BigTV English
Advertisement

AP Liquor Scam: వరుస అరెస్టులు.. ఏపీ లిక్కర్ స్కాంలో వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు..

AP Liquor Scam: వరుస అరెస్టులు.. ఏపీ లిక్కర్ స్కాంలో వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు..

AP Liquor Scam:12 అట్టపెట్టెలు..11 కోట్లు.. ఇదీ ఏపీ మద్యం కుంభకోణంలో కీలక మలుపునకు కారణమైంది. హైదరాబాద్ శివార్లలో ఉన్న శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫాంహౌస్‌లో భారీగా నోట్ల కట్టలు బయట పడ్డాయి. లిక్కర్ స్కాంలో ఏ 40గా ఉన్న నిందితుడు వరుణ్ కుమార్ ఇచ్చిన సమాచారంతో పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగిన సిట్ అధికారులు.. 11 కోట్లను స్వాధీనం చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.


అర్థరాత్రి సోదాలు చేసిన సిట్ సభ్యులు
లిక్కర్ కేసులో దొరికిపోతానన్న ఆలోచనతో.. గత కొన్నాళ్లుగా దుబాయ్‌లో ఉంటున్న వరుణ్‌ కుమార్ సిట్ దూకుడుతో దిగిరాక తప్పలేదు. చివరకు రెండు రోజుల క్రితం ఇండియాకు వచ్చి సిట్ ముందు హాజరయ్యాడు. ఆ సందర్భంగా చేసిన విచారణలో అన్ని విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. మద్యం ముడుపుల డబ్బు ఎలా వసూలు చేశారు.. ఎవరికి ఇచ్చారు.. ఎక్కడెక్కడ వాటిని భద్రపరిచారు అన్న అంశాలపై అన్ని చెప్పడంతో సిట్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

12 అట్టపెట్టెల్లో రూ. 11 కోట్లు స్వాధీనం
వరుణ్ చెప్పిన వివరాలతోనే మంగళవారం అర్థరాత్రి తర్వాత ప్రత్యేక బృందాలు హైదరాబాద్ వచ్చాయి. వరుణ్‌ను వెంటపెట్టుకొని సులోచన ఫాంహౌస్‌కు వెళ్లి నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నాయి. మొదట ఐదు పెట్టెలు గుర్తించిన సిట్ సభ్యులు.. మరింత సోదాలు చేసి 12 డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని తెరిచి చూడడంతో ఏకంగా 11 కోట్లు దొరికాయి. వీటన్నింటినీ లెక్కపెట్టేందుకు రెండు కరెన్సీ కౌంటింగ్ మిషన్‌లను సైతం తమతో తీసుకెళ్లారు సిట్ సభ్యులు.


వరుణ్‌ను వెంటబెట్టుకొని మరీ సోదాలకు వచ్చిన సిట్
ఈ మద్యం ముడుపుల వసూళ్లకు సంబంధించిన నెట్‌వర్క్ నడిపిన A1 రాజ్ కేసిరెడ్డి, అతని ప్రధాన అనుచరుడు A8గా ఉన్న బూనేటి చాణక్య కలిసి.. వాళ్లకు బాగా తెలిసిన పురుషోత్తం వరుణ్ కుమార్‌తో ఈ డబ్బును పౌంహౌస్‌కు తరలించారు. డబ్బును వర్థమాన్ ఇంజినీరింగ్ కాలేజీలో అధికారిగా పనిచేసే ముత్యాల వినయ్ కుమార్ రెడ్డికి అప్పగించారు.

Also Read: అంబులెన్స్‌లో ఆక్సీజన్ లేక రైతు మృతి.. 

అయితే.. ఆ అట్టపెట్టెల్లో డబ్బులున్నట్లు చెప్పకుండా కేవలం ముఖ్యమైన ఫైల్స్ మాత్రమే ఉన్నట్లుగా వినయ్‌కు చెప్పాలని రాజ్ కెసిరెడ్డి.. బూనేటి చాణక్యకు సూచించాడు. చాణక్య కాస్తా విషయాన్ని వరుణ్‌కు చెప్పి డబ్బు అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో వరుణ్.. కేవలం ఫైల్స్ మాత్రమే ఉన్నాయని చెబుతూ వినయ్‌కి డబ్బుల బాక్స్‌లు అప్పగించాడు. చివరకు వరుణ్‌ సిట్ ముందుకు రావడం, విషయాలన్నీ వెల్లడించడంతో మద్యం ముడుపుల గుట్టు రట్టైందన్న మాట విన్పిస్తోంది.

Related News

Jogi Jagan: మిథున్ రెడ్డి అరెస్ట్ కి ఉపోద్ఘాతం.. జోగి అరెస్ట్ పై స్పందన తూతూ మంత్రం..

Karthika Pournami: నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు

Nara Bhuvaneshwari: లండన్ వేదిక.. నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025 పురస్కారం

Minister Lokesh: అప్పుడప్పుడూ ఏపీకి.. జగన్ ది వేరే భ్రమాలోకం.. మంత్రి లోకేశ్ ఫైర్

Syamala Ysrcp: నేను చెప్పిందేంటి? మీరు రాసిందేంటి? మీడియాపై చిందులు తొక్కిన శ్యామల

Vijayanagaram TDP: టీడీపీ జిల్లా.. రథసారథి ఎవరో?

Nara Lokesh: మంత్రి లోకేష్ సరికొత్త రికార్డ్.. 4వేలమందితో ప్రజా దర్బార్.. ప్రతి ఒక్కరితో వన్ టు వన్ ఇంటరాక్షన్

Rajamohan Reddy: మేకపాటి మాటలు.. జగన్ చెవిలో పడేనా?

Big Stories

×