Kangana Ranaut:బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) పై ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లో కేసు నమోదయింది. ముఖ్యంగా ఆమె సోషల్ మీడియా వేదికగా సోనియా గాంధీ (Sonia Gandhi) పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, విద్వేషాలను రెచ్చగొట్టేలా పెట్టిన పోస్టులే ఇందుకు కారణం అని ఆరోపిస్తూ షిమ్లాకు చెందిన అతుల్ శర్మ (Athul Sharma) అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
అసలు విషయంలోకి వెళ్తే.. సోనియా గాంధీ.. ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ ‘ పేరుతో ఒక పుస్తకాన్ని ఆవిష్కరించింది. 554 పేజీలు ఉన్న ఈ పుస్తకంలో యుద్ధనాంతరం ఇటలీలో ఆమె బాల్యం, 1965 లో ఇంగ్లాండ్ లోని కేం బ్రిడ్జ్ లో రాజీవ్ గాంధీతో ఏర్పడిన పరిచయం , ప్రేమాయణం ,ఇండియాకు వలస రావడం , ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ లతో ఆమె గడిపిన జీవితాన్ని వివరించారు. దీనితో పాటు కొన్ని రాజకీయ ప్రస్తావనలు కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఇక పుస్తక ఆవిష్కరణ తర్వాత కంగనా రనౌత్ నవంబర్ 10వ తేదీన సోషల్ మీడియాలో సోనియా పై రాజీవ్,సంజయ్ గాంధీల మరణాలపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో.. ఈ పోస్ట్ కాస్త ఇప్పుడు ఆగ్రహానికి గురిచేసింది అందులో భాగంగానే ఆమె విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ అతుల్ శర్మ అనే వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆమె పోస్టులో మతసామరస్యాన్ని దెబ్బతీయగలవని, ప్రజాశాంతికి భంగం కలిగించగలరని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. ముఖ్యంగా సోనియాగాంధీని ఆమె విదేశీ శక్తిగా చిత్రీకరించారని ప్రయత్నం చేస్తున్నారని, ఇందిరాగాంధీ మరణం పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు కంగనా రనౌత్ పై కేసు ఫైల్ చేశారు. ఇక అందులో భాగంగానే భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్ 196 (1) బీ, 353 (2), 356 (2) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈ విషయాన్ని షిమ్లా ఎస్పీ గౌరవ్ సింగ్ అధికారికంగా వెల్లడించారు.
also read:పోలీస్ గా సాయి పల్లవి..స్పెషల్ పాత్రలో రేణు దేశాయ్.. ‘ఓం’తెలుగు ట్రైలర్ చూశారా?
కంగనా రనౌత్ ఇటీవల సోనియా గాంధీ రాసిన పుస్తకాన్ని లక్ష్యంగా చేసుకొని ఎక్స్ అలాగే ఇంస్టాగ్రామ్ లో వరుస విమర్శనాత్మక వ్యాఖ్యలతో పోస్ట్ చేశారు. ముఖ్యంగా సోనియాగాంధీ ఆత్మ కథను ఒక ‘సెల్ఫ్ గోల్’ గా ప్రస్తావిస్తూ సోనియాగాంధీ విదేశీ సంబంధాలు, కుతంత్రాలను బట్ట బయలు చేసే పుస్తకంగా అభివర్ణిస్తూ.. అటు రాహుల్ గాంధీ పై కూడా ఈమె విమర్శలు గుప్పించారు. అంతటితో ఆగకుండా ఇందిరాగాంధీ, సంజయ్, రాజీవ్ గాంధీ మరణాల చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా ఆమె ప్రస్తావించారు. అంతేకాదు మేనకా గాంధీని పక్కన పెట్టారని సోనియా గాంధీ పై ఆరోపణలు గుప్పించాడు. ఈ నేపథ్యంలోనే షిమ్లా స్థానిక నివాసి అయిన అతుల్ శర్మ ప్రజా విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు.