Jr NTR: బాల రామాయణం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్. చాలా చిన్న ఏజ్ లోనే తన ప్రతిభను చూపించాడు. తను హీరోగా చేసిన మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకుడుగా పరిచయమైన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఎన్టీఆర్ కు మంచి గుర్తింపు వచ్చింది.
అయితే ఎన్టీఆర్ చాలామంది దర్శకులను తనతో సినిమా చేయమని అడుగుకున్న సందర్భాలు కోకొల్లలు. వాస్తవానికి ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకి హీరో కాదు. ముందుగా ప్రభాస్ ను అనుకున్నారు. కానీ పట్టుపట్టి మరీ ఎన్టీఆర్ ని ఆ సినిమాలో పెట్టారు. అప్పుడే రాజమౌళి నాకేంటి వీడు దొరికాడు అని అనుకున్నారు కూడా. ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పేసారు. అయినా ఇటువంటి గుర్రంతో పందెం గెలిస్తేనే సత్తా కదా అనే ఆలోచనతో ఆ సినిమా చేశాను అని రాజమౌళి ఒప్పుకున్నాడు.
ఒకప్పుడు ఒక దర్శకుడు హిట్ సినిమా చేస్తే ఎలా అయినా సరే ఆ దర్శకుడితో సినిమా చేయాలి అనే ఆలోచనలో ఉండేవాడు ఎన్టీఆర్. అలాంటి ఆలోచనతో చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయింది. అతనొక్కడే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు సురేందర్ రెడ్డి. మొదటి సినిమాతోనే అందర్నీ షాక్ కు గురయ్యేలా చేశాడు.
ఆ సినిమా ఏ ముహూర్తాన హిట్ అయిందో వెంటనే ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఆ దర్శకుడు వెంటపడ్డారు. మరోవైపు సురేందర్ రెడ్డి కి ఎన్నో అవకాశాలు వస్తున్న కూడా తనను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయించి మరి అశోక్ సినిమా చేశారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేదు. ఈ విషయాన్ని స్వయంగా సురేందర్ రెడ్డి చెప్పారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమా హిట్ అందుకున్న తర్వాత ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్య అనే సినిమాను చేశారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని డిజాస్టర్ గా మిగిలింది. కిక్ సినిమా హిట్ అయిన తర్వాత ఎన్టీఆర్ తో చేసిన ఊసరవెల్లి సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది. కందిరీగ వంటి హిట్ సినిమా అందుకున్న తర్వాత ఎన్టీఆర్ తో రభస అనే సినిమాను చేశాడు సంతోష్. ఇక ఆ సినిమా ఫలితం కూడా మనకు తెలిసిందే.
ఇక బోయపాటి సింహా సినిమా తర్వాత ఎన్టీఆర్ తో దమ్ము అనే సినిమాను చేశాడు. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది. ఇలా హిట్ అయిన దర్శకులతో ఏరుకోరి సినిమాలు చేయటం వలన బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ ని చూశాడు తారక్. తారక్ తో సినిమా చేసిన ఈ దర్శకులకు ముందు సినిమాలు బ్లాక్ బస్టర్లు. ఇలా బ్లాక్ మెయిల్ చేయడం వలనే సరిగ్గా సినిమాలను డీల్ చేయలేకపోయారు. రీసెంట్ టైమ్స్ లో ఫెయిల్యూర్ డైరెక్టర్స్ తో సినిమా చేసిన కూడా ఎన్టీఆర్ మంచి సక్సెస్ అందుకుంటున్నారు.
Also Read: Suman Shetty : కృష్ణ భగవాన్ అలాంటోడు.. అందుకే ఆయనతో గొడవ