E-Paper
Advertisement

గిరిబాబు మరణం.. చివరి చూపుకు నోచుకోలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్న నటుడు!

గిరిబాబు మరణం.. చివరి చూపుకు నోచుకోలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్న నటుడు!
Advertisement

Murali Mohan On Giribabu: టాలీవుడ్ సీనియర్ సినీ నటుడు గిరిబాబు మరణించిన(Giri Babu Death) సంగతి తెలిసిందే.. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఇలా చికిత్స పొందుతున్న గిరిబాబు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించారు. ఈయన మరణ వార్త తెలిసిన ఎంతోమంది సినీ ప్రముఖులు ఆయనను చివరి చూపు చూడటం కోసం పెద్ద ఎత్తున తరలి వస్తూ నివాళులు అర్పిస్తున్నారు. అయితే సీనియర్ నటుడు మురళీమోహన్(Murali Mohan) మాత్రం తాను గిరిబాబును చివరిగా చూడలేకపోయాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

కన్నీళ్లు పెట్టుకున్న మురళీ మోహన్..

మురళీమోహన్ గిరిబాబు సుమారు 25 సినిమాలలో కలిసి నటించారు. మురళీమోహన్ జయభేరి ప్రొడక్షన్ లో గిరిబాబు దాదాపు మూడు సినిమాలకు దర్శకత్వం కూడా వహించినట్లు ఈ సందర్భంగా మురళీమోహన్ గుర్తు చేసుకున్నారు. గిరిబాబు మురళీమోహన్ నటించిన జగమే మాయ సినిమా గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సినిమాలో మొదటగా హీరోగా అవకాశం గిరిబాబుకి వచ్చింది కానీ ఆయన విలన్ పాత్రకి సరిగ్గా సెట్ అవుతారని భావించి తనని హీరోగా తీసుకున్న విషయాన్ని కూడా మురళీమోహన్ తెలియజేశారు. ఇలా మా ఇద్దరి మధ్య చాలా మంచి అనుబంధం ఉందని అలాంటి గొప్ప నటుడు ఇక లేరనే వార్త జీర్ణించుకోలేనిదని తెలిపారు.

అయ్యప్ప మాలలో మురళీమోహన్ ..

Advertisement

గత రెండు సంవత్సరాలుగా గిరిబాబు అనారోగ్యంతో ఉన్నారని తెలిసి ఒకసారి తాను వెళ్లి పలకరించాను అయితే తనని చాలా వరకు గుర్తుపట్టలేకపోయారని మురళీమోహన్ తెలిపారు. తనని మరోసారి చూద్దామనుకున్నాను కానీ కుదరలేదు. తనని చూడాలనుకున్న లోపే మరణించారని తన మరణం తర్వాత చివరిసారిగా నివాళులు అర్పించడానికి కూడా వీలు లేకపోయిందని మురళీమోహన్ తెలిపారు. ప్రస్తుతం తాను అయ్యప్ప మాల వేయడం వల్ల గిరిబాబు చివరి చూపుకు నోచుకోలేకపోయానని కన్నీళ్లు పెట్టుకున్నారు.

సొంత గ్రామంలో అంత్యక్రియలు..

ఇలా తాను అక్కడికి వెళ్లలేకపోయినప్పటికీ ఆయన మరణం పట్ల సంతాపాన్ని తెలియజేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇక ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రేమికుల గిరిబాబు పార్థివ దేహానికి సందర్శించి ఆయనకు నివాళులు అర్పించారు. ఇక గిరిబాబు అంత్యక్రియలను తన సొంత గ్రామం రావినూతలలో నిర్వహించబోతున్నట్లు తన కుమారుడు రఘు బాబు తెలియజేశారు. తన అంత్యక్రియలను అక్కడ నిర్వహించాలన్నదే నాన్న కోరిక అని తెలిపారు. మరి కాసేపట్లో ఈయన అంత్యక్రియలు తన సొంత గ్రామంలో నిర్వహించబోతున్నారు. గిరిబాబు ఇండస్ట్రీలో కొనసాగుతూ సుమారు 600 లకు పైగా సినిమాలలో నటించారు. ఈయన విలన్ గా, హీరోగా, దర్శక నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో పనిచేశారు.

Advertisement

Also Read: అంతరిక్షంలోకి వెళ్లాలనే అమ్మాయి కల..ఆసక్తికరంగా డియర్ ఆస్ట్రోనాట్ ట్రైలర్!

Related News

అంతరిక్షంలోకి వెళ్లాలనే అమ్మాయి కల..ఆసక్తికరంగా డియర్ ఆస్ట్రోనాట్ ట్రైలర్!

నాన్న చివరి కోరిక అదే.. ఎలా చనిపోయారో చెబుతూ రఘుబాబు ఎమోషనల్ వీడియో!

ఏడడుగులు వేయబోతున్న వరుణ్ తేజ్ బ్యూటీ.. వరుడు ఎవరంటే?

తల్లి కోసమే ఇండస్ట్రీకి దూరం.. అసలు విషయం చెప్పిన మాస్టర్ భరత్!

బిగ్ టీవీ ఫోక్ నైట్ 2026.. జానపద గీతాలకు అదిరిపోయే స్టెప్స్ వేసేద్దామా? ఎప్పుడు.. ఎక్కడంటే?

అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో ఆస్తి వివాదం.. అసలేం జరిగిందంటే?

ఐదు దశాబ్దాల సినీ ప్రయాణం.. గిరిబాబు అందుకున్న పురస్కారాలు ఇవే!

Big Stories

Advertisement
×