E-Paper
Advertisement

బాక్సాఫీస్ దగ్గర రామాయణ వర్సెస్ సూర్య.. ఎవరి హవా వారిదే!

బాక్సాఫీస్ దగ్గర రామాయణ వర్సెస్ సూర్య.. ఎవరి హవా వారిదే!
Advertisement

Box Office:భారీ బడ్జెట్ సినిమాలు, ఆకాశాన్ని తాకే అంచనాలతో సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే మిగతా సినిమాలు కాస్త అలెర్ట్ గా ఉంటాయి. ఆ సినిమా క్రేజ్ ముందు తమ సినిమా సోదిలో లేకుండా పోతుందా ఏంటి అన్న భయంతో పోటీ పడటానికి కాస్త వెనకా ముందు అవుతుంటారు,నిజానికి అలా బరిలో దిగి చాలా సినిమాలు బోల్తా కొట్టాయి కూడా.

కానీ మంచి కథ, కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటే ఎంత పోటీ ఉన్నా ఎలాంటి సినిమాలను అయినా చూస్తారని ప్రూవ్ చేసింది సూర్య నటించిన ‘సీన్’ సినిమా. ఒకవైపు దాదాపు రూ.2,000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘రామాయణ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంటే.. మరోవైపు సూర్య సినిమా కూడా ఏమాత్రం తగ్గకుండా మంచి వసూళ్లు కొల్లగొడుతుండటం ఇక్కడ విశేషం.

Advertisement

నిజానికి ‘రామాయణ’ సినిమా విడుదలకు ముందు నుంచే అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.మరీ ముఖ్యంగా సీతా రాములుగా సాయి పల్లవి, రణ్ బీర్ కపూర్ నటిస్తుండటంతో వాళ్ళిద్దరిని సిల్వర్ స్క్రీన్ పై ఎలా ఉంటారా అని చూడటానికి ఈగర్ గా వెయిట్ చేశారు మూవీ లవర్స్.ఇక సినిమా కూడా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిలకడగా వసూల్లని రాబడుతుండటం బట్టి చూస్తే సినిమా ఆడియన్స్ ని ఎంతలా అలరిస్తుందో అర్థం అవుతుంది.

పైగా సినిమాలో సాలిడ్ స్టార్ క్యాస్ట్ .. , గ్రాండ్ విజువల్స్, ఎంతో విశిష్టమైన పౌరాణిక కథ కావడంతో ఈ సినిమాపై ఎక్కడ లేని క్యూరియాసిటీ పెరిగిపోయింది.దీంతో ఇప్పటి వరకు ఈ సినిమా కేవలం ఫస్ట్ వీకెండ్ లోనే ఏకంగా 500 కోట్లకి పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తుంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ సినిమాకు మంచి అప్లాజ్ దక్కడం ,పైగా ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా కలెక్షన్లు అదరగొట్టడం ఈ నంబర్ రీచ్ కావడానికి మెయిన్ రీజన్ అని చెప్పక తప్పదు.

Advertisement

మరి ఇలా బాక్సాఫీస్ ని చీల్చి చెండాతుంటే మరో స్టార్ తన సినిమాని థియేటర్ లోకి వదలాలంటే ఎంత ధైర్యం చేయాలి.కానీ నేను ఆ ధైర్యం నాకుంది అంటూ సీన్ సినిమాతో సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు సూర్య. ఈ ఏడాదిలోనే కరుప్పు, విశ్వనాథన్ అండ్ సన్స్ అనే రెండు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ కొట్టిన సూర్య ఇపుడు సీన్ తో ముచ్చటగా సక్సెస్ చూడటంతో మా హీరో ఈ ఏడు మూడు సినిమాలతో హ్యాట్రిక్ కొట్టాడోచ్ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు సూర్య ఫాన్స్.

ఇక ఈ సినిమా రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటటం చూస్తుంటే ముందు ముందు ఈ సీన్ సినిమా బాక్సాఫీస్ కి సాలిడ్ సీన్ నే చూపించేలా కనిపిస్తుంది. ‘రోమాంచం’, ‘ఆవేశం’ లాంటి క్రేజీ ఫిలిమ్స్ తీసిన జీతు మాధవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ మరో సారి డైరెక్టర్ సత్తా ఏంటిదో ప్రూవ్ చేసింది.ఇక ఇందులో
సూర్యతో పాటు నజ్రియా ఫహద్, నస్లెన్ కూడా కీ రోల్స్ చేయడం సినిమాకి మరింత కలిసి వచ్చింది.

మొత్తానికి ఒకవైపు ‘రామాయణ’ భారీ వసూళ్లతో దూసుకుపోతుంటే.. మరోవైపు సూర్య ‘సీన్’ కూడా తన సత్తా చాటుతుండటం బాక్సాఫీక్ కి శుభసూచకం అనే చెప్పాలి. చూడాలి ముందు ముందు ఇదే బాటలో ఇంకెన్ని సినిమాలు నడుస్తాయో !

ALSO READ :పెళ్లి బారాత్‌లో నాగదుర్గ డ్యాన్స్ ఇరగదీసిందిగా..!

Tags

Related News

పెళ్లి బారాత్‌లో నాగదుర్గ డ్యాన్స్ ఇరగదీసిందిగా..!

వెట్రిమారన్ సినిమాల్లో అలాంటి సీన్లు ఓకేనా? జాన్వీపై నెటిజన్ల సెటైర్లు

‘డ్రాగన్ ‘ క్లైమాక్స్ కోసం మాస్టర్ ప్లాన్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..!

బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. మరో అప్డేట్ రెడీ..!

ఆరోజుల్లో సోషల్ మీడియా లేకపోవడం మా అదృష్టం..నాగార్జున కామెంట్స్ వైరల్!

వందల కోట్లకు వారసురాలు.. సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ ఇదే!

మరో చిన్నారికి ప్రాణం పోసిన సోనూసూద్.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో!

Big Stories

Advertisement
×