BigTV English

Masturbation Break: స్వయం తృప్తి కోసం అరగంట బ్రేక్.. ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్!

Masturbation Break: స్వయం తృప్తి కోసం అరగంట బ్రేక్.. ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్!

Swedish Company Masturbation Break: ఉద్యోగులు మరింత యాక్టివ్ గా పని చేసేందుకు  కంపెనీలు కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. కొన్ని సంస్థలు కాసేపు గేమ్స్ ఆడుకునే అవకాశం కల్పిస్తాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగులు జిమ్ చేసేలా ప్రోత్సహిస్తాయి. మరికొన్ని సంస్థలు ట్రిప్పులు, పార్టీలు ప్లాన్ చేస్తాయి. అయితే, ఓ స్వీడిష్ కంపెనీ తన సిబ్బంది రిలాక్స్ అయ్యేందుకు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇంతకీ ఆ కంపెనీ తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఏంటో తెలుసా?


‘హస్తప్రయోగం’ కోసం అరగంట బ్రేక్!

స్వీడన్ కు చెందిన ఎరికా లస్ట్ ఫిల్మ్స్ అనే సంస్థ తమ ఉద్యోగుల కోసం ఎవరూ తీసుకోనటువంటి నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు స్ట్రెస్ కు గురి కాకూడదనే ఉద్దేశంతో ‘హస్తప్రయోగం’ కోసం బ్రేక్ ఇస్తోంది. రోజూ అరగంట పాటు ఈ విరామం అందిస్తోంది. 2022లో ఆ కంపెనీ  ఈ బ్రేక్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పట్లో ఇదో ట్రయల్‌ గా ప్రారంభమైంది. స్టాక్‌ హోమ్‌కు చెందిన ఈ కంపెనీ 40 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. ఈ సంస్థ ‘ఇండీ అడల్ట్ సినిమా’ కోసం కంటెంట్‌ ను క్రియేట్ చేస్తోంది. ఈ సమయంలో ఉద్యోగులు ఉద్రేకానికి గురవుతున్నట్లు గుర్తించింది. దాని నుంచి బయటపడేందుకు  హస్తప్రయోగ విరామాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎరికా తెలిపింది.


హస్తప్రయోగ నెల స్పూర్తితో..   

ఎరికా హస్తప్రయోగానికి బ్రేక్ ఇవ్వడానికి కారణం హస్తప్రయోగ నెల అని వెల్లడించింది. “మా కంపెనీ ఉద్యోగులకు కొత్తగా ఏదైన అనుభూతిని కల్పించాలని భావించిన సమయంలో ‘హస్తప్రయోగ నెల’ వచ్చింది. అప్పుడే తమ ఉద్యోగులకు కూడా రోజూ స్వయం సంతృప్తి పొందేందుకు అరగంట సమయం ఇవ్వాలని నిర్ణయించాం. ఆ నిర్ణయం ‘హస్తప్రయోగ నెల’కు అంకితం చేశాం” అని ఎరికా తెలిపింది. ఇందుకోసం కంపెనీలో ‘ది మాస్టుర్బేషన్ స్టేషన్’ అనే ప్రైవేట్ గదిని నిర్మించినట్లు తెలిపింది. ఇందులో ఉద్యోగులు స్వయం సంతృప్తి పొందుతారు. ప్రతి ఒక్కరూ “సంతోషంగా, మరింత రిలాక్స్‌ గా, వర్క్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేందుకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడింది. ఉద్యోగులలో సృజనాత్మకత, ఉత్సాహాన్ని కూడా పెంచింది” అని ఎరికా వెల్లడించింది.

మానసిక ఆరోగ్యంపైనా అద్భుతమైన ప్రభావం

ఇక ఎరికా తీసుకున్న ఈ నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “లైంగిక శ్రేయస్సు అనేది మనిషి మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.  అందుకే దాని గురించి అందరూ మాట్లాడాలి” అని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర కంపెనీలు కూడా తన ఆలోచనను ఫాలో అవుతున్నాయని ఎరికా వెల్లడించింది. అటు ఈ కంపెనీ తీసుకున్న నిర్ణయంపై పలువురు మానసిక వైద్యులు అభినందిస్తున్నారు. ఇలాంటి నిర్ణయం ఎరికా చాలా ధైర్యంగా తీసుకుందన్నారు. ఇలాంటి నిర్ణయాలు ఉద్యోగుల మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయంటున్నారు.

Read Also: ముందు చక్రం లేని సైకిల్‌పై సాహస యాత్ర.. ఘాట్ రోడ్డులో అతడి అడ్వేంచర్ చూస్తే షాకే!

Related News

Viral Video: ఈయన దాహమేస్తే ఇంజిన్ ఆయిల్ తాగేస్తాడు.. రోజూ ఏకంగా 8 లీటర్లు!

Viral Video: ఫ్లష్ కొట్టగానే.. బుస్సు అంటూ పైకిలేచిన తాచు పాము, పాపం.. గుండె జారింది!

Rare Meteor: ఆకాశంలో అరుదైన మెరుపులు.. నిజంగా ఉల్కాపాతమేనా?

Viral Video: రోడ్డు మధ్యలో కారు ఆపి.. హస్త ప్రయోగం.. ఇంత కరువులో ఉన్నావ్ ఏంట్రా?

Viral Video: నడి రోడ్డుపై భర్తను ఉతికి ఆరేసిన భార్య.. పెళ్లికాని ప్రసాదులు మీరు చాలా లక్కీ!

Viral News: పానీ పూరీల కోసం రోడ్డుపై కూర్చోని ధర్నా చేసిన మహిళ.. కారణం తెలిస్తే నవ్వు ఆగదు!

Hyderabad Rains: వానల్లో జనాలకు సాయం.. స్విగ్గి, జొమాటో డెలివరీ బాయ్స్‌ పై హైదరాబాదీలు ప్రశంసలు!

Chimpanzee: వామ్మో.. చింపాంజీలు ఇంత తాగుబోతులా? ఇన్నాళ్లూ ఈ విషయం తెలియదే!

Big Stories

×