Nagarjuna: టాలీవుడ్ నటుడు కింగ్ నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలకు నిర్మాతగా సమర్పకులుగా వ్యవహరిస్తూనే మరోవైపు హీరోగా కూడా ఎంతో బిజీగా ఉన్నారు. త్వరలోనే నాగార్జున (Nagarjuna )సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఇట్లు అర్జున(Itlu Arjuna). ఈ సినిమా నవంబర్ 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటుడు నాగార్జున కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా గురించి నాగార్జున చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇటీవల కాలంలో కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే హీరోలు తమ మొదటి సినిమాను విడుదల చేసే విషయంలో సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని నాగార్జున తెలిపారు. ఎవరేం చేసిన ఆ ఒత్తిడిని తొలగించలేమని ఈయన తెలిపారు. అయితే అదృష్టవశాత్తు మేము హీరోలుగా ఇండస్ట్రీలోకి వచ్చిన రోజులలో ఇలాంటి సోషల్ మీడియా లేదని ఆ విషయంలో తాము చాలా అదృష్టవంతులమని నాగార్జున తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియా మాత్రం చాలా రాక్షసి లాగా మారిపోయిందని, దానికి ఎలాంటి కనికరం లేదని నాగార్జున తెలిపారు.
మనం సోషల్ మీడియాలో ఉన్నామా లేదా అనే విషయం పక్కన పెడితే సోషల్ మీడియా ప్రభావం మాత్రం చాలా ఉందని తెలిపారు. అందుకే హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న వాళ్లు మానసికంగా చాలా స్ట్రాంగ్ గా ఉండాలని నాగార్జున ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో డెబ్యూ హీరోలు మాత్రమే కాకుండా సీనియర్ హీరోల సినిమాలు సైతం ఏమాత్రం తేడా కొట్టిన సోషల్ మీడియా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తున్న సంగతి తెలిసిందే.
ఇలా సోషల్ మీడియా గురించి తాజాగా నాగార్జున చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక నాగార్జున సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన ఆర్ కార్తీక్ దర్శకత్వంలో కింగ్ 100 (King 100 Movie)అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు షూటింగ్ పనులు పూర్తి కావచ్చాయి. ఇక ఈ సినిమాని క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 24వ తేదీ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేశారు. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి నటి టబు(Tabu) పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ వీడియో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచింది. ఇందులో ఈమె మహంతి ఝాన్సీ రాణి అనే ఒక రాజకీయ నాయకురాలి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.
Also Read: వందల కోట్లకు వారసురాలు.. సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ ఇదే!