E-Paper
Advertisement

వృషకర్మ 100 కోట్ల కలెక్షన్స్ పక్కా… అంత కాన్ఫిడెన్స్ ఏంటీ బ్రో..

వృషకర్మ 100 కోట్ల కలెక్షన్స్ పక్కా… అంత కాన్ఫిడెన్స్ ఏంటీ బ్రో..
Advertisement

Naga Chaitanya: నాగచైతన్య త్వరలోనే వృషకర్మ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా విడుదలకు సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు.

అంచనాలు పెంచిన ట్రైలర్..

ఇక వృషకర్మ సినిమా(vrushakarma) మైథాలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు నాగచైతన్య(Naga Chaitanya) ఇలాంటి జానెర్ లో సినిమాలు చేయలేదు. మొదటిసారీ ఇలాంటి సినిమా చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదల చేసిన టీజర్, ట్రైలర్ వీడియోలు కూడా సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి. ఈ ట్రైలర్ వీడియో చూస్తుంటే ఈసారి నాగచైతన్య బ్లాక్ బాస్టర్ కొట్టబోతున్నాడు అంటూ అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తండేల్ సినిమాతో 100 కోట్లు..

Advertisement

ఇదిలా ఉండగా తాజాగా వృషకర్మ చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా కలెక్షన్ల గురించి నాగచైతన్య మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మీడియా వారు నాగచైతన్యను ప్రశ్నిస్తూ మీరు నటించిన తండేల్ సినిమా(Thandel Movie) 100 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. మరియు వృషకర్మ కూడా 100 కోట్ల క్లబ్లో చేరుతుందా అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానం చెబుతూ ఈ మాట నేను అనకూడదు కానీ ఖచ్చితంగా మా సినిమా 100 కోట్ల కలెక్షన్లను రాబడుతుందని, తండేల్ సినిమా రికార్డులను బద్దలు కొడుతుందని తెలిపారు.

నాగచైతన్య సాయి పల్లవి జంటగా..

ఇలా ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్లను రాబడుతుంది అంటూ నాగ చైతన్య చెప్పడంతో ఈ సినిమాపై నాగచైతన్యకు ఏ రేంజ్ లో కాన్ఫిడెన్స్ ఉందో స్పష్టం అవుతుంది. ఇక చందు మొండేటి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తండేల్ సినిమాలో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించారు. నిజ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత వృషకర్మ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై అదే రేంజిలో అంచనాలు ఉన్నాయి. మరి నిజంగానే వృషకర్మతో చైతు 100 కోట్ల క్లబ్లో చేరుతారా.. లేదా అనేది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.ఇక ఈ సినిమాలో నాగచైతన్య ఒక యోధుడి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య జోడిగా మీనాక్షి చౌదరి దక్ష అనే పాత్రలో కనిపించబోతున్నారు ఇందులో ఈమె పురావస్తు శాఖ శాస్త్రవేత్తగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. విరూపాక్షతో సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ కార్తీక్ ఈ సినిమా తర్వాత వృషకర్మ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి రెండో సినిమా ఈయనకు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: కింగ్ 100లో నాగచైతన్య క్యామియో…హైప్ పెంచేసిన చైతూ!

Related News

కింగ్ 100లో నాగచైతన్య క్యామియో…హైప్ పెంచేసిన చైతూ!

మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి స్టార్ కమెడియన్.. వేణు మాధవ్ తొలి మూవీ సంపాదన?

సంకీర్తనలతో భక్తులను అలరిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

హీరోయిన్లకు షాకిచ్చేలా నిధి అగర్వాల్ హెయిర్ కేర్.. ఇంట్లోనే ఈజీగా!

త్రివిక్రమ్ డైరెక్షన్ లో చిరు .. గాడ్ ఆఫ్ వార్ లేనట్టేనా?

అలీ రెండో పెళ్లి చేసుకున్నారా? ఇన్నాళ్లకు చేదు నిజం బయట పెట్టిన జుబేదా?

కూతురు జ్ఞాపకాలతోనే జీవితం.. ఇప్పటికీ చెప్పులు వేసుకోని విజయ్ ఆంటోనీ!

Big Stories

Advertisement
×