Raghu Babu:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న గిరిబాబు.. వృద్ధాప్య సమస్యల కారణంతో 82 సంవత్సరాల వయసులో సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. నవంబర్ 14 మధ్యాహ్నం 3:18 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిపినట్లు కిమ్స్ హాస్పిటల్ ప్రకటన విడుదల చేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇక గిరిబాబు మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), ప్రముఖ స్టార్ హీరో , ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లాంటి సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు.
ఇకపోతే గిరిబాబు మరణం పై ఆయన కుమారుడు రఘుబాబు (Raghubabu) మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్లు చేశారు. రఘుబాబు మాట్లాడుతూ..” నాలుగు రోజుల క్రితం నాన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అల్జీమర్స్, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. అయితే శనివారం మధ్యాహ్నం ఆయన తుది శ్వాస విడిచారు.ఆదివారం అనగా నవంబర్ 15వ తేదీన మా స్వగ్రామం రావినూతలలో నాన్న అంత్యక్రియలు నిర్వహిస్తాము అంటూ క్లారిటీ ఇచ్చారు.
మా నాన్నకు తన సొంత ఊరు అంటే చాలా మమకారం. అందుకే హైదరాబాదులోని ఫిలిం ఛాంబర్ లో అభిమానుల సందర్శనార్థం మూడు గంటల పాటు పార్దివదేహాన్ని ఉంచారు. అయినా సరే పెద్ద సంఖ్యలో వచ్చి నివాళులు అర్పించారు. నవంబర్ 15వ తేదీన మధ్యాహ్నం 3-4 గంటల మధ్య మా సొంత ఊరిలో నాన్నగారి అంత్యక్రియలు నిర్వహిస్తాము అంటూ కన్నీటి పర్యంతమవుతూ రఘుబాబు విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
also read:ఏడడుగులు వేయబోతున్న వరుణ్ తేజ్ బ్యూటీ.. వరుడు ఎవరంటే?
గిరిబాబు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేస్తూ.. ఒక పోస్ట్ విడుదల చేశారు. ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించిన గిరిబాబు ఐదు దశాబ్దాల పాటు 600 పైగా చిత్రాలలో నటించి.. నటుడిగా, విలన్ గా, హాస్యనటుడిగా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ తెలిపారు. అలాగే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనను ఎంతగానో కలచివేసింది అంటూ ఎమోషనల్ అయ్యారు. గిరిబాబు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే చిరంజీవి, బాలకృష్ణ, నారా లోకేష్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు విచారం వ్యక్తం చేశారు. ఇక మరో ఒకవైపు మా అసోసియేషన్ కూడా గిరిబాబు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది.