OG Guns N Roses Song : సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఓ జి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత చేస్తున్న స్ట్రెయిట్ ఫిలిం ఇది. హరిహర వీరమల్లు సినిమా చేసిన కూడా అది ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన ప్రతి వీడియో కంటెంట్ కూడా సినిమా మీద అంచనాలను మరింత రెట్టింపు చేసింది.
ఇక ఓ జి సినిమా నుంచి తాజాగా గన్స్ అండ్ రోజెస్ అనే పాటను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాను ఊపేస్తుంది. తమన్ ఈ సాంగ్ కంపోజ్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అయితే ఈ సాంగ్ అనౌన్స్ చేసిన టైం కి రిలీజ్ చేయలేకపోయారు. ఆ టైం కి రిలీజ్ చేయలేక పోయినా కూడా, కొంచెం పాట లేటవుతుంది కానీ 300% పగిలిపోవడం పక్క అంటూ హైప్ మరింత రెట్టింపు చేశారు.
గతంలో ఎస్ ఎస్ తమన్ మాట్లాడుతూ అనిరుద్ కంపోజ్ చేసిన మాస్టర్, విక్రమ్, లియో సినిమాలకు ఓజీ సినిమా సాంగ్స్ సమాధానం ఇస్తాయి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పుడు అందరూ తమన్ అతి చేస్తున్నాడు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఓజి పాటలు వింటుంటే నిజం అనిపించేలా ఉన్నాయి. ఆల్రెడీ రెండు సాంగ్స్ అదిరిపోయే ఇప్పుడు మూడవ సాంగ్ వచ్చేసింది.
ఈ సాంగ్ లో ఒకటి కూడా విజువల్ లేకుండా మంచి హైప్ క్రియేట్ చేశారు. కేవలం యానిమేషన్ తో సాంగ్ మొత్తం పూర్తి చేశారు. కానీ యానిమేషన్ మాత్రం పీక్ రేంజ్ లో ఉంది అని చెప్పాలి. మొత్తానికి ఈ సాంగ్ లో కూడా హంగ్రీ చీతా ట్యూన్ తో పాటు లిరిక్స్ కూడా కొంతమేరకు యాడ్ చేశాడు. మొత్తానికి ఒక్కొక్క సాంగ్ వింటుంటే సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో అర్థం అవుతుంది. విపరీతమైన అంచనాలను వీడియో కంటెంట్ పెంచుతుంది. మరి సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇంకో పది రోజుల్లో సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.