E-Paper
Advertisement

రాము రాథోడ్, లిఖిత కాంబోలో టాప్ 5 సూపర్ హిట్ ఫోక్ సాంగ్స్!

రాము రాథోడ్, లిఖిత కాంబోలో టాప్ 5 సూపర్ హిట్ ఫోక్ సాంగ్స్!
Advertisement

Likhitha Top Folk Songs:లిఖిత ..పేరు చెబితే టక్కున గుర్తు పట్టలేకపోవచ్చు కానీ రాను బొంబాయికి రాను ఫేమ్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు.ఆ పాట సోషల్ మీడియాని అలా షేక్ చేసింది మరి.

రాను బొంబాయికి రాను

Advertisement

ఇక ఈ మధ్యే 964 మిలియన్ల వ్యూస్ తో బుట్ట బొమ్మ సాంగ్ ని క్రాస్ చేసి తెలుగులో అత్యధిక వ్యూయర్ షిప్ కొల్లగొట్టిన వీడియో గా రాను బొంబాయికి రాను  రికార్డ్ కొల్లగొట్టింది కూడా.ముఖ్యంగా .. ఈ పాటలో రాము రాథోడ్ తో కలిసి ఈ భామ వేసిన ఎక్స్ప్రెషన్స్ మరియు వేసిన స్టెప్పులు అభిమానులని మెస్మరైజ్ చేశాయి.మరీ ముఖ్యంగా .. కళ్యాణ్ కీస్ అందించిన మాస్ బీట్స్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోయాయి.మరి తనదైన పాటలతో వైష్ణవి సోనీ ,మాధురి రాథోడ్ లకి పోటీ ఇస్తున్న లిఖిత కెరీర్ లోని టాప్ సాంగ్స్ ఏంటో చూద్దాం .

Advertisement

also read:ఒక్క రోజులోనే వన్ మిలియన్ వ్యూస్.. మాధురి రాథోడ్ దెబ్బకు సోషల్ మీడియా షేక్ !

‘రింగు రింగుల జుట్టు దానా’

రాము రాథోడ్ తో చేసిన రాను బొంబాయికి రాను సూపర్ హిట్ అవ్వడంతో ఎక్కువగా వీరి కాంబినేషన్ లోనే సాలిడ్ హిట్స్ రావడం విశేషం.వాటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పాట ‘రింగు రింగుల జుట్టు దానా’.సింగర్ ప్రభ తో కలిసి రాము రాథోడ్ పాడిన ఈ పాటని రాము రాథోడే రాయడం విశేషం.ఇక కళ్యాణ్ కీస్ మ్యూజిక్ లో శేఖర్ వైరస్ స్టెప్పులు సమకూర్చిన ఈ పాట ఇప్పటికి 115 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుని మరింతగా దూసుకుపోవడం విశేషం.

‘నా సెయ్యి పట్టుకోవా’

ఇక లిఖిత కి బాగా గుర్తింపు తెచ్చిన మరో పాట ‘నా సెయ్యి పట్టుకోవా’ .రామురాథోడ్ తో కలిసి స్టెప్పులేయగా భరత్ మజోజు రాసిన ఈ పాటని శ్రీనిధి రాము రాథోడ్ కలిసి పాడటం ఒక విశేషం అయితే,ఈ పాటకి కూడా నవీన్ మ్యూజిక్ డైరెక్షన్ లో శేఖర్ వైరసే కొరియోగ్రఫీ చేయడం ఇక్కడ ,మరో విశేషం.ఇక ఇప్పటికి 5మిలియన్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ పాట వచ్చే రోజుల్లో మరింత వ్యూయర్ షిప్ ని కొల్లగొట్టేలా కనిపిస్తుంది.

‘అరే ఏమైంది పిల్లా’
ఇక ఇదే క్రమంలో లిఖిత కి బాగా గుర్తింపు తెచ్చిన పాట ‘అరే ఏమైంది పిల్లా’ .రాము రాథోడ్ తోనే చేసిన ఈ పాట కూడా ఏడాదిలోనే ఆరు మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకోవడం చూస్తే ఈ జోడీ ఆడియన్స్ ని ఎంతలా అలరించారో అర్థం అవుతుంది.ముఖ్యంగా వీరిద్దరూ కలిసి నటించిన ప్రతీ పాట మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకోవడం వెనక వీరిద్దరి కెమిస్ట్రీ స్క్రీన్ పై అద్భుతంగా పండటమే అని చెప్పాలి .కళ్యాణ్ కీస్ మ్యూజిక్ తగ్గట్టుగా లిఖిత తో కలిసి రామురాథోడ్ స్టెప్పులు వేయడమే కాకుండా అద్భుతంగా పాడటం విశేషం.

https://youtu.be/ZxC1LN3vwpI?si=-Ef8-lsiHSpF-Rlm

‘పోదాం పోయే మంచిరాల అంగడి’

ఇక లిఖితకి మంచి గుర్తింపు తెచ్చిన మరో పాట ..’పోదాం పోయే మంచిరాల అంగడి’.రామురాథోడ్ తో కలిసి లిఖిత క్రేజీ స్టెప్పులేయగా,ఎప్పటిలాగే ఆ స్టెప్పులని అద్భుతంగా కంపోజ్ చేశాడు శేఖర్ మాస్టర్.ఇక మోహన్ మిక్కీ మ్యూజిక్ లో బొడ్డు దిలీప్ ,ప్రభ కలిసి తమ గొంతులతో పాటని మరో లెవెల్ కి తీసికెళ్ళారు.

వచ్చిన ఏడాదిలోనే ఈ పాట ఏకంగా 29మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకుందంటే లిఖిత ,రాము ల జోడి ఆడియన్స్ ఎలా ఆకట్టుకుంటుందో అర్థమవుతుంది.

చూడాలి మరి వరుస క్రేజీ ఫోక్ సాంగ్స్ తో దూసుకుపోతున్న లిఖిత వచ్చే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో !

Tags

Related News

నీది చీప్ క్యారెక్టర్.. క్షమాపణ చెప్పాల్సిందే..వర్షిణి, త్రిగుణ్ పై నాగ్ సీరియస్!

నలుగురు దర్శకులు రిజెక్ట్.. నెట్టింట ట్రెండింగ్ లో నిలిచిన ‘కొయిల’ సాంగ్..

చెయ్యి చేసుకోబోయిన రోహిత్.. షో నుంచి వెళ్లిపోయిన మిథిలేష్!

బిగ్ బాస్ రెమ్యూనరేషన్ బయట పెట్టిన ఝాన్సీ… ఇప్పటి వరకు ఎంత వచ్చిందంటే?

ఒక్క రోజులోనే వన్ మిలియన్ వ్యూస్.. మాధురి రాథోడ్ దెబ్బకు సోషల్ మీడియా షేక్ !

చిన్మయితో రాహుల్ మూవీ.. టైటిల్ చెప్పేసిన అడివి శేష్!

సుధీర్ మోసగాడు.. ఇలాంటి క్యారెక్టర్ లేనివాడిని ఎక్కడా చూడలేదు: గోట్ ప్రొడ్యూసర్

Big Stories

Advertisement
×