E-Paper
Advertisement

ప్రేమ జంటకు విలన్‌గా మారిన ఎమ్మెల్యే.. అప్పులు చేసి కొన్న ఇంటి కోసం ప్రాణాలతో చెలగాటం.. ఓటీటీలోకి రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్

ప్రేమ జంటకు విలన్‌గా మారిన ఎమ్మెల్యే.. అప్పులు చేసి కొన్న ఇంటి కోసం ప్రాణాలతో చెలగాటం.. ఓటీటీలోకి రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్
Advertisement

Anbil Avan OTT: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట.. తమకంటూ ఓ అందమైన ప్రపంచాన్ని నిర్మించుకోవాలని కలలు కంటుంది. అందుకోసం మంచి ఉద్యోగాలను వదిలేసి, అప్పులు చేసి మరీ సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తారు. అంతా సాఫీగా సాగిపోతుందనుకునే సమయంలో ఓ రాజకీయ నాయకుడు వారి జీవితాల్లోకి ప్రవేశిస్తాడు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ ఇల్లు కాస్తా యుద్ధభూమిగా మారుతుంది. ఇలాంటి ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన తమిళ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘అన్బిల్ అవన్’ (Anbil Avan). అశోక్ సెల్వన్, ప్రీతి ముఖుందన్ జంటగా నటించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా కథేంటి? ఏ ఓటీటీలో చూడవచ్చు? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

సూర్య (అశోక్ సెల్వన్), ఇయల్ (ప్రీతి ముఖుందన్) ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట. ఇయల్ తన ధనిక కుటుంబాన్ని వదిలి సూర్యతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. హోటల్ మేనేజ్‌మెంట్ చదువుకున్న వీరిద్దరూ ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే ఇతరుల దగ్గర పనిచేస్తూ తమ కలలను పక్కన పెట్టడం వారికి నచ్చదు. అందుకే ఓ హిల్ స్టేషన్‌లో సొంతంగా హోమ్‌స్టే ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు.

Advertisement

ఈ కలను నిజం చేసుకోవడానికి అప్పులు చేసి మరీ ఓ అందమైన పురాతన బంగ్లాను కొనుగోలు చేస్తారు. ఆ బంగ్లాను అమ్మడానికి మొదట ఇష్టపడని మాజీ రాణి (రేవతి), ఇయల్ కల గురించి తెలుసుకున్న తర్వాత సూర్యకు దాన్ని విక్రయించేందుకు అంగీకరిస్తుంది. దీంతో తమ కొత్త జీవితానికి పునాది పడిందని ఆ జంట ఎంతో సంతోషిస్తుంది. కానీ వారి ఆనందం ఎక్కువ రోజులు నిలవదు. స్థానిక ఎమ్మెల్యే (కదిర్ బాలు) రూపంలో కొత్త సమస్య ఎదురవుతుంది. అతడి వేధింపులతో వీరి ప్రశాంతమైన జీవితం ఒక్కసారిగా తలకిందులవుతుంది.

తమ కలల ఇంటిని వదులుకోలేక, ఎదురైన ప్రమాదం నుంచి బయటపడేందుకు సూర్య పోరాటం మొదలుపెడతాడు. ఈ క్రమంలో ప్రేమకథ కాస్తా యాక్షన్, సర్వైవల్ థ్రిల్లర్‌గా మారుతుంది. అసలు ఆ ఎమ్మెల్యేకు ఈ జంటపై ఎందుకంత కక్ష? తమ ఇంటిని, ప్రేమను కాపాడుకోవడానికి సూర్య ఎలాంటి పోరాటం చేశాడు? చివరికి ఈ జంట తమ కలను నెరవేర్చుకుందా? అనేదే మిగతా కథ.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే ?

Advertisement

ఈ సినిమాలో సూర్యగా అశోక్ సెల్వన్, ఇయల్‌గా ప్రీతి ముఖుందన్ నటించారు. వీరితో పాటు రేవతి, సాబుమోన్ అబ్దుసమద్, కదిర్ బాలు, మహా ఢిల్లీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్. కార్తికేయన్ దర్శకత్వం వహించగా, ‘పోర్ తొళిల్’ ఫేమ్ విఘ్నేష్ రాజా కథను అందించారు. గోవింద్ వసంత సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 2026 అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు నవంబర్ 20 నుంచి SonyLIVలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ప్రేమ, యాక్షన్, ఉత్కంఠ రేపే కథలను ఇష్టపడేవారికి ఈ సినిమా మంచి ఎంపిక కావచ్చు.రానుంది.

Read Also: దేశాన్ని కుదిపేసిన దారుణ హత్య… నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్… ఊహించని మలుపులు తిరిగిన సంచలన కేసు

Tags

Related News

బోర్ కొడుతోందా? అయితే ఈ ‘వైబ్’ ట్రై చేయండి… యూత్‌ని కట్టిపడేస్తున్న స్పై కామెడీ థ్రిల్లర్

ఓరి దేవుడో… ఆపదొస్తే ఆ దేవుడేం చేశాడో తెలుసా ? గుండెల్ని పిండేసే ఈ క్రిస్మస్ మాస్టర్‌పీస్‌ని ఇప్పుడే చూసేయండి

టార్చర్ పెట్టిన బాస్‌నే పెళ్లి చేసుకునే అసిస్టెంట్‌.. ఓటీటీలోకి నవ్వులు పూయించే రొమాంటిక్ కామెడీ

8,000 ఏళ్లుగా చావు లేకుండా బతుకుతున్న వ్యక్తి… రైలు ప్రయాణంలో బయటపడ్డ వింత ప్రేమకథ.. ఈ సినిమా ఓటీటీ ఎక్కడంటే?

సినిమా చరిత్రపై కడుపుబ్బా నవ్వించే సెటైర్లు… ఓటీటీలోకి నవ్వుల పటాకా… మూవీ లవర్స్ డోంట్ మిస్

పెళ్లైన మొదటి రాత్రే షాకింగ్ ట్విస్ట్… కుడివైపు ఉండాల్సిన గుండె ఎడమవైపుకు మారితే? ఓటీటీలోకి క్రేజీ మెడికల్ థ్రిల్లర్

ఆ వీధి చివరికి వెళ్తే గూస్‌బంప్స్… వణికిస్తున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ ను చూశారా?

Big Stories

Advertisement
×