Idupu Kayitham:ఫోక్ సాంగ్స్ లో తనదైన స్టెప్పులతో సాలిడ్ ఫ్యాన్స్ బేస్ సొంతం చేసుకున్న నాగ దుర్గ ఇపుడు ‘ఇడుపు కాయితం’ సినిమాతో ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అయిపొయింది.వంశీ కృష్ణ దొండపాటి దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా వస్తున్న ఈ సినిమాని బన్నీ వాస్, సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెల్సిందే.ఇక ఈ సినిమా డిసెంబర్ 11న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు కూడా .ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దీపావళి సందర్భంగా ఓ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది మూవీ టీమ్.
నాగదుర్గ వేసిన స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్
ఈ క్రమంలోనే తాజాగా ‘బారాత్ బీట్’ అనే పాటను విడుదల చేశారు మేకర్స్. దీపావళి విషెస్ చెబుతూ రిలీజ్ చేసిన ఈ పాట ఇప్పుడు నెట్టింట హైలైట్ అయిపొయింది.పెళ్లి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ పాటలో నాగదుర్గ తన డ్యాన్స్‌తో అదరగొట్టిందనే చెప్పాలి. ముఖ్యంగా ఇందులో నాగదుర్గ వేసిన స్టెప్పులు పాటకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.
ఇక ఈ పాటలో నాగదుర్గ శ్రీలతగా అలరిస్తుంటే, ప్రియదర్శి శ్రీనివాస్‌గా కనిపించనున్నాడు.వీరిద్దరి పెళ్లి బారాత్ సందర్భంగా వచ్చే ఈ ‘బారాత్ బీట్’ను తనదైన న్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్ళాడు మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి.ఇక పాటకి తగ్గట్టుగా సాలిడ్ మాస్ బీట్ యాడ్ అవడంతో రాబోయే పెళ్ళిలలో ఈ పాటే స్పెషల్ గా మారుమ్రోగిపోతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్.
ఇక నాగదుర్గ డ్యాన్స్, పాటలోని విజువల్స్ చూస్తుంటే థియేటర్లు ఆడియన్స్ వేసే డాన్స్ కి ఊగిపోతాయనడంలో సందేహం లేదు.
హీరోయిన్ గా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో
ఇక నాగదుర్గ విషయానికి వస్తే ఈవిడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫోక్ సాంగ్స్‌తో ఇప్పటికే చాలామందికి చేరువై తన డ్యాన్స్‌తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా పేరు గల్ల పెద్దిరెడ్డి, ఎర్రా ఎర్రా రుమాలు ,తిన్న తీరం పడుతలే వంటి పాటలు నాగ దుర్గ కి ఎక్కడ లేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించి పెట్టింది.ఇక మరి టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
డిసెంబర్ 11న ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !
మరోవైపు ప్రియదర్శి తన కామెడీ టైమింగ్ ,న్యాచురల్ యాక్టింగ్ కి ఆడియన్స్ లో మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా చిన్న సినిమాలతోనూ మంచి సక్సెస్ అందుకుంటూ తనకంటూ ఓసాలిడ్ మార్కెట్ సంపాదించుకున్నాడు కూడా.ఇక ఈ సినిమాలో సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రి, జోర్దార్ సుజాత, చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు వంటి వారు కీరోల్స్ పోషించడం ఇక్కడ మరో విశేషం.చూడాలి మరి తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో మంచి అంచనాలతో వస్తున్న ఈ ‘ఇడుపు కాయితం డిసెంబర్ 11న ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !
ALSO READ :వెట్రిమారన్ సినిమాల్లో అలాంటి సీన్లు ఓకేనా? జాన్వీపై నెటిజన్ల సెటైర్లు