E-Paper
Advertisement

బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. మరో అప్డేట్ రెడీ..!

బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. మరో అప్డేట్ రెడీ..!
Advertisement

Dada Movie : టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి హీరో బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఈయన నటించిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం మరో యాక్షన్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో బాలయ్య దాదా అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ వీడియోని ఇటీవలే రిలీజ్ చెయ్యగా దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది.. ఈ మూవీ నుంచి నెక్స్ట్ అప్డేట్ ఏమొస్తుందని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.. తాజాగా ఈ చిత్రం నుంచి ఫ్యాన్స్ కు పునకాలు తెప్పించే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఆ వార్త ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

‘దాదా’ అప్డేట్ లోడింగ్..

నందమూరి హీరో బాలయ్య నటిస్తున్న సినిమాలు మొదలవడమే ఆలస్యం మొదలైన తర్వాత అస్సలు ఆగకుండా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాయి. ఈ సినిమా కూడా షూటింగ్ త్వర త్వరగా పూర్తి చేసుకుంటూ వచ్చింది. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా ఈ సినిమా నుంచి వరసగా అప్డేట్స్ విడుదల చేసినందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. తాజాగా చిత్ర బృందం మొదటి పాట రిలీజ్ డేట్ ను ప్రకటించింది. థమన్ సంగీతం అందించిన ‘దాదా ధమాకా’ అనే మొదటి పాటను 2026 నవంబర్ 13 న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సాంగ్ తర్వాత నుంచి వరుసగా సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టనున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ మూవీ నుంచి అప్డేట్స్ వచ్చేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఈ మూవీ రిలీజ్ అయ్యాక టాక్ ఎలా ఉంటుందో చూడాలి..

బాలయ్యతో జోడిగా నర్గీస్ ఫక్రీ..

Advertisement

బాలయ్య సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేస్తున్న ముద్దుగుమ్మలకు మంచి డిమాండ్ ఉంటుందని అందరికి తెలిసిందే.. ఇప్పుడు రాబోతున్న బాలయ్య దాదా మూవీలో నర్గీస్ ఫక్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇకపోతే బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోలో ఇప్పటికే వీరసింహారెడ్డి మూవీ వచ్చింది. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీశ్‌ కిలారు నిర్మిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా కోసం బాలయ్య సరికొత్త మేకోవర్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 24 న థియేటర్లలోకి రాబోతుంది. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఈ సినిమా తర్వాత బాలయ్య కొరటాల శివ కాంబోలో మరో సినిమా రాబోతుంది. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ గురించి అప్డేట్ రాబోతుంది.

Also Read :‘ పొదరిల్లు ‘ మనీషా నెలకు ఎంత సంపాదిస్తుంది..?

Related News

ఆరోజుల్లో సోషల్ మీడియా లేకపోవడం మా అదృష్టం..నాగార్జున కామెంట్స్ వైరల్!

వందల కోట్లకు వారసురాలు.. సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ ఇదే!

మరో చిన్నారికి ప్రాణం పోసిన సోనూసూద్.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో!

సైలెంట్ గా పెళ్లిపీటలెక్కిన టాలీవుడ్ హీరోయిన్ ..!

విమర్శకులకు నిర్మాత స్ట్రాంగ్ కౌంటర్.. నిరూపిస్తే రూ.కోటి ఇస్తానంటూ!

మెగాఫోన్ పట్టనున్న రణబీర్ కపూర్!

‘రామాయణ’ 3 డేస్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..?

Big Stories

Advertisement
×