Shardul Thakur: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొదటి టెస్ట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్టులో రెండు జట్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నాయి. ఇంగ్లాండ్ అలాగే టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో.. అద్భుతంగా రాణించి మొత్తం 900 పరుగుల వరకు రాబట్టాయి. ఇక ఇప్పుడు టీమిండియా రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండో ఇన్నింగ్స్ లో కూడా టీమిండియా చాలా సమర్థవంతంగా దూసుకు వెళ్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ పై కొత్త చర్చ మొదలైంది. అతనికి తక్కువ ఓవర్లు ఇవ్వడంపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది.
Also Read: Shakshi Dhoni: ధోని కాపురంలో వాటర్ బాటిల్ చిచ్చు…సాక్షికి ఇంత పొగరా అంటూ ట్రోలింగ్ ?
100 ఓవర్లు వేస్తే ఆరు ఓవర్లు ఇస్తారా ?
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆల్ రౌండర్ షార్దుల్ ఠాకూర్ పైన గిల్ కుట్రలు చేస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతనికి సరిగ్గా బౌలింగ్ ఇవ్వడం లేదని కొంతమంది అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో… టీమిండియా బౌలర్లు దాదాపు 100కు పైగా ఓవర్లు వేశారు. ఈ నేపథ్యంలోనే మొదటి ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లాండ్ జట్టు 465 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇందులో బుమ్రా ఐదు వికెట్లు తీయగా సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అటు ప్రసిద్ కృష్ణ 20 ఓవర్లు వేసి మూడు వికెట్లు పడగొట్టగలిగాడు. అందరికన్నా ఎక్కువ పరుగులు ఇచ్చేశాడు. అటు రవీంద్ర జడేజా… 23 ఓవర్లు వేసి 68 పరుగులు ఇచ్చాడు. కానీ ఒక్క వికెట్ చేయలేదు రవీంద్ర జడేజా. ఇలా బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసీద్ కృష్ణ, రవీంద్ర జడేజా అందరు కలిపి 100 ఓవర్లకు పైగా వేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రత్యేక విషయం ఏంటంటే శార్దూల్ ఠాకూర్.. ఒకడు ఆరు ఓర్లు మాత్రమే వేశాడు. ఇందులో 38 పరుగులు ఇచ్చి… వికెట్లు ఏమీ తీయలేదు. రెండో రోజు బుమ్రా తప్ప… మిగిలిన టీమ్ ఇండియా బౌలర్లు ఒక్క వికెట్ తీయలేదు. అయితే మూడవ రోజు మాత్రం అందరూ వికెట్లు తీయగలిగారు. అయినప్పటికీ శార్దూల్ ఠాకూర్ కు బౌలింగ్ ఇవ్వలేదు. అతనికి బౌలింగ్ ఇస్తే పరిస్థితి వేరే లాగా ఉండేది. ఒకవేళ వికెట్లు తీస్తే టీమిండియా మంచి ఊపులో కనిపించేది. లేదు ఎక్కువ పరుగులు ఇస్తే.. తర్వాతి మ్యాచ్లో అతని పక్కకు పెట్టే అవకాశం లభించేది. కానీ గిల్ మాత్రం అలా ఆలోచించలేదు. మొత్తానికే శార్దూల్ ఠాకూర్ కు ఆరు ఓవర్లు ఇచ్చి… చేతులు దులుపుకున్నాడు. దీంతో గిల్ పై సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: David Lawrence: టీమిండియాతో టెస్ట్ సిరీస్… ఇంగ్లాండ్ క్రికెటర్ మృతి.. బ్లాక్ బ్యాడ్జీలతో !
నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో శార్దూల్ ఠాకూర్
వాస్తవానికి టీమిండియా తుదిదట్టులో నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో శార్దూల్ ఠాకూర్ ను గిల్ తీసుకున్నాడు. అయితే ఆరు ఓవర్లు మాత్రమే శార్దూల్ ఠాకూర్ కు ఇవ్వడం పై.. క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఓవర్స్ ఇవ్వడానికి నితీష్ కుమార్ రెడ్డిని ఎందుకు పక్కకు పెట్టారు. శార్దుల్ ఠాకూర్ ను ఆడించకుండా నితీష్ కుమార్ రెడ్డిని.. ఆడిస్తే సరిపోయేది అంటూ కౌంటర్ ఇస్తున్నారు. అతడు బ్యాటింగ్ చేసైనా ఎక్కువ పరుగులు చేసేవాడు అని కామెంట్స్ చేస్తున్నారు.