E-Paper
Advertisement

ఏడడుగులు వేయబోతున్న వరుణ్ తేజ్ బ్యూటీ.. వరుడు ఎవరంటే?

ఏడడుగులు వేయబోతున్న వరుణ్ తేజ్ బ్యూటీ.. వరుడు ఎవరంటే?
Advertisement

Tollywood:2026 సౌత్ సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీలకు బాగా కలిసి వచ్చింది అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) , రష్మిక మందన్న (Rashmika mandanna) వివాహం చేసుకొని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ తర్వాత అల్లు శిరీష్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పునర్నవి భూపాలం ఇలా ఒకరి తర్వాత ఒకరు ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో ఇరుముడి హీరోయిన్ ప్రియా భవాని శంకర్ తన ప్రియుడిని వివాహం చేసుకుంది. అలాగే మహేష్ బాబు అతిధి సినిమాలో హీరోయిన్గా నటించిన అమృత రావు సోదరి ప్రీతికరావు కూడా ఏడడుగులు వేసింది. అలాగే కోలీవుడ్ సెన్సేషన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ – కావ్య గ్రీస్లో వివాహం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు.

పెళ్లి పీటలు ఎక్కబోతున్న మిర్నాళిని రవి..

అలాగే అటు సాయి ధరం తేజ్, తేజ సజ్జ కూడా ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో మరో హీరోయిన్ కూడా వివాహం చేసుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఆమె ఎవరో కాదు వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా నటించిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన మిర్నాళిని రవి (Mirnalini Ravi) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. తన చిరకాల మిత్రుడు, పరంపొరుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మహా విష్ణు (Maha Vishnu) తో ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే పెళ్లికి ముందు తన స్నేహితులతో కలిసి ఆమె బ్యాచిలర్ పార్టీని కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు.

గ్రాండ్ గా బ్యాచిలర్ పార్టీ..

Advertisement

అంతేకాదు ఈ బ్యాచిలర్ పార్టీకి సంబంధించిన ప్రత్యేక వీడియోలను కూడా ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినీ సెలబ్రిటీలు , అభిమానులు, నెటిజన్స్ మిర్నాళిని రవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కొత్త అధ్యాయం మొదలు పెట్టబోతున్న మిర్నాళిని..

దాదాపు 7 సంవత్సరాలుగా మహావిష్ణు – మిర్నాళిని మధ్య స్నేహం ఉంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో ఈ ఏడాది ఆగస్టులో వీరు నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక మహావిష్ణు విషయానికొస్తే.. ఆధ్యాత్మిక గురువుగా, ప్రముఖ వక్త గా మంచి పేరు దక్కించుకున్నారు. వీరి వివాహ వేదిక, ఖచ్చితమైన తేదీపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక పెళ్లి తర్వాత ఈమె నటనకు దూరం కాబోతోంది అనే ప్రచారం జరుగుతున్నప్పటికీ.. దీనిపై ఇంకా స్పందించలేదు. ఒకవేళ నిజంగానే వివాహం తర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతుందా? లేక మళ్లీ సినిమాలలో బిజీ అవుతుందా? అన్న విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

also read:బిగ్ బాస్ హౌస్ లో పూరీ జగన్నాథ్ సపోర్టు ఎవరికో తెలుసా?

మిర్నాళిని రవి సినిమాలు..

ప్రముఖ తమిళ నటిగా గుర్తింపు తెచ్చుకున్న మిర్నాళిని రవి.. సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఈ వీడియోలు చూసిన త్యాగరాజన్ కుమార్ రాజా ఈమెకు సూపర్ డీలక్స్ సినిమాలో నటించే అవకాశం కల్పించారు. అలా 2019లో వెండితెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత గద్దల కొండ గణేష్ చిత్రంలో నటించిన ఈమె.. ఈ సినిమాతో మంచి పేరు దక్కించుకుంది. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మామా మశ్చీంద్ర వంటి చిత్రాలలో నటించింది.

?utm_source=ig_web_copy_link&srtk=MzRlODBiNWFlZA==

Related News

తల్లి కోసమే ఇండస్ట్రీకి దూరం.. అసలు విషయం చెప్పిన మాస్టర్ భరత్!

బిగ్ టీవీ ఫోక్ నైట్ 2026.. జానపద గీతాలకు అదిరిపోయే స్టెప్స్ వేసేద్దామా? ఎప్పుడు.. ఎక్కడంటే?

అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో ఆస్తి వివాదం.. అసలేం జరిగిందంటే?

ఐదు దశాబ్దాల సినీ ప్రయాణం.. గిరిబాబు అందుకున్న పురస్కారాలు ఇవే!

గిరిబాబు తెలుగులో నటించిన చివరి చిత్రం ఇదే!

గిరిబాబు మరణంపై చిరంజీవి దిగ్భ్రాంతి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

ఆ ఒక్క హీరోతో 150 సినిమాలలో కలిసి నటించిన గిరిబాబు!

Big Stories

Advertisement
×