E-Paper
Advertisement

వెట్రిమారన్ సినిమాల్లో అలాంటి సీన్లు ఓకేనా? జాన్వీపై నెటిజన్ల సెటైర్లు

వెట్రిమారన్ సినిమాల్లో అలాంటి సీన్లు ఓకేనా? జాన్వీపై నెటిజన్ల సెటైర్లు
Advertisement

Janhvi Kapoor:గత కొంతకాలంగా హీరోయిన్లు చేస్తున్న హాట్ హాట్ కామెంట్స్ ఇపుడు నెట్టింట మంటలు పుట్టిస్తున్నాయి.మొన్నటికి మొన్న రాధిక ఆప్టే ఇన్ డైరెక్ట్ గా లెజెండ్ సినిమాపై ,నటుడు బాలకృష్ణ పై కామెంట్స్ చేసిన సంగతి తెల్సిందే.తాజాగా నటి మహేశ్వరి ఓ ఇంటర్వ్యూలో జాన్వీని నీకు ఇష్టమైన తమిళ డైరెక్టర్ ఎవరు? అని అడగ్గా.. వెంటనే వెట్రిమారన్ సార్ అని చెప్పేసింది జాన్వీ. ఇక తమిళ సినిమాలో ఎవరితో కలిసి నటించాలని ఉంది? అని అడిగితే.. ఎవరితోనైనా ఓకే, నాకు ఎలాంటి సమస్య లేదు అంటూ ఆన్సర్ ఇచ్చింది.

పెద్ది సినిమాలో అచ్చియమ్మగా

Advertisement

ఇదిగో ఇదే ఇపుడు నెటిజన్లు విమర్శల బాణాలు ఎక్కుపెట్టడానికి కారణం అయింది.పెద్ది సినిమాలో అచ్చియమ్మగా తన పాత్ర స్కిన్ షో హద్దులు దాటిందని,అందరు అంటున్నట్టుగా తనకు కూడా అపుడు అలాగే అనిపించిందని,కానీ సినిమా కోసం వేల మంది పని చేస్తున్న ఆ సమయంలో తన అభిప్రాయాన్ని చెప్పి షూటింగ్ ని ఆపేసి నిర్మాతని ఇబ్బందులు పెట్టడం సరికాదని తాను మౌనంగా ఉన్నానని,నిజానికి దర్శకుడు అలా చేయాల్సింది కాదని మీడియా ముఖంగా వాపోయింది.

వెట్రి మారన్ అంటే ఇష్టం 

Advertisement

ఇదిగో అలా టాలీవుడ్ డైరెక్టర్ తన పాత్ర అచ్చియమ్మ విషయంలో హద్దులు దాటి ఎక్స్ పోజింగ్ చేయించాడని ఆవేదన వ్యక్తం చేసిన ఈ అమ్మడు ఇపుడు హీరోయిన్ లని బోల్డ్ గా చూపించే డైరెక్టర్ వెట్రి మారన్ అంటే ఇష్టమని ఎలా చెబుతుంది అంటూ ఎకిపారేస్తున్నారు.నిజానికి వెట్రిమారన్ సినిమాలంటే ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు.కొన్ని సందర్భాల్లో చాలా బోల్డ్‌గా, స్కిన్ షో హద్దులు దాటేలా ఉంటాయి కూడా. ముఖ్యంగా ఆ మధ్య రిలీజ్ అయిన సినిమాలోని కొన్నిసీన్స్ పై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది.ఇక లేడీ రోల్స్ ని డిజైన్ చేసిన తీరుపై కూడా చాలా సార్లు విమర్శల వర్షం కురిసింది.పైగా జాన్వీ తమిళ దర్శకులలో ఎవరితో పని చేసినా ఓకే అని చెప్పడం బట్టి చూస్తే అక్కడ ఏ దర్శకులు ఎలా చూపించినా పర్లేదు కాని తెలుగు దర్శకులు మాత్రం హీరోయిన్లను గ్లామర్‌గా చూపిస్తే తప్పు అవుతుందా అంటూ మండి పడుతున్నారు.

తెలుగు దర్శకులపై విషం చిమ్ముతారో ! 

వెట్రిమారన్ సినిమాల విషయానికి వస్తే .. అసురన్, వడ చెన్నై, విసారణై, విడుదలై వంటి సినిమాల్లో హింసతో పాటు బోల్డ్ సీన్స్ కూడా ఒక రేంజ్ లో ఉంటాయి.ముఖ్యంగా కథ డిమాండ్ చేస్తే ఎలాంటి మొహమాటం లేకుండా సీన్స్ సినిమాలలో పెట్టేయడం ఆయన స్టైల్. మరి అలాంటి దర్శకుడి సినిమాలలో నటించాలని ఇష్టపడుతున్న జాన్వీకి తెలుగు దర్శకుల సినిమాలలో చేయాలంటే ఎందుకంత అభ్యంతరం అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు.చూడాలి మరి ముందు ముందు ఇలా ఇంకెంత మంది పరబాషా భామలు టాలీవుడ్ పై ,తెలుగు దర్శకులపై విషం చిమ్ముతారో !

ALSO READ ;49 ఏళ్ల సురేఖా వాణి.. యువకుడితో క్లోజ్ వీడియోలు! నిజమెంత?

Tags

Related News

‘డ్రాగన్ ‘ క్లైమాక్స్ కోసం మాస్టర్ ప్లాన్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..!

బాలయ్య ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. మరో అప్డేట్ రెడీ..!

ఆరోజుల్లో సోషల్ మీడియా లేకపోవడం మా అదృష్టం..నాగార్జున కామెంట్స్ వైరల్!

వందల కోట్లకు వారసురాలు.. సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ ఇదే!

మరో చిన్నారికి ప్రాణం పోసిన సోనూసూద్.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో!

సైలెంట్ గా పెళ్లిపీటలెక్కిన టాలీవుడ్ హీరోయిన్ ..!

విమర్శకులకు నిర్మాత స్ట్రాంగ్ కౌంటర్.. నిరూపిస్తే రూ.కోటి ఇస్తానంటూ!

Big Stories

Advertisement
×