Film industry:సినీ ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి ఎంతో మంది నటీనటులు ఎన్నో కలలతో అడుగుపెడతారు. అయితే అలా వచ్చిన వారికి అదృష్టం తలుపు తట్టింది అంటే ఊహించని రేంజ్ కు వెళ్ళిపోతారు. అయితే అందరికీ అవకాశాలు అంత త్వరగా రావు కూడా.. ఈ అవకాశాల కోసం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఎంతోమంది వ్యక్తులను నమ్మాల్సి వస్తుంది. అయితే అలా నమ్మకంగా ఉన్న వ్యక్తులే ఆఖరికి వారిని లైంగికంగా లోబరుచుకోవాలని ప్రయత్నం చేస్తారు. మరి కొంతమంది లోబరుచుకుంటారు కూడా. అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడి.. ఆఖరికి తమను సమర్పించుకున్న తర్వాత అవకాశాలు లేకుండా చేసి వారి జీవితాలను నాశనం చేస్తూ ఉంటారు.
ఇకపోతే ఇలాంటి సంఘటనలు ఇండస్ట్రీలో చాలానే జరిగాయి. అయితే అందులో కొంతమంది ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత సైలెంట్ గా ఇండస్ట్రీకి దూరమైతే.. మరి కొంతమంది తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసుల వరకు తీసుకెళ్లి వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే బాధితులు చేసే ఫిర్యాదుకు నేరస్తులు కూడా అరెస్టు అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ క్రమంలోనే ఒక నటి కూడా లైంగిక ఆరోపణలు చేస్తూ నిర్మాతపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. తనను లైంగికంగా వాడుకొని అవకాశాలు ఇప్పిస్తానని ఇప్పుడు దూరం పెట్టారు అంటూ ఫిర్యాదు చేసింది.
అవకాశాల పేరిట భారీ మోసం..
అసలు విషయంలోకి వెళ్తే.. హర్యానా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి పేరు సొంతం చేసుకున్న నిర్మాత, నటుడు ఉత్తమ్ కుమార్ (Uttam Kumar) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అక్కడ ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడు కూడా.. అలాంటి ఈయన ఇప్పుడు అత్యాచారం కేసులో అరెస్టయ్యారు. సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక నటిని లైంగికంగా వాడుకున్నారట. ఇప్పుడు అవకాశాలు ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని.. తనకు న్యాయం కావాలి అంటూ ఆ నటి ఉత్తమ్ పై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. దీనితో నటి ఫిర్యాదు మేరకు ఉత్తమ్ పై రేప్, ఎస్సీ ఎస్టీ యాక్ట్ తో సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ముఖ్యమంత్రి నివాసం ముందు ఆత్మహత్యాయత్నం చేసిన నటి..
ఇకపోతే తనకు అన్యాయం జరిగిందని.. తనకు న్యాయం కావాలి అంటూ బాధిత నటి హర్యానా సీఎం ఇంటిముందు ఆత్మహత్యాయత్నం చేసింది. సెప్టెంబర్ 6వ తేదీన బాధిత నటి నోయిడా నుండి లక్నో వచ్చి నేరుగా ముఖ్యమంత్రి నివాసం సమీపంలో టాంగో -1 బార్కేడింగ్ వద్దకు వెళ్లి.. దాదాపు 500 మీటర్ల దూరంలో తన బ్యాగ్ నుండి పెట్రోల్ బాటిల్ తీసుకొని..తనపై పోసుకోవడానికి ప్రయత్నం చేసింది. దీంతో అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది వెంటనే జోక్యం చేసుకొని ఆ మహిళ నుండి బాటిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే పోలీస్ అధికారులు ఆ వీడియోలో తనను అడ్డుకున్నట్లు చూపించారు. అయితే తన ఫిర్యాదు పై పోలీసులు వెంటనే చర్య తీసుకోకపోవడం వల్లే తాను ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాను అంటూ బాధిత నటి తెలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ఆ నటి ఎవరు?
ఆ నటి ఎవరు? అనే విషయానికొస్తే.. ఈమె హాపూర్ కు చెందినవారు.. నోయిడా లోని సెక్టార్ 53లో నివసిస్తున్నారు. హర్యానా పరిశ్రమలో ప్రసిద్ధ కళాకారిణిగా “రాజ్జీ బోల్జా” అనే పాటతో మరింత గుర్తింపు సొంతం చేసుకుని.. అనేక మ్యూజిక్ వీడియోలలో కూడా పనిచేసింది. పైగా వివిధ ప్రాజెక్ట్లలో ఉత్తమ్ కుమార్ తో కలిసి పనిచేసిన ఈమె.. తన ఫిర్యాదులో 2020లో ఉత్తమ్ కుమార్ ను కలిశానని , అయితే ఒక సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇస్తానని తనను లైంగికంగా వాడుకొని ఇప్పుడు మోసం చేశాడని చెప్పుకొచ్చింది.