Mrunal Thakur:దీపావళి సందర్భంగా సినీ స్టార్స్ తమ తమ క్రేజీ లుక్స్ ని ,ఫెస్టివల్ అప్ డేట్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మనం చూస్తునే ఉంటాం.ఇదిగో అదే బాటలో నేనూ నడుస్తానంటూ సాలిడ్ పోస్ట్ వదిలింది బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. .
“May Maa Lakshmi bless every home with abundance and grace” అంటూ సోషల్ మీడియాలో ఓ బ్యూటిఫుల్ పిక్స్ తో పెట్టిన పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.ప్రతి ఇంట్లో సంతోషం, సిరిసంపదలు ఉండాలి.. అందరిపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలి అంటూ మృణాల్ వదిలిన ఈ పోస్ట్ చూసి ఫిదా మా మృణాల్ మనసు మంచిది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫాలోవర్స్.
ఇక ఈ సందర్భంగా మృణాల్ షేర్ చేసిన ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఎరుపు రంగు డ్రెస్‌లో బంగారు రంగు డిజైన్స్‌తో చెవులకు బంగారు జుంకాలు, సింపుల్ మేకప్‌తో ఇచ్చిన లుక్ అదిరిపోయిందని చెప్పాలి. ముఖ్యంగా తన ట్రెడిషనల్ డ్రెస్ లో ఇచ్చిన పోజులు నెక్స్ట్ లెవెల్ అనడంలో సందేహం లేదు.
సాధారణంగా మృణాల్ తన సినిమాలు, ఫొటోషూట్స్‌కు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుందన్న విషయం చెప్పక్కర్లేదు. ఈసారి మాత్రం తన బ్యూటిఫుల్ ట్రెడిషనల్ పిక్స్ తో పాటు ఆకట్టుకునే మెసేజ్ ని క్యాప్షన్ గా పెట్టి అభిమానుల మనసు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ . దీంతో ఈ ఫొటోలే ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక మృణాల్ సినిమాల విషయానికి వస్తే..హిందీ లో సీరియల్స్ తో ఎంట్రీ ఇచ్చిన మృణాల్ తెలుగులో చేసిన ‘సీతారామం’ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపొయింది.ముఖ్యంగా ఈ సినిమాలో మృణాల్ ఇచ్చిన ఫెర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్.అయితే ఆ తర్వాత చేసిన ఫ్యామిలీ స్టార్ సినిమాని ఫ్యామిలీస్ తిరస్కరించడంతో కాస్త స్లో అయిపోయింది.ఇక నానితో హయ్ నాన్న అంటూ సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా డెకాయిట్ సినిమాలో మెప్పించింది కూడా.
ఇక హిందీలో ‘జెర్సీ’, ‘సూపర్ 30’, ‘బట్లా హౌస్’ వంటి సినిమాలతో మంచి గుర్తింపే తెచ్చుకుంది. ముఖ్యంగా 2026లో సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి నటించిన ‘దో దివానే షహర్ మే’ రొమాంటిక్ డ్రామా,మరోవైపు వరుణ్ ధావన్, పూజా హెగ్డేలతో కలిసి చేసిన ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ సినిమాలతో బాలీవుడ్ లో పాగా వేసే పనిలో పడింది ఈ అమ్మడు.
ఇక రాబోయే సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’లో ప్రముఖ పాత్రలో కనిపించనుందని టాక్.మొత్తానికి సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ అభిమానులను పలకరిస్తున్న మృణాల్.. ఈసారి తన ట్రెడిషనల్ లుక్ తో ఫాలోవర్స్ ని ఫిదా చేసేసింది !