంగీత దర్శకుడిగా పని చేస్తున్న సంగతి తెలిసిందే. కీరవాణి అందించిన అద్భుతమైన సంగీతం బ్యాక్ గ్రౌండ్ సోర్స్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు కూడా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఇలా కీరవాణి గారి సంగీతం గురించి, ఆయన గొప్పదనం గురించి మాట్లాడుతూ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ఆర్ సినిమా(RRR Movie)గురించి ఇందులో నాటు నాటు పాట(Naatu Naatu Song) గురించి కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

రామ్ చరణ్ ఎన్టీఆర్ డాన్స్ అద్భుతం…

Advertisement

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కీరవాణి గారు ఎన్నో అద్భుతమైన పాటలను అందించారు. ఆయన నాటు నాటు అంటూ ఒక పాటకు మ్యూజిక్ కొడితే ఏకంగా ఆస్కార్ అవార్డు (Oscar Award)వచ్చిందని తెలిపారు. ఇలాంటి ఒక పాటకు ఆస్కార్ వస్తుందని ఒక జ్యోతిష్యుడు చెబితే నమ్ముతామా? కానీ దాని శక్తి ఎలాంటిదంటే రాజమౌళి గారి వంటి ఒక గొప్ప దర్శకుడు లేదా ఈ పాటకు అద్భుతమైన డాన్స్ వేసిన ఒక రామ్ చరణ్(Ram Charan) ,ఎన్టీఆర్(NTR) లాంటివారు ఇంతమంది కలయిక తోటి, వారందరూ అద్భుతంగా వేయగలిగారు అంటే దాని వెనుక సంగీత దర్శకుడు పాత్ర ఎంతో ఉందని తెలియజేశారు. కీరవాణి గారు ప్రేక్షకులను ఆకట్టుకొనే సంగీతం అందించడమే కాకుండా చంద్రబోస్ లాంటి గారి గొప్ప రచయిత ఈ సినిమాకు అద్భుతమైన లిరిక్స్ అందించకపోతే అది సాధ్యమయ్యేది కాదని తెలిపారు. ఇలాంటి గొప్ప సినీ రచయిత, సంగీత దర్శకుడు ఉండడం నిజంగా మన సినీ ఇండస్ట్రీకి గర్వకారణం అని తెలిపారు.

మొదటి ఆస్కార్ అవార్డు..

పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా కీరవాణి గురించి మాట్లాడేటమే కాకుండా ఎన్టీఆర్ రామ్ చరణ్ నాటు నాటు పాట గురించి మాట్లాడటంతో అభిమానులు ఒకసారిగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలోని ఈ పాటకు ఆస్కార్ అవార్డు రావడం విశేషం. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇది మొట్టమొదటి ఆస్కార్ కావడం గమనార్హం. ఇక పవన్ కళ్యాణ్ సినిమా విషయానికి వస్తే గత కొంతకాలంగా రాజకీయ కార్యకలాపాలలో బిజీగా ఉన్న పవన్ మొదటిసారి డిప్యూటీ సీఎం అయిన తర్వాత హరిహర వీరమల్లు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో అభిమానుల కోలాహలం మొదలైందని చెప్పాలి.

Also Read: Pawan Kalyan: అడుక్కోవడం సిగ్గుగా ఉంది.. నాకు ఇవ్వడమే తెలుసు!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×